top of page
Original.png

వెలుగు - పార్ట్ 1


వెలుగు పార్ట్ 1 తెలుగు కుటుంబ కథలో శాంతి, సత్య దంపతుల మధ్య తీవ్ర మనస్పర్ధలు, మధ్యలో బాధగా ఉన్న ఐదేళ్ల ఆర్య

Velugu - Part 1 - Telugu Family Story | Bhaskara Rao B. R. K. V.

వెలుగు - పార్ట్ 1 తెలుగు కుటుంబ కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 30/08/2026


వెలుగు – పార్ట్ 1 ఒక భావోద్వేగభరితమైన తెలుగు కుటుంబ కథ. శాంతి, సత్య దంపతుల మధ్య పెరిగిన మనస్పర్ధలు చివరకు విడాకుల దాకా ఎలా వెళ్లాయి? ఐదేళ్ల ఆర్య జీవితంపై తల్లిదండ్రుల నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతోంది?


"మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య రావాలి కానీ తల్లిదండ్రుల మధ్య కాదు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి విడాకులు కోరడం అంటే మీరిద్దరినీ స్వార్థపరులుగానే లెక్కించాలి. కనీసం ఒక బిడ్డ ఉన్నాడనే ఆలోచన లేకుండా ఎవరి దారి వారు చూసుకుంటే మీ అబ్బాయి గతి ఏమవును? 


ఈ కేసును రెండు నెలలపాటు వాయిదా వేస్తున్నాను, మరోసారి ఆలోచించుకుని రండి. అప్పుడు కూడా డివోర్స్ కోరుకున్నట్టయితే గ్రాంట్ చేస్తాను." అన్న జడ్జి మాటలకు నిరాశ చెందిన శాంతి, సత్య దంపతులు కోర్టు నుంచి బయటకు వచ్చేశారు తమ ఐదేళ్ల ఆర్యను తీసుకుని.


సత్య డ్రైవ్ చేస్తుండగా వెనుక సీట్లో తల్లి ఒళ్ళో బేల ముఖంతో పడుకుని ఉన్నాడు కళ్ళు తెరుచుకుని.


కారు ఇంటికి చేరాక ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లిపోయారు. ఆర్య మాత్రం హాల్లోని సోఫాలో కూర్చున్నాడు దీనంగా. తల్లిదండ్రుల్లో ఎవరు తనను పట్టించుకోకపోవడంతో దుఃఖం మరింత ఎక్కువై ఏడుస్తూ పక్కకు వాలి అలాగే నిద్రలోకి జారిపోయాడు.


రాత్రి తొమ్మిది దాటాక శాంతి వచ్చి ఆర్యను తీసుకువచ్చి తన గదిలో పడుకోబెట్టుకుంది. ఆ రాత్రి ఇంట్లో ఎవ్వరూ భోజనం చెయ్యలేదు. అప్పటికి చాలా రోజుల నుంచి ఆ ఇంట్లో పస్తులే.


పుట్టుకతోనే ఐశ్వర్యవంతుడైన సత్య, ఏరికోరి తన దగ్గర క్లర్క్ గా పనిచేసే మారుతీరావు కూతురైన శాంతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. 


ఒక్కతే కూతురు కావడంతో ప్రతిరోజు తండ్రికి క్యారేజ్ ఇవ్వడానికి, వయసు పైబడడంతో ఆఫీసు అయ్యాక స్కూటీ మీద ఇంటికి తీసుకువెళ్లడానికి శాంతి వచ్చేది.

ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపించే ఆత్మాభిమానం, ఆఫీసు బయట తండ్రి వచ్చేవరకు కూర్చునే తీరు, ఎవ్వరినీ లెక్కచేయని తత్వం సత్యను ముగ్ధుణ్ణి చేశాయి. ఆపైన ఆమె అందం కూడా సత్యను ఇట్టే ఆకర్షించింది.


తన తోటి వారితో వియ్యమందాలి తప్ప తమ కింద పనిచేసేవారితో పెళ్ళి సంబంధం కలుపుకోవడం వల్ల అనర్థాలు వస్తాయని తల్లి చెప్పిన మాట పెడచెవిన పెట్టి మరీ పెళ్లి చేసుకున్న వాళ్ల దాంపత్యం అంత సులువుగా ఏమీ సాగలేదు. సత్య ఇంట్లో రాజరిక పద్ధతులు అయితే శాంతి మనస్తత్వం అందుకు భిన్నం.


పేద-గొప్ప తారతమ్యం అనేది అదృష్టం, దురదృష్టం లాంటిది. ధనవంతులుగా పుట్టడం అంటే పెట్టి పుట్టాలని, పేదలంతా తాము చేసుకున్న ఖర్మ ఫలితమేనని సత్య వాదిస్తే, సంపన్నులు స్వార్థపరులని, ఒంటరులని శాంతి బదులిచ్చేది.


వీరు ఎన్ని వాదించుకున్నా ఆర్య పుట్టి నాలుగో సంవత్సరం వచ్చేవరకు గతుకుల రోడ్డులోని బండిలా బాగానే నడిచింది.


మారుతీరావు ఓరోజు ఉదయమే బాత్‌రూంలో కాలుజారి పడి స్పృహ కోల్పోయాడని శాంతి తల్లి ఫోన్ చేసింది కంగారు పడుతూ. 


సరిగ్గా అదేరోజు సత్య పుట్టినరోజు. ఉదయమే తమ వంశదేవుని గుడికి వెళ్లి, భోజనం తన బంధువులందరితోనూ ఇంటివద్దనే తినేలా, సాయంత్రం పార్టీకి మినిస్టర్లతోను, సాటి వ్యాపారవేత్తలతోను కూడి పెద్దఎత్తున ఫైవ్ స్టార్ హోటల్లో డిన్నర్ ఏర్పాటు నెల రోజులకు ముందే ప్లాన్ చేసి, అందుకు తగ్గ ఏర్పాట్లు శాంతికి చెప్పి చేశాడు సత్య.


కానీ శాంతి, భర్త ఎవరో ఒకరిని పంపించి హాస్పిటల్ కు వెళ్ళమని, ఈవినింగ్ వెళ్లి చూసొద్దామని బ్రతిమిలాడినా వినిపించుకోకుండా "మీలో మానవత్వం లేదని, పుట్టిన రోజు వేడుకలు వచ్చే సంవత్సరం అయినా చేసుకోవచ్చని, జన్మనిచ్చిన తండ్రి కంటే తనకేది ఎక్కువ కాదని" తండ్రిని చూడటానికి వెళ్ళిపోయింది.


సత్య ఏమిచేయాలో పాలుపోలేదు. ఈ విషయం తెలుసుకున్న తల్లి, మొదట్నుంచి శాంతి పట్ల వ్యతిరేకభావం ఉండటం చేత అగ్నిలో ఆజ్యం పోసినట్టు, ఆమె మీద ఉన్నవి లేనివి చెప్పి కొడుకు మనసు విరిచేసింది.


పోనీ తన పుట్టిన రోజు సంబరాలు మానేద్దామనుకుంటే పరువు పోతుందని, వస్తున్న కోపాన్ని పంటి బిగువనే ఆపుకుని పూర్తి చేశాడు. ఒకరిద్దరు భార్య గురించి ప్రస్తావిస్తే, బిజినెస్ పనిమీద తనకు మారుగా అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్లిందని కప్పిపుచ్చాడు.


రాత్రి పన్నెండు అవుతుండగా వచ్చింది శాంతి అలసిన వదనంతో. అప్పటికే హాల్లో తీవ్రకోపంతో ఉన్న సత్య, శాంతి లోపలకు రాగానే "ఇకనుంచి నువ్వు శాశ్వతంగా మీ నాన్న దగ్గరే ఉండి సేవలు చేసుకో. ఇక్కడ నీకు స్థానం లేదు." అంటూ కాళ్ళ దగ్గర ఉన్న టీపాయ్ ను సరిగ్గా ఆమె కాళ్ళ దగ్గరకు వెళ్లేలా బలంగా తన్నాడు.


వెంటనే రోషంగా "నేను చేసిన దాంట్లో తప్పేముంది? కన్నతండ్రి చావుబతుకుల మధ్య ఉంటే వెళ్లడం తప్పా?" అంది శాంతి.


అసలు శాంతి తప్పు చేసిందా? సత్య ఆలోచన సరైనదేనా? ఆర్య భవిష్యత్తు ఏమవుతుంది?

👉 వెలుగు – పార్ట్ 2 కోసం తప్పకుండా ఫాలో అవ్వండి.


ముగింపు త్వరలో.. 


*** 

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page