సరైన నిర్ణయం
- Mohana Krishna Tata

- 2 hours ago
- 3 min read
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.
సరైన నిర్ణయం, తెలుగు కథ, కుటుంబ కథ, భావోద్వేగ కథ, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబ బంధాలు, గ్రామీణ కథ, తెలుగు సాహిత్యం, Telugu Story, Family Story, Emotional Story, Parenting Story, Inspirational Story

Saraina Nirmayam - Telugu Emotional Family Story | Mohana Krishna Tata
సరైన నిర్ణయం - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | తాత మోహనకృష్ణ
Published In manatelugukathalu.com On 29/06/2026
విడిపోయిన దంపతులు మళ్లీ కలిసిన కారణం ఏమిటి?
తాత మోహనకృష్ణ గారి సరైన నిర్ణయం కథలో తెలుసుకోండి.
"అమ్మా..! నాకు పెద్ద చాక్లెట్ కొను," అని అడిగింది బేబీ.
"ఎప్పుడూ అది కొను, ఇది కొను అని ఊరికే విసిగిస్తావు.. వెళ్ళు బేబీ!" అని కసురుకుంది వందన.
"నిన్ను కాకపోతే నేను ఎవరిని అడగాలమ్మా..? నాన్న ఉంటే నాన్నను అడిగేదానిని.. కొని ఇచ్చేవారు. 'నాన్న ఏడి?' అని అడిగితే ఎప్పుడూ చెప్పవు."
"సారీ బేబీ... అలాగే కొనిస్తానులే," అంది వందన.
కూతురిని పడుకోబెట్టి, తానూ నడుం వాల్చింది. కళ్ళ ముందు గతం కదిలింది..
******
ప్రేమిస్తున్నా అంటూ వెంటపడేవాడు వాసు. ప్రేమ మీద అంత నమ్మకం లేని వందన అతనిని పట్టించుకోలేదు. పైగా అతని మీద చాలా కోపం వచ్చింది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత...
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వు లేకపోతే బతకలేను," అని బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయాడు వాసు. అలా వందన మనసు గెలుచుకున్నాడు వాసు.
గతంలో వందన అక్కను కూడా ఇలాగే ఒకడు ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. ఆమె కూడా వందన లాగే అతనిని పట్టించుకోలేదు. చివరికి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తన వలన ఒక మనిషి ప్రాణం పోయిందన్న షాక్‌లో వందన అక్క కూడా చనిపోయింది. మళ్ళీ అలా జరగడం వందనకు అస్సలు ఇష్టం లేదు, భయం కూడా ఉంది. ఒక పక్క ప్రేమ అంటే అంత నమ్మకం లేకపోయినా సరే, వాసుకి ఓకే చెప్పింది వందన.
******
వందన, వాసుల పెళ్ళి జరిగింది. సంవత్సరానికి బేబీ పుట్టింది. ఆ తర్వాత నుంచి వాసు మారిపోయాడు. చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. ఉద్యోగం సరిగ్గా లేక, ఎప్పుడూ డబ్బుల కోసం వందనతో గొడవ పడేవాడు.
వందన, వాసుల మధ్య గొడవలు ఎక్కువై, ఇద్దరూ విడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వందన తీసుకున్న ఈ నిర్ణయం చూసి, ఆమె తల్లికి ఆశ్చర్యం కలిగింది. వాసుని తన తండ్రి పల్లెటూరికి తీసుకువెళ్ళిపోయాడు. వందన ఉద్యోగం చేసుకుంటూ, పాపని చూసుకుంటూ తల్లితో ఉండిపోయింది. ఆమెకు తండ్రి లేడు.
వందన తల్లి, భార్యాభర్తలు కలిసి ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ఎప్పుడూ వందనతో చెబుతూనే ఉండేది. తల్లిదండ్రులు విడిగా ఉంటూ కన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేది. కానీ తల్లి మాటలు వందన పట్టించుకునేది కాదు. దానికి వందన తల్లికి చాలా కోపం వచ్చింది. అయినా ఏం చేస్తుంది పాపం? మనసులో బాధపడడం తప్ప!
ఒకరోజు, వాసు తండ్రి గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయాడు. వందన తన మామగారి అంతిమ కార్యక్రమాలకు వాసు ఉంటున్న పల్లెటూరికి వెళ్ళింది. అప్పుడు అక్కడ ఊరి పెద్దలు...
"వందనా..! ఇప్పుడు వాసు ఒంటరివాడైపోయాడు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాసుని చూసుకున్నాడు, ఇప్పుడు అతనిని ఎవరు చూస్తారు? నువ్వు మళ్ళీ వాసుతో కలిసి ఉండాలి. ఇప్పుడు వాసు మారిపోయాడు. వాసు కోసం, మీ పాప కోసం సరైన నిర్ణయం తీసుకో," అని అంతా అన్నారు.
వందన ఏం నిర్ణయం తీసుకుంటుందా అని అందరిలో బాగా ఆసక్తి రేగింది. అందరూ వందన నిర్ణయం కోసం చూస్తున్నారు.
గ్రామ పెద్దలు చెప్పిన మాటల గురించి వందన బాగా ఆలోచించింది. 'పాపకి కూడా తండ్రి ప్రేమ కావాలి, ఎప్పుడూ నాన్న గురించి ఆత్రుతగా అడుగుతూనే ఉంటుంది' అని గుర్తుచేసుకుంది. వందన తన తల్లి మాటలను కూడా ఇప్పుడు గుర్తుచేసుకుంది.. 'భార్యాభర్తలు ఎప్పుడూ కలిసి ఉండే సమస్యలను పరిష్కరించుకోవాలని, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదని..'
గ్రామపెద్దలు చెప్పిన మాటలు వినడమే కరెక్ట్ అని నిర్ణయించుకుంది. వందన తీసుకున్న నిర్ణయం అందరిలో ఆనందం నింపింది.
సమాప్తం.
***********
తాత మోహనకృష్ణ గారి కొన్ని ఇతర రచనలు:
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ











Comments