top of page
Original.png

వసుధైక కుటుంబం


Vasudhaika Kutumbam - Telugu Inspirational Story | Vangeepuram Shashirekha

వసుధైక కుటుంబం - తెలుగు ప్రేరణాత్మక కథ | వంగీపురం శశిరేఖ

Publishes in manatelugukathalu.com on 09/04/2026

ప్రపంచం మొత్తం ఒక కుటుంబంలా అనిపించే క్షణాలు…మన చుట్టూ ఉన్న చిన్న సంఘటనల్లోనే కనిపిస్తాయి.

వసుధైక కుటుంబం అనే ఈ కథలో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరిగే రోజువారీ దృశ్యాల ద్వారా మనుషుల భావాలు, సంబంధాలు, జీవన విధానం అద్దంలా ప్రతిబింబిస్తాయి.

ఇది ఒక సాధారణ కథ కాదు…మన జీవితానికి దగ్గరగా ఉండే నిజం.


నాకు ప్రొద్దున్నే కాఫీ తాగగానే, ఒక అరగంట ఉదయం నడవడం అలవాటు. మాది గేటెడ్ కమ్యూనిటీ కావడంతో నడక కోసం ఎక్కడికో వెళ్లక్కర్లేదు.


ఉదయం ఏడు గంటల సమయం కాబట్టి పిల్లలు, పిల్లల్ని బస్సుల్లో, ఆటోల్లో ఎక్కించే పెద్దలతో హదావుడిగా ఉంటుంది. వాళ్ళని పరికించి చూడడం నా దినచర్యగా మారిపోయింది. కొందరి పిల్లల ముఖాల్లో విచారం కనబడితే, మరికొందరు ఉత్సాహంగా పరుగులు పెట్టడం గమ్మత్తుగా ఉంటుంది. కొంతమంది పెద్దలు పిల్లలకి బస్సు వచ్చేలోపల హితబోధలు చేస్తూ ఉంటారు. పరీక్షల సమయంలో అయితే చివరిదాకా వాళ్లతో చదివించే దృశ్యాలు కూడా నా కంటబడతాయి. అంత పొద్దున్నే ఏమైనా తిన్నారో లేదో?


చటుక్కున మా నాన్నగారి మాటలు గుర్తుకొచ్చాయి. ఆఫీసు నుంచి రాగానే పిల్లలందరిని ప్రేమగా పలకరించి తిన్నారో లేదో అడగాలి, అంతేగానీ మార్కుల గురించి, చదువు గురించి అడక్కూడదనేవారు. అది గుర్తొచ్చి నా పెదవుల మీద సన్నని దరహాసం మెరిసింది.


ఇంకొంచెం దూరం నడిచాక దాదాపు 80 సంవత్సరాల వయసుండొచ్చు, ఒక పెద్దాయన మెల్లగా నడుస్తున్నారు. ఆయన దాదాపు రోజూ కనిపిస్తారు. కిందపడ్డ పారిజాత పువ్వుల్ని చాలా ఓపికగా ఏరుతుంటారు. కానీ ఆయన ముఖంలో ఏదో తెలియని దిగులు. బహుశా వయసు మీద పడినందువల్ల నీరసమా? లేక ఆయనకి ఏదైనా ఇబ్బందులున్నాయా? ఆయన ఎవరితో కలిసి ఉంటున్నారు? ఇవన్నీ నాలో మెదిలే ప్రశ్నలు.


కొంచెం దూరం వెళ్లాక దాదాపు 60 నుంచి 70 వయసు గల ఆడవాళ్లు పార్కులో బెంచీల మీద కూర్చుని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటుంటారు. కొన్ని మాటలు నా ప్రమేయం లేకుండానే నా చెవిన పడతాయి. కోడలి గురించో, కూతురి గురించో మిగతా వాళ్లతో గోడు పంచుకుంటూ ఉంటారు.


రచ్చబండ దగ్గర మగవాళ్లు జోరుగా వార్తాపత్రికలలో వచ్చిన విశేషాలు, రాజకీయాలు, ఇంకా మా కమ్యూనిటీలో జరుగుతున్న విశేషాలు చర్చించుకుంటారు.


కొందరు చాలా ఉత్సాహంగా అందరిని పలకరిస్తూ, విశేషాలు తెలుసుకుంటూ నడుస్తుంటారు. కొందరు, 'మాకెవ్వరితోనూ సంబంధం లేదు, నడవడమే మా ధ్యేయం' అన్నట్లుగా అడుగులు వేస్తారు.


రకరకాల చర్చలు, పలు రకాల సమస్యలు, ఒక చిన్న కమ్యూనిటీలోనే! ఎన్నో రకాల మనుషులుంటే, మన రాష్ట్రంలో ఇంకా దేశంలో ఉన్న సమస్యల్ని ఆలోచించడానికే భయం వేస్తుంది.


హమ్మయ్య! వాకింగ్ అయిపోయింది. ఇంక ఇల్లు చేరగానే టిఫిన్ ఏం తయారు చేయాలో అనుకుంటూ మా ఫ్లాట్ దారి పట్టాను. ఇంటి ప్రధాన ద్వారం తెరిచి లోపల అడుగుపెట్టడంతోనే నేను 'నా సంసారం' అనే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను, బయటి ప్రపంచం విషయం మరిచిపోయి.


                        ***************************************


వంగీపురం శశిరేఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వంగీపురం శశిరేఖ


నేను ఆదాయపన్ను శాఖలో ఇనస్పెక్టర్ గా పని చేసి విశ్రాంత జీవనం 

గడుపుతున్నాను,నాకు తెలుగు భాష అంటె ఎంతో మక్కువ.టీచింగ్ అంటే కూడా చాలా 

ఇష్టం.నా విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాను.  మా మనవడు 

ఆరుష్ వియాన్ మా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page