వాయువుకి జ్వరం
Vayuvuki Jwaram - Telugu Emotional Family Story | Ganti Asa Padmini
వాయువుకి జ్వరం - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | గంటి ఆశ పద్మిని
Published in manatelugukathalu.com on 10/11/2026
వాయు కాలుష్యం మన ఆరోగ్యానికే కాకుండా ప్రకృతికి కూడా పెను ముప్పుగా మారుతోంది. గంటి ఆశ పద్మిని రచించిన ‘వాయువుకి జ్వరం’ బాలల కథ, బామ్మ చెప్పిన ఆసక్తికరమైన కథ ద్వారా స్వచ్ఛమైన గాలి, చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను చక్కగా వివరిస్తుంది.
రహీమ్ చికాకుగా తన గదిలో కూర్చుని ఉన్నాడు. అటుగా వెళ్తున్న వాళ్ళ బామ్మ రహీమ్ ని చూసి "ఏమైంది? ఎందుకు చికాకుగా ఉన్నావు?" అని గది లోపలకు వెళ్లి అడిగింది.
రహీమ్ "నాకు రేపు బడిలో సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది. అందులో నేను ‘వాయు కాలుష్యం’ పైన ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను. రేపు మా బడికి DEO గారు వస్తారు. అతనికి నేను చేసిన ప్రాజెక్ట్ చూపించి దాని గురించి వివరంగా చెప్పాలి. నేను ఎంత చదివినా నాకు ఆ వివరణ అసలు రావట్లేదు. నేను సరిగ్గా చెప్పకపోతే నాకు బహుమతి రాదు" అని చెప్పాడు రహీమ్.
రహీమ్ మాటలు విన్న వాళ్ళ బామ్మ "నాకు ఒకసారి ఆ ప్రాజెక్ట్ చూపించు" అని అడిగింది. రహీమ్ తీసుకువచ్చి చూపించాడు. ప్రాజెక్ట్ చూసిన బామ్మ "నేను ఒక కథ చెబుతాను వింటావా?" అని అడిగింది.
"నేను చదువుకోవాలి, ఇప్పుడు ఏ కథలు వద్దు బామ్మా" అని అన్నాడు రహీమ్.
"ఒక ఐదు నిమిషాలు కథ విను, తరువాత చదువుకో" అని చెప్పింది బామ్మ.
"సరే చెప్పు" అని అన్నాడు రహీమ్.
బామ్మ కథ చెప్పడం మొదలు పెట్టింది...
"‘భూమి’ అనే ఊరిలో ‘ప్రకృతి’ అనే అమ్మకి ‘వాయువు’ అనే పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడు చాలా ఏళ్ల క్రితం ‘ఎంతో స్వచ్ఛంగా, చల్లగా’ ఉండేవాడు. చాలా ఏళ్ల తరువాత ఒక రోజు వాయువు ఒళ్ళు బాగా వేడిగా ఉండటంతో వాళ్ళ అమ్మ వాయువుని హాస్పిటల్ కి పట్టుకు వెళ్ళింది. డాక్టర్ చాలా టెస్ట్ లు చేసి పేషెంట్ ‘ఒంట్లో బోలెడు కాలుష్యం ఉంది, అందువల్లే ఈ వేడి’ అని చెప్పారు. వాయువు వాళ్ళ అమ్మ ‘కాలుష్యమా..? అంటే ఏమిటి?’ అని అడిగింది.
డాక్టర్ గారు ‘గాలిలో హానికర వ్యర్థ పదార్థాలు చేరడం!’ అన్నారు.
‘అవి ఎలా చేరాయి నా బిడ్డకి?’ అని అడిగింది వాళ్ళ అమ్మ.
‘మనుషులు బళ్ళు తోలడం వల్ల వచ్చే పొగ, ఫ్యాక్టరీలు బాగా పెరిగిపోయి వాటిలోంచి వచ్చే చెడు పొగ, వేడిని తట్టుకోలేక ACల వాడకం పెరిగి వాటి ఔటర్ నుంచి వచ్చే వేడి... ఇవి మాత్రమే కాక వాయువుకు కావాల్సిన ఆక్సిజన్ అందించే చెట్ల సంఖ్య బాగా తగ్గడం... వీటి వల్ల వాయువులో హానికర పదార్థాలు చేరి వాయు కాలుష్యం అయింది’ అని చెప్పారు డాక్టర్.
వాళ్ళ అమ్మ ‘ఇప్పుడు ఏమి చేస్తే ఈ కాలుష్యం తగ్గి నా పిల్లాడికి నయమౌతుంది?’ అని అడిగింది. డాక్టర్ ‘మనుషులు అందరూ కనీసం వారంలో ఒక్క రోజు అయినా బండి తోలడం మానేయాలి, కాలుష్యాన్ని పెంచే ఫ్యాక్టరీల సంఖ్య తగ్గించాలి, ACల వాడకం తగ్గించాలి, ముఖ్యంగా చెట్లు నాటి చెట్ల సంఖ్య పెంచాలి... ఇవి చేస్తే వాయువులో కాలుష్యం కొంచెమైనా తగ్గుతుంది’ అని చెప్పారు, అని చెప్పి కథను ముగించింది బామ్మ.
బామ్మ చెప్పిన కథను విని ‘మంచి కథ చెప్పావు బామ్మ’ అని గట్టిగా కౌగిలించుకుని, కథలో ముఖ్యమైన పాయింట్లు అన్నీ రాసుకున్నాడు రహీమ్.
మరుసటి రోజు సైన్స్ ఎగ్జిబిషన్లో DEO గారు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి మొదటి బహుమతి గెలుచుకున్నాడు.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
గంటి ఆశ పద్మిని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: నా పేరు గంటి ఆశ పద్మిని.
నేను ఇప్పటివరకు ముఫై కథలు, పది బాలగేయాలు, ఒక మినీ నవల , ఐదు పుస్తక సమీక్షలు చేసాను.రాసాను. నా కథలు విశ్వభవిష్యత్, ఈనాడు, రేపటికోసం పత్రికలో పబ్లిష్ అయ్యాయి. సుమబాల, ఉషబాల, బాలబాట పుస్తకాల్లో, కదంబం అనే వెబ్ మ్యాగజైన్ లో కూడా నా కథలు ప్రచురణ అయ్యయి.











Comments