top of page
Original.png

వికాసం – విధ్వంసం


Telugu moral story, development vs destruction Telugu, inspirational Telugu story, environmental awareness Telugu, village moral story Telugu, social message Telugu story, Karlapalem Hanumantharao stories

గ్రామ పంచాయితీలో ఒకవైపు చెట్టును నరికేసిన సోమయ్య, మరోవైపు తోటను తయారుచేసిన రామయ్య కనిపిస్తున్న భావోద్వేగ తెలుగు సామాజిక కథ పోస్టర్.
గ్రామ పంచాయితీలో ఒకవైపు చెట్టును నరికేసిన సోమయ్య, మరోవైపు తోటను తయారుచేసిన రామయ్య కనిపిస్తున్న భావోద్వేగ తెలుగు సామాజిక కథ పోస్టర్.

Vikasam Vidhvamsam - Telugu Moral Story | Karlapalem Hanumantha Rao

వికాసం - విధ్వంసం - తెలుగు నీతి కథ | కర్లపాలెం హనుమంతరావు

Published In manatelugukathalu.com On 27/05/2026


ఒకసారి వారిద్దరి మధ్య ఒక పెద్ద గొడవ జరిగింది. అది కాస్తా ఊరి పంచాయితీకి చేరింది. ఊరి పెద్ద గుణనిధి ఇద్దరు చెప్పేదీ సావధానంగా విన్నాడు.


"అయ్యా! మా ఇంటి ముందున్న బావి పాడుబడింది. దాని పక్కనే ఉన్న రామయ్య పాతకాలం నాటి గోడ రాళ్ళతో బావిని పూడ్చేశాను. పాతగోడ పెచ్చులాడి ఏ క్షణంలో ఎవరి మీద పడుతుందో అని ఊరి జనం బిక్కుబిక్కు మంటున్నారు. నిజానికి నేను గ్రామానికి మేలే చేశాను కదా! " అన్నాడు సోమయ్య అతితెలివికి పోతూ.


రామయ్య నిమ్మళంగా అన్నాడు, "అయ్యా, నన్ను అడగకుండా నా గోడను కూలగొట్టి ఊరిని ఉద్ధరించానంటున్నాడు ఈ సోమయ్య. జనాలకు అంత ఇబ్బందిగా ఉందనిపిస్తే నేనే నా గోడను కూలగొట్టే వాడిని. ఆ గోడరాళ్ళను నా స్వంతానికి వాడుకొనేవాడిని. ఈ సోమయ్య తన బావిని నా రాళ్ళతో పూడ్చుకుని ఊరికి ఉపకారం చేసానని ఊదరగొడుతున్నాడు! నిజానికి ఈయన చేసింది విధ్వంసం. దారికడ్డంగా పడ్డ చెత్తా చెదారాన్ని కనీసం వూడ్పించనైనా లేదు! ఊరికి ఈయన చేసిన మేలు ఇంకేముంది?! “


గుణనిధి కాసేపు ఆలోచించి, ఇద్దరికీ ఒక చిన్న పరీక్ష పెట్టారు. "రేపు ఉదయానికల్లా మీ ఇద్దరి ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశాల్లో ఏదైనా ఒక 'మార్పు' చేసి చూపించండి. ఎవరి వాదనలో వాస్తవముందో అప్పుడు చెబుతాను" అని అన్నాడు. 


 తెల్లవారేసరికి సోమయ్య తన ఇంటి ముందున్న పెద్ద వేప చెట్టును కొట్టేశాడు. "చూశారా! ఇప్పుడు ఎంత ఖాళీ స్థలం వచ్చిందో.. ఇక్కడ ఎంత పెద్ద మేడనైనా కట్టొచ్చు" అన్నాడు గర్వంగా. 


 రామయ్య తన ఇంటి ముందున్న ఎండిపోయిన పాత గుంటను శుభ్రం చేసి, చుట్టూ మిగిలిపోయిన తన గోడ మట్టి పోసి, కొన్ని కాయగూరల విత్తులు జల్లి తోటకు సిద్ధం చేశాడు. 


ఉపయోగానికే కాదు చూపులకూ అందంగా తయారైన ఆ మునుపటి ఖాళీ జాగాను చూసి "ఇదీ అసలైన వికాసం అంటే! ఏ వస్తువునైనా వ్యవస్థనైనా స్వార్థ ప్రయోజానికి నాశనం చేస్తే అది 'విధ్వంసం' అవుతుంది. తన బావిని పూడ్చుకొనే స్వార్థంతో పొరుగువాడి గోడను కూల్చిన సోమయ్య చేసింది ఈ తరహా విధ్వంసమే! ఉన్నదానికి మెరుగులు దిద్ది, దాన్ని మరింత ప్రజోపకరంగా మార్చడం 'వికాసం' అవుతుంది. చెత్తాచెదారంతో నిండిన ఖాళీస్థలాన్ని కాయగూరల తోటలా మార్చిన రామయ్యదే అసలైన 'వికాసం' " అని ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పాడు గుణనిధి. 


సమాప్తం. 

 ***

కర్లపాలెం హనుమంతరావు గారి కొన్ని ఇతర రచనలు:


కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

#KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #తెలుగునీతికథలు, #మురికి, #Muriki, Inspirational Telugu Stories, Life Lessons Telugu, Social Stories Telugu, Emotional Stories Telugu, Humanity Stories, Telugu Kathalu, Heart Touching Stories, Railway Story Telugu

 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page