top of page
Original.png

ఐక్య రాజ్య సమితి క్విజ్

ఐక్యరాజ్యసమితి, UNO, UNO Quiz, United Nations, GK Telugu, జనరల్ నాలెడ్జ్, పోటీ పరీక్షలు, UPSC, APPSC, TSPSC, గ్రూప్స్, WHO, UNESCO, IMF, World Bank, Security Council, ICJ, ECOSOC, Current Affairs, Mana Telugu Kathalu

న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ముందు సభ్య దేశాల జెండాలు.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ముందు సభ్య దేశాల జెండాలు.

UNO Quiz - Telugu Inspirational Article | P V Padmavathi Madhu Nivrithi

ఐక్య రాజ్య సమితి క్విజ్తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | పి. వి. పద్మావతి మధు నివ్రితి

Published in manatelugukathalu.com on 30/06/2026


ఐక్యరాజ్యసమితి (United Nations Organization - UNO) ప్రపంచ శాంతి, భద్రత, అంతర్జాతీయ సహకారానికి కేంద్రబిందువుగా నిలిచిన అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థ. పోటీ పరీక్షలు, సాధారణ జ్ఞానం, విద్యార్థుల అధ్యయనానికి ఉపయోగపడే విధంగా రూపొందించిన ఈ UNO క్విజ్లో స్థాపన, ప్రధాన కార్యాలయం, భద్రతా మండలి, సభ్య దేశాలు, WHO, UNESCO, IMF, World Bank వంటి ముఖ్య అంశాలపై 23 ప్రశ్నలు–సమాధానాలు సమగ్రంగా అందించబడ్డాయి.


---------------- మొదటి భాగం ---------------------


1Q) ఐక్యరాజ్యసమితి (UNO) ఎప్పుడు స్థాపించబడింది?

జవాబు) 24 అక్టోబర్, 1945


2Q) ఐక్యరాజ్యసమితి ఎన్ని దేశాలతో ప్రారంభమైంది

జవాబు) 51 వ్యవస్థాపక సభ్య దేశాలతో ప్రారంభమైంది.

గమనిక:-

[

1945 జూన్ 26న 50 దేశాలు ఐక్యరాజ్యసమితి చార్టర్‌పై సంతకం చేయగా ... అదే ఏడాది అక్టోబర్‌లో పోలాండ్ సంతకం చెసింది.



3Q) ఐక్యరాజ్యసమితిలో చివరి సభ్య దేశం ఏ దేశం? 


జవాబు) 193వ సభ్య దేశం దక్షిణ సూడాన్ (South Sudan: Africa).  (14 జూలై 2011న ఐక్యరాజ్యసమితిలో అధికారికంగా సభ్యత్వం పొందింది)




4Q) ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం (Headquarters) ఎక్కడ ఉంది?

జవాబు) న్యూయార్క్ నగరంలో (అమెరికా)


5Q) ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి?

జవాబు) 193



6Q) ఈ రోజు యూ.ఎన్.ఓ కు ఎన్ని ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి?


జవాబు) 


4 ప్రధాన కార్యాలయాలు (Headquarters) ఉన్నాయి. 


i) న్యూయార్క్ (యు.ఎస్.ఎ: ఉత్తర అమెరికా: USA: North America): 24 Oct 1945:- ఇది ఐక్యరాజ్యసమితి ప్రధాన ప్రధాన కార్యాలయం. ఇక్కడే అత్యధిక పాలనా విభాగాలు, సర్వ ప్రతినిధి సభ (General Assembly) సమావేశాలు జరుగుతాయి.


ii) జెనీవా (స్విట్జర్లాండ్): 1946: ఐరోపా


iii) వియన్నా (ఆస్ట్రియా): ఐరోపా: 23 ఆగస్టు 1979


iv) నైరోబీ (కెన్యా): ఆఫ్రికా ఖండంలో: 1 జనవరి.1996


గమనిక

[ఈ 4 ప్రధాన కేంద్రాల నుండే ఐక్యరాజ్యసమితి తన పాలనా వ్యవహారాలను, అంతర్జాతీయ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తుంది.]



7Q)

యు.ఎన్.ఓ స్థాపన యొక్క ఉద్దేశ్యం ఏమిటి?


జవాబు)

రెండవ ప్రపంచ యుద్ధం (1939-1945) తర్వాత ప్రపంచంలో శాంతి, భద్రతలను పరిరక్షించడానికి మరియు దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సహకారాన్ని పెంపొందించడానికి అక్టోబర్ 24, 1945న ఐక్యరాజ్యసమితి (UNO) స్థాపించబడింది.



ముఖ్యమైన ఉద్దేశ్యాలు - లక్ష్యాలు క్రింది విధంగా ఉన్నాయి:


I) అంతర్జాతీయ శాంతి మరియు భద్రత:

ప్రపంచంలో భవిష్యత్తులో మూడవ ప్రపంచ యుద్ధం వంటి భారీ విధ్వంసాలు జరగకుండా నివారించడం మరియు

వివాదాలను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించడం.



ii) స్నేహపూర్వక సంబంధాలు: దేశాల మధ్య సమానత్వ సూత్రం మరియు స్వయం నిర్ణయాధికారం ఆధారంగా స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడం.



iii) సహకారం మరియు అభివృద్ధి: ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మరియు మానవతా సమస్యలను పరిష్కరించడంలో అంతర్జాతీయ సహకారాన్ని సాధించడం.



Iv) మానవ హక్కుల పరిరక్షణ: జాతి, లింగ, భాష లేదా మతంతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ప్రాథమిక మానవ హక్కులు మరియు స్వేచ్ఛలను ప్రోత్సహించడం.

-------- X X X ---------- X X X ------- X X X --------------



------------------------ 2వ భాగం -------------------


8Q) ఐక్యరాజ్యసమితికి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు?

జవాబు) ట్రిగ్వే లీ (Trygve Lie)

[నార్వే దేశస్థుడు: FROM Norway (Europe)...ఫిబ్రవరి 1, 1946 నుండి నవంబర్ 10, 1952 వరకు (సుమారు 6.5 సంవత్సరాలు)]

...

[తీవ్రమైన రాజకీయ ఒత్తిడి మధ్య ఆయన 1952లో రాజీనామా చేసినప్పటికీ, ఏప్రిల్‌ 1953 వరకు మొదటి సెక్రటరీ జనరల్ గా

పదవిలో కొనసాగారు.]

...

[ఎందుకంటే ???

డాగ్ హమ్మర్‌స్క్‌జోల్డ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించే వరకు ఉండాలి కాబట్టి

...

డాగ్ హమ్మర్‌స్క్‌జోల్డ్ (స్వీడన్ దేశస్థుడు): 1953-1961 (సుమారు 8 సంవత్సరాలు) వరకు యూ.ఎన్.ఓ 2వ సెక్రటరీ జనరల్ గా పనిచేశారు) ]



9Q) అంతర్జాతీయ న్యాయస్థానం (International Court of Justice - ICJ) ఎక్కడ ఉంది?

జవాబు) ది హేగ్ (నెదర్లాండ్స్): ఐరోపా ఖండం



10Q) ఐక్యరాజ్యసమితిలో వీటో పవర్ (Veto Power) కలిగిన శాశ్వత సభ్య దేశాలు ఎన్ని?

జవాబు) 5 (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా)


11Q) "ఐక్యరాజ్యసమితి" అనే పేరును ప్రతిపాదించింది ఎవరు?

జవాబు) అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్


12Q) ఐక్యరాజ్యసమితి అధికారిక భాషలు ఏవి?

జవాబు) 6 

(అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ మరియు స్పానిష్)


13Q) ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు?

జవాబు) అక్టోబర్ 24 (యు.ఎన్.ఓ స్థాపించిన రోజు కాబట్టి)


14 Q) ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా ఎవరు పనిచేస్తున్నారు?

జవాబు) ఆంటోనియో గుటెర్రెస్ 

(ఆంటోనియో గుటెర్రెస్: పోర్చుగల్ మాజీ అధ్యక్షుడు ... రెండవ చివరి పదవీకాలం 31 డిసెంబర్ 2026న ముగుస్తుంది ... 01 జనవరి 2027 నుండి కొత్త సెక్రటరీ జనరల్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు)

-------- X X X ---------- X X X ------- X X X --------------



----------------------- 3వ భాగం -------------------


15 Q) ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి (UNGA కి) తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు?

జవాబు) భారతదేశానికి చెందిన విజయలక్ష్మి పండిట్. 

(నేటి వరకు ఆ పదవిలో పనిచేసిన ఏకైక భారత సంతతి)


గమనిక

[i) ఆవిడ 1953లో జరిగిన 8వ సాధారణ సమావేశానికి అధ్యక్షురాలిగా ఎన్నికై ఈ అరుదైన ఘనత సాధించారు. 


ii) ఆవిడ భారతదేశపు మొదటి ప్రధానమంత్రి దివంగత జవహర్‌లాల్ నెహ్రూ గారి సోదరి. ]


16 Q) ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా ఎంత మంది భారతీయులు పనిచేశారు? 

జవాబు) ఇప్పటివరకు ఎవరూ పనిచేయలేదు.


17 Q) ఎంత మంది భారతీయులు యు.ఎన్.ఓ కు సేవలందించారు / ఐక్యరాజ్యసమితిలోని ఇతర ఉన్నత పదవులలో మరియు అనుబంధ సంస్థలలో ఎంత మంది  భారతీయులు ప్రముఖ పాత్రలు పోషించారు?

(విజయలక్ష్మి పండిట్ కాకుండా ఇతరులు)


జవాబు) 


I) డా. నాగేంద్ర సింగ్: 1985 నుండి 1988 వరకు అంతర్జాతీయ న్యాయస్థానం (International Court of Justice) అధ్యక్షుడిగా పనిచేశారు.


ii) శశిథరూర్: ఈయన ఐక్యరాజ్యసమితి అండర్-సెక్రటరీ జనరల్ (Under-Secretary-General) హోదాలో వివిధ బాధ్యతలు నిర్వహించారు.

------- X X X ---------- X X X ------- X X X --------------


----------------------- 4వ భాగం -------------------



18 Q) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UNSC) మొత్తం సభ్యుల సంఖ్య ఎంత?

జవాబు) 15 (5 శాశ్వత + 10 తాత్కాలిక సభ్య దేశాలు)


19 Q) ఐక్యరాజ్యసమితి మరియు దాని అనుబంధ సంస్థలకు మొత్తం ఎన్ని ప్రధాన అంగాలు (Principal Organs) ఉన్నాయి?

జవాబు) 6



20 Q)

ఐక్యరాజ్యసమితి ఛార్టర్ ప్రకారం, దీని పరిపాలన మరియు నిర్వహణకు ఎన్ని ప్రధాన అంగాలు (రెక్కలు) ఉన్నాయి?

వాటి పూర్తి వివరాలతో పాటు?


జవాబు) 6


i) సాధారణ సభ (General Assembly): ఐక్యరాజ్యసమితిలోని మొత్తం 193 సభ్య దేశాలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత విధాన నిర్ణయక మండలి.



ii) భద్రతా మండలి (Security Council): అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించే ప్రధాన అంగం. ఇందులో 5 శాశ్వత, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి.



iii) ఆర్థిక, సామాజిక మండలి (ECOSOC): ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక, పర్యావరణ సమస్యలపై చర్చించి, విధానాలు రూపొందించే వేదిక.



iv) ట్రస్టీషిప్ మండలి (Trusteeship Council): స్వాతంత్రం పొందని భూభాగాలను ఇతర దేశాల ఆధ్వర్యంలో పర్యవేక్షించడానికి ఏర్పాటైన విభాగం (1994 నుంచి దీని కార్యకలాపాలు నిలిచిపోయాయి).


V) అంతర్జాతీయ న్యాయస్థానం (International Court of Justice): దేశాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను పరిష్కరించే ప్రధాన న్యాయస్థానం. దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో ఉంది.



Vi) సచివాలయం (Secretariat): ఐక్యరాజ్యసమితి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే పరిపాలనా విభాగం. దీనికి ప్రధాన కార్యదర్శి నాయకత్వం వహిస్తారు.


గమనిక

[మిగిలిన ప్రత్యేక సంస్థలు (WHO, UNESCO మొదలైనవి) ఈ ప్రధాన అంగాల కింద స్వతంత్రంగా పనిచేస్తాయి.]

---------------------------------


21 Q) WHO, UNESCO, ILO, UNICEF, World Bank, IMF ల ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి  మరియు వాటి స్థాపిత శాఖల తేదీలు?



జవాబు)


I) WHO: World Health Organisation (ప్రపంచ ఆరోగ్య సంస్థ): దీని ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్‌లో (ఐరోపా) ఉంది. ఇది ఏప్రిల్ 7, 1948న స్థాపించబడింది.


ii) UNESCO: United Nations Educational Scientific and Cultural Organisation 

(ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ): దీని ప్రధాన కార్యాలయం "పారిస్, ఫ్రాన్స్‌లో" (ఐరోపా) ఉంది. ఇది నవంబర్ 16, 1945న స్థాపించబడింది.


iii) ILO: International Labour Organisation (అంతర్జాతీయ కార్మిక సంస్థ): దీని ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్‌లో (ఐరోపా) ఉంది. ఇది ఏప్రిల్ 11, 1919న స్థాపించబడింది.


iv) UNICEF: United Nations International Children's Emergency Fund

(ఐక్యరాజ్యసమితి బాలల నిధి): దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్, యు.ఎస్.ఎ (ఉత్తర అమెరికా) లో  ఉంది. ఇది డిసెంబర్ 11, 1946న స్థాపించబడింది.


V & vi) 

ప్రపంచ బ్యాంక్ (World Bank) & IMF (అంతర్జాతీయ ద్రవ్య నిధి):- 

వీటి ప్రధాన కార్యాలయాలు ... వాషింగ్టన్, డి.సి. (USA) లో ఉన్నాయి.


*బ్రెట్టన్ వుడ్స్ కవలలు (Bretton Woods Twins): ప్రపంచ బ్యాంకు మరియు IMF రెండూ 1944లో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సదస్సులో భాగంగా ఒకేసారి (ఏకకాలంలో) జన్మించాయి - స్థాపించబడ్డాయి. వీటిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రెండు స్తంభాలుగా పిలుస్తారు.


*ప్రత్యేక ఏజెన్సీలుగా గుర్తింపు: 1947లో జరిగిన ప్రత్యేక ఒప్పందాల ద్వారా ప్రపంచ బ్యాంకు మరియు IMF లు ఐక్యరాజ్యసమితి (UN) వ్యవస్థలో ప్రత్యేక సంస్థలుగా చేర్చబడ్డాయి.


---------------------------------


22 Q)

UNO: యు.ఎన్.ఓ, World Bank: ప్రపంచ బ్యాంకు మరియు IMF: ఐ.ఎం.ఎఫ్ ల మధ్య సంబంధం ఏమిటి?


జవాబు)

యు.ఎన్.ఓ (UNO), ప్రపంచ బ్యాంకు (World Bank) మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) లు ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో (UN System) భాగమైన అంతర్జాతీయ సంస్థలు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వం (IMF), పేదరిక నిర్మూలన మరియు అభివృద్ధి (World Bank) ... కోసం ... ఇవి పరస్పరం సహకరించుకుంటూ ప్రత్యేక ఏజెన్సీలుగా పనిచేస్తున్నాయి.

---------------------------------


23 Q) ప్రపంచ బ్యాంకు (World Bank) మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కార్యకలాపాలను నిర్వచించండి?


జవాబు)


i) ఐ.ఎం.ఎఫ్ (IMF): ఇది ప్రపంచ ద్రవ్య స్థిరత్వాన్ని పర్యవేక్షిస్తుంది మరియు ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు బెయిల్‌అవుట్ (Bailout) రుణాలను అందిస్తుంది.


ii) ప్రపంచ బ్యాంకు (World Bank): ఇది అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలలో దీర్ఘకాలిక పేదరిక నిర్మూలనకు, మౌలిక వసతుల అభివృద్ధికి మరియు సామాజిక సంస్కరణలకు ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది.


iii) ఐక్యరాజ్యసమితి లక్ష్యాలకు మద్దతు:

 పేదరికాన్ని తగ్గించడం, సుస్థిర అభివృద్ధి సాధించడం వంటి UN యొక్క ప్రధాన లక్ష్యాలను చేరుకోవడంలో ఈ రెండు ఆర్థిక సంస్థలు UN (ప్రత్యేకించి ECOSOC - ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్) తో కలిసి పనిచేస్తాయి.


iv) సహకార విధానాలు: 

ఆర్థిక విధానాలు మరియు ప్రాజెక్టుల అమలులో IMF ద్రవ్య స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తే, ప్రపంచ బ్యాంకు (World Bank) ఆ దేశాలలో అభివృద్ధి ప్రాజెక్టులను సఫలం చేయడానికి సహాయపడుతుంది.


------------ యు.ఎన్.ఓ క్విజ్ సమాప్తం. (23 Q&A) ------------ 



[గమనిక:-

ఇది మా 153వ ఆర్టికల్ ఈ జనాదరణ పొందిన ప్రతిష్టాత్మక తెలుగు వెబ్ మ్యాగజైన్‌ లో, www.manatelugukathalu.com లో]


UNO క్విజ్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ స్నేహితులు, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు జనరల్ నాలెడ్జ్ క్విజ్‌లు, విద్యా వ్యాసాలు, పోటీ పరీక్షల సమాచారం కోసం manatelugukathalu.com ను అనుసరించండి.


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 


మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page