స్వయం కృషి
- Penumaka Vasantha

- 6 hours ago
- 3 min read
స్వయం కృషి, వాణి, మహిళా సాధికారత, బ్యాంక్ ఉద్యోగం, ప్రేరణాత్మక కథ, నిజజీవిత కథ, తెలుగు కథలు, మహిళ విజయం, ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి

Swayamkrushi - Telugu Inspirational Story | Penumaka Vasantha
స్వయం కృషి - తెలుగు ప్రేరణాత్మక కథ
Published In manatelugukathalu.com On 18/07/2026
“వాణీ! లెగూ.. బ్యాంకు కాడికి పోవాలి” అంటూ తల్లి మంగి లేపుతుంటే.. వాణి లేవలేదు.
ఇట్లా కాదు అంటూ నీళ్ళు కొట్టింది మొహం మీద.
"అబ్బా..! అమ్మా లెగుస్తాలే. మా స్కూల్ కు సెలవులు ఇచ్చారు. కూసేపు పడుకోనీయవు"అంటూ మాడుపు మొహంతో లేచింది.
అమ్మ వెంట బ్యాంకు కు వెళ్ళింది. తను బయట టీ కొట్టు దగ్గర కూచుంది. మంగి వెళ్ళి బ్యాంకు తీసి అంతా ఊడ్చి బయటకు వచ్చింది. ఈలోపు వాణి బ్యాంకు
బయట చిమ్మి నీళ్లు కొట్టి ముగ్గులు వేసింది.
పదకొండుకు అమ్మ ఇచ్చిన చాయ్ తీసుకెళ్ళి అందరకు ఇచ్చింది. అమ్మ లోపల అటెండర్ పని చేస్తుంటే... తను ఇంటికి వెళ్ళి చెల్లిని లేపి ఇంట్లో పని చేసి వంట చేసింది.
సాయంత్రం మళ్ళీ బ్యాంకు దగ్గరికి వెళ్ళి నాల్గు గంటలకు టీ ఇచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసింది. పొద్దున టీ పెట్టే బండి పై కూరలు పెట్టుకుని అమ్మింది వాణి.
ఇన్ని పనులు చేస్తూ ఆ కుటుంబం బతుకు వెళ్లదీస్తున్నారు. మంగి మొగుడు గురవయ్య ఈమధ్య జబ్బు చేసి పోయాడు. అతను చేసే ఉద్యోగం మంగికి ఇచ్చారు.
బ్యాంకు మేనేజర్ వాణిని టెన్త్ పాస్ అయితే… బ్యాంకులో అటెండర్ పోస్ట్ వేయిస్తాను అంటే... మంగి, వాణిని స్కూల్ కు పంపుతుంది. ఇంకా ఇద్దరు కూతుళ్లు
వెనుక వున్నారు.
టెన్త్ పాస్ అయింది వాణి. దూరపు చుట్టాలు కానీ కట్నం లేకుండా వాణిని చేసుకుంటామంటే… ఇచ్చి చేసింది మంగి. వాణికి ఇష్టం లేకపోయినా అమ్మకు బరువు కాకూడదని పెళ్లికి ఒప్పుకుంది.
రాజు వాణిని బాగానే చూసుకుంటున్నాడు. అత్త దుర్గ కట్నం తీసుకోలేదని వాణిని సతాయిస్తూ
ఉండేది.
మంగి అప్పు చేసి రాజుకు లక్ష పెట్టీ బండికొని ఇచ్చింది. అయినా వాణి అత్త దుర్గ ఏడిపిస్తూనే ఉంది. అపుడు వాణి కి పెళ్ళి చేసుకుని తప్పు చేసాను అనిపించింది.
కడుపుతో ఉండి పుట్టింటికి వచ్చింది. అపుడే కాస్త హాయిగా ఉంది వాణికి. రాజు వస్తూ పోతూ ఉన్నాడు.
వాణికి నొప్పులు మొదలవడంతో హాస్పిటల్లో జాయిన్ చేసింది మంగి. రాజుకి కబురు పెట్టారు. రాజు అపుడు
ఐదవ అంతస్తులో పెయింట్ వేస్తున్నాడు. త్వరగా హాస్పిటల్ కి వెళ్ళాలనే హడావుడిలో కాలు జారి కింద పడ్డాడు. పడి ప్రాణం పోయింది. ఇక్కడ వాణి అమ్మాయిని కన్నది.
వాణి భర్త మరణంతో కుంగి పోయింది. అత్త దుర్గ వాణిని ఇంటికి రానీయలేదు. పుట్టింట్లో ఇక తన బతుకు బండిని నడపటం మొదలు పెట్టింది. ఇంట్లో ఉండి ఇంటి పని చేస్తూ పాప పని చూసుకుంటూ ఉంది.
పాపకు ఏడాది రాగానే అంగన్వాడీలో చేరింది ఆయాగా. అక్కడ బాగా పనిచేసి ఇద్దరు చెల్లెళ్లను చదివించింది.
పాప కొద్దిగా పెద్దయిన తర్వాత వాణిని బ్యాంకు మేనేజర్ పిలిచి డిగ్రీ చేయి అని చెప్పటంతో డిగ్రీ పూర్తి చేసింది. రెండో చెల్లికి పెళ్లి చేసింది.
డిగ్రీ అయిన తర్వాత బ్యాంకు ఎగ్జామ్స్ రాసింది. దాంట్లో సెలెక్ట్ అయింది. బ్యాంకులో చిన్నపుడు నాన్నతో వెళ్ళి తాళాలు తీసి తుడిచే వాణి ఆ బ్యాంకులో క్లర్క్ గా జాయిన్ అయింది. అమ్మ మంగి స్టాంపులు, అందిస్తూ కూతురిని గర్వంగా చూసింది.
పాప ఆరో క్లాస్ కి వచ్చింది. చిన్న చెల్లిని ఇంజనీరింగ్లో జాయిన్ చేసింది. మంగి వాణిని మళ్ళీ పెళ్లి చేసుకోమని గొడవ చేసింది. కానీ వాణి వినలేదు. బ్యాంకు ఆఫీసర్ టెస్ట్ పడితే.. రాసింది. సెలెక్ట్ అయింది. ఇంకో
చోటుకు ట్రాన్స్ఫర్ చేసారు.
తర్వాత చిన్న చెల్లి పెళ్ళి చేసింది. తను ఇదివరకు చేసిన బ్యాంకుకు తిరిగి ఆఫీసర్ గా వచ్చింది. వాణి స్వయం కృషితో ఎదిగి ఎంతో మంది ఆడవాళ్లకు స్వయం ఉపాధి పధకం కింద లోన్లు ఇప్పిస్తూ చాలా బిజిఅయింది. ఎందుకంటే.. తను డబ్బులేక
ఎన్ని కష్టాలు పడిందో తనకు తెలుసు. అందుకే తనలాగా ఏ స్త్రీ బాధ పడకూడదనే ఉద్దేశ్యంలో ఉన్న వాణినీ అభినందిద్దాం.
ఇది వాస్తవంగా జరిగిన కథ.
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.






Comments