top of page
Original.png

వస్త్రానికి వెలకట్టలేము

19 hours ago
3 min read

వస్త్రానికి వెలకట్టలేము తెలుగు నీతి కథలో తల్లి లక్ష్మమ్మ, కుమారుడు సుదర్శన్ మరియు ఖరీదైన వస్త్రాలు ధరించిన పెంపుడు కుక్కపిల్ల.

Varusalu Atmeeyataku Punadi - Telugu Moral Story | - Peddada Sathyanarayana   

వస్త్రానికి వెలకట్టలేము - తెలుగు నీతి కథ | పెద్దాడ సత్యనారాయణ 

Published In manatelugukathalu.com On 17/09/2026


వస్త్రానికి వెలకట్టలేము అనేది పేదరికం, ఆత్మగౌరవం, మానవ విలువలను తెలియజేసే తెలుగు నీతి కథ. తల్లి లక్ష్మమ్మ, కుమారుడు సుదర్శన్ మధ్య జరిగే సంభాషణల ద్వారా వస్త్రాల ప్రాముఖ్యతను ఈ కథ వివరిస్తుంది. ఖరీదైన వస్త్రాలు ధరించిన పెంపుడు కుక్కపిల్ల సంఘటన కథకు ఆసక్తికరమైన మలుపును అందిస్తుంది. మనిషి గౌరవాన్ని కాపాడే వస్త్రాల విలువను అర్థం చేసుకునేలా చేసే ఈ సామాజిక సందేశ కథను చదవండి.


"ఒరేయ్ శీను, చాలా కడుపునొప్పిగా ఉందిరా! రాత్రి మాత్ర వేసుకున్నా తగ్గలేదు రా."


"అమ్మా, ఇక ఆలస్యము చేయవద్దు. మనం ఆస్పత్రికి వెళ్దాం పద. నేను ఐదు నిమిషాల్లో తయారై వస్తాను" అని ఇద్దరూ ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు.


"డాక్టర్ గారు, మా అమ్మ కడుపు నొప్పితో చాలా బాధపడుతోంది. రాత్రి ఈ టాబ్లెట్ ఇచ్చినా కడుపునొప్పి తగ్గలేదు. మీరే మా అమ్మకు మందులు ఇవ్వండి సర్."


డాక్టర్, లక్ష్మమ్మను పరీక్షించిన తర్వాత, "నేను ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తాను, తగ్గిపోతుంది. మీరు నేను రాసిన టెస్టులు చేయించుకొని వస్తే, కడుపు నొప్పికి కారణము తెలుసుకొని వైద్యము చేస్తాను" అంటారు.


"నమస్తే డాక్టర్ గారు" అని ఇద్దరూ బయటికి వచ్చేస్తారు.


"అమ్మా, నీవు చాలా నీరసముగా ఉన్నావు. ఇక్కడ టెస్టులు చేయించుకోవడము కష్టము, ఎందుకంటే చాలామంది ఉన్నారు. మనం ప్రైవేట్ ల్యాబ్‌కి వెళ్లి టెస్ట్ చేయించుకుందాము" అని తల్లిని తీసుకెళ్తాడు సుదర్శన్.


"ఇక్కడ చాలా బాగుందిరా, చాలా డబ్బు ఖర్చు అవుతుంది అనుకుంటా."


"అమ్మా, ఇక్కడ ల్యాబ్‌లో పేదవాళ్ళకి చాలా తక్కువ ధరలో చేస్తారు. అది కాకుండా ఎవరి దగ్గరైనా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే పరీక్షలు ఉచితంగా చేస్తారు" అని జవాబిస్తుంది లక్ష్మమ్మ.


లక్ష్మమ్మ రక్త పరీక్షలు చేయించుకొని బయటికి వచ్చే సమయములో, అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్, "అమ్మ, మీకు కడుపు నొప్పితో పాటు జ్వరము కూడా ఉన్నటుంది. ఏదైనా శాలువా లేక స్వెట్టర్ వేసుకుంటే మంచిది" అని సలహా ఇస్తుంది.


ఇంతలో అక్కడికి సుదర్శన్ వచ్చి, "మేడం, మా అమ్మకు పొద్దున్న బాగా కడుపు నొప్పిగా ఉన్నందువలన ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. డాక్టర్ గారు ల్యాబ్ టెస్టులు చేయించుకోమన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తనకు జ్వరం కూడా వచ్చినట్టుంది. అందుకే శాలువ తెచ్చుకోలేదు" అని జవాబిస్తాడు.


"అమ్మా, ఇంకా మనం బయలుదేరదామా?" అని ఇద్దరూ బయటకు రాబోతారు.


"ఒరేయ్, మన దగ్గర శాలువా ఎక్కడుందిరా?"


"అమ్మా, మనల్ని మనము తక్కువ చేసుకొని మాట్లాడటము సరికాదు."


ఇంతలో ఒకాయన తన భార్యను మరియు ఆయనతో పనిమనిషిని తోడుగా లోపలికి వస్తాడు. పనిమనిషి చేతిలో పెంపుడు కుక్కపిల్ల కూడా ఉంటుంది. ఎవరైనా వాళ్ళని చూస్తే సంపన్న కుటుంబీకులని అర్థమవుతుంది.


"సార్, ల్యాబ్‌లోకి పెట్స్ కి ప్రవేశము లేదు" అని సౌమ్యంగా చెప్తుంది రిసెప్షనిస్ట్.


"ఓ అలాగా!" అని, పనిమనిషితో, "నీవు జిమ్మీని తీసుకుని బయటికి వెళ్లి ఆడించు."


"అలాగే సర్" అని కుక్కపిల్లని తీసుకొని బయటికి వెళ్లిపోతుంది పనిమనిషి.


"ఒరేయ్ శీను, ఆ కుక్కపిల్లని చూడరా! దానికి మఖ్మల్ గౌన్ మరియు కాళ్ళకి సాక్సులు వేసి ఎంత అందముగా ముస్తాబు చేశారురా!"


పనిమనిషి కుక్కపిల్లని చాలా సుతారంగా, నెమ్మదిగా కిందకు దించుతుంది. అయితే ఆ కుక్కపిల్ల తన కాళ్ళకున్న సాక్స్‌ని చింపేస్తుంది. ఇంకా తనకున్న గౌను కూడా కాళ్ళ గోళ్ళతో చింపుకోబోతుంది. ఇంతలో పనిమనిషి కుక్కపిల్లని వద్దని బుజ్జగిస్తున్నా, గౌన్ పాడు చేసుకోవడము మానుకోవటము లేదు.


"అమ్మా, నీకు ఒక విషయము అర్థం కావటం లేదు. మన లాంటి బీదవాళ్ళకి బట్టలు మన మానాన్ని కాపాడుతాయి. ఎంత విలువైన వస్త్రాలు కుక్కపిల్లకి తొడిగినా, కుక్కలకి వాటి విలువ తెలవదు. ఇంకా వాటికి అవి భారముగా ఉంటాయి. అమ్మ, నేను చెప్పదలచుకున్న విషయము నీకు అర్థమయిందనుకుంటాను" అని ఇద్దరూ ఇంటికి బయలుదేరుతారు.

***



పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



***

పెద్దాడ సత్యనారాయణ గారి కొన్ని ఇతర రచనలు:


పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



పెద్దాడ సత్యనారాయణ

రచయిత పరిచయం:

 మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు   నా  నమస్కారములు.

పేరు: పెద్దాడ సత్యనారాయణ   B .A  విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్                                                               

డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్   

విద్యాభ్యాసము సికింద్రాబాద్                                                                    

సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి  4 కధలు 1 నాటిక                                                

వ్యాసాలకి పారితోషికం  మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.                                            

సంఘసేవ:  గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి   మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.


 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page