సో లక్కీ
- Mohana Krishna Tata

- 20 hours ago
- 3 min read

So Lucky - Telugu Comedy Story | Mohana Krishna Tata
సో లక్కీ - తెలుగు హాస్య కథ | తాత మోహనకృష్ణ
Published In manatelugukathalu.com On 05/09/2026
సో లక్కీ ఒక సరదా మాట ఎలా ఊహించని పరిణామాలకు దారితీస్తుందో చెప్పే తెలుగు హాస్య కథ.
రామయ్యతో కలిసి ఆత్మగా మారిన సోమయ్య తన కుటుంబం తనను ఎంతగా ప్రేమిస్తుందో చూడాలని అనుకుంటాడు. అయితే అక్కడ కనిపించిన దృశ్యాలు అతని ఊహలకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి.ఈ హాస్యభరితమైన కథ నవ్విస్తూనే కుటుంబ బంధాలు, స్వార్థం, మాటల విలువ గురించి ఆలోచింపజేస్తుంది.
ఇద్దరు మిత్రులు రామయ్య, సోమయ్య చాలా రోజుల తర్వాత కలిశారు. అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత...
"ఒరేయ్ రామయ్య! నేను చాలా లక్కీ రా.. మాట వినే పెళ్ళాం దొరికింది.. నేను ఎంత అంటే అంతే! నాకన్నా తనకు ఏమీ ఎక్కువ కాదు.. నేనంటే ఎంత ప్రేమ అనుకున్నావు? ఇక నా పిల్లలు నా మాట అంటే గౌరవం.. నేను ఎంతంటే అంతే.. ఏది చేస్తే అదే! ఏదీ గట్టిగా అడగరు పాపం!"
"అయితే మంచిదే.. నువ్వు నిజంగానే సో లక్కీ" అన్నాడు రామయ్య.
"ఇప్పుడు ఉన్నట్టుండి నేను చనిపోతే.."
"అదేంటి అలా అంటున్నావు?" అడిగాడు రామయ్య.
"జస్ట్ ఫర్ ఫన్!"
"నన్ను వదిలేసి పోతావా..?"
"నిన్ను కూడా నా వెంట తీసుకుపోతాను.. బెస్ట్ ఫ్రెండ్వి కదా!"
"నేనెందుకు?"
"నీకా పెళ్ళాం, పిల్లలు ఎవరు లేరు. ఇక్కడేం చేస్తావు చెప్పు? నాతో పాటే నువ్వు కూడాను."
పై నుంచి తథాస్తు దేవతలు మాత్రం ఫన్‌గా తీసుకోలేదు... 'తథాస్తు' అన్నారు. ఇద్దరూ గుండెపోటుతో టపా కట్టేశారు.
సోమయ్య ఆత్మగా మారాడు. తన భార్య, పిల్లలు తనపై చూపించే ప్రేమను చూసి తృప్తిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. రామయ్య కూడా సోమయ్యతో పాటే... ఆత్మగా మారాడు.
"మనం మంచి బట్టలు షాపింగ్ చెయ్యాలేమో!"
"ఎందుకో?"
"అదే.. ఆత్మలు వైట్ డ్రెస్ వేసుకోవాలిగా... చాలా సినిమాలలో చూసాను అందుకే.."
"మనకి ఆటోమేటిక్‌గా వైట్ డ్రెస్ వచ్చేస్తుంది. వచ్చేసింది చూడు.. నువ్వు నేను వైట్ అండ్ వైట్‌లో ఎలా మెరిసిపోతున్నామో!"
"ముందు నీ భార్య దగ్గరకు వెళ్దాము. ఆమె నీ పై చూపించే ప్రేమ నేను చూడాలి, ఆమె నీ మీద ప్రేమగా మాట్లాడే మాటలు నేను వినాలి" అన్నాడు రామయ్య.
"చూడు! నా భార్య సుశీల నా శవం పై పడి ఎలా బాధపడుతున్నదో" అంది సోమయ్య ఆత్మ.
"ఏమండీ..! ఎంత పని చేసారండీ..! మీరు ఇలా టైం ఇవ్వకుండా సడన్‌గా పోతే, ఇప్పుడు నా గతి ఏం కాను? ఇకపై నేను చేసిన తప్పులకి ఎవరిని తిట్టను..? మీరు పోతే, ఆ పట్టుచీరలు ఎలా కట్టుకోగలను? మొన్ననే పెళ్ళికోసమని కొన్న పట్టుచీర ఒక్కసారైనా కట్టనేలేదే.. ఇక నాకు ఆ భాగ్యం లేదా? నగలు ఎలా పెట్టుకోను.. వాటికోసమైనా మీరు బతికి ఉండొచ్చు కదండీ.."
ఆ మాటలు విన్న రామయ్య నవ్వాడు... "మీ ఆవిడకు నీ కన్నా ఆ చీరలు, నగలంటేనే చాలా ఇష్టం కాబోలు."
ఇంకా అందుకుంది సుశీల...
"వైట్ అంటే నాకు అసలే ఇష్టం లేని కలర్.. ఇప్పుడు దానినే ఎలా వేసుకోవాలి?"
"పోనీలే వదినా..! పోయిన వాళ్ళ కోసమని మన కోరికలు చంపుకుంటామా చెప్పు? ఒక పది రోజులు ఫార్మాలిటీ అంతే..! తర్వాత.. మేకప్ కూడా వేసుకోవొచ్చు."
"మీ చెల్లెలికి నీ మీద ఉన్న ప్రేమను మెచ్చుకోవాలి" నవ్వుతూ అన్నాడు రామయ్య.
"అయినా సరే... చూస్తూ చూస్తూ ఈ వైట్ డ్రెస్ ఎలా వేసుకోను..? మీరే చెప్పండి?" అంటూ సోమయ్య శవాన్ని గట్టిగా పట్టుకుని అడిగింది సుశీల.
"అన్నయ్య ఆల్రెడీ పోయాడు.. అలా ఊపి మళ్ళీ చంపకు. వేసుకోక తప్పదు వదినా..!"
"నా వల్ల కాదు. మీది ఏ కాలో చెయ్యో పడిపోయి మంచం మీద ఉన్నా బాగుండేది... ఇలా ఒక్కసారిగా బకెట్ తన్నేస్తే ఎలాగండీ? షాప్‌లో ఆఫర్స్, డిస్కౌంట్లు ఇక నాకు లేనట్టేనా? వెరైటీస్ ఉండవా నా జీవితంలో?"
"చూసాను లే మీ ఆవిడకు నీ మీద ప్రేమ... నీ మొహం దాచుకోనవసరం లేదులే సోమయ్యా!"
"మా ఆవిడ ఏదో బాధలో అలా మాట్లాడింది... నా పిల్లలు జెమ్స్.. చూడు! అక్కడకు పదా..."
"నాన్న మొబైల్ నాకు కావాలి..." అన్నాడు సోమయ్య కొడుకు కృష్ణ.
"లేదు... లేదు.. ఇది నాది! నాన్నని ఎన్ని సార్లు అడిగినా నాకు మొబైల్ కొనలేదు. ఇప్పుడు నాన్నకు ఇక ఫోన్ ఎందుకు..? ఇక తిట్టలేడు కూడాను! అందుకే ఇది నాదే" అంది సోమయ్య కూతురు కావ్య.
"పోనీలే.. నువ్వే తీసుకో! నాన్న ఇన్సూరెన్స్ డబ్బులు అన్నీ నావే..! కొత్త ఐఫోన్ కొనుక్కుంటానులే!" అన్నాడు కృష్ణ.
ఇదంతా చూస్తున్న రామయ్య...
(నాకు పెళ్ళి కాలేదు కాబట్టి సరిపోయింది... లేకపోతే ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వచ్చేదో - రామయ్య మైండ్ వాయిస్)
"ఇదంతా చూస్తుంటే.. నాకు మళ్ళీ హార్ట్ ఎటాక్ వస్తుందేమో! నేను పై లోకానికి జంప్!"
"నాకు మాత్రం రాదా మళ్ళీ హార్ట్ ఎటాక్... అందుకే నేనూ నీతో పాటే..." అంటూ సోమయ్య కూడా జంప్.
సమాప్తం.
***********
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
తాత మోహనకృష్ణ గారి కొన్ని ఇతర రచనలు:
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ











Comments