వినాయక దేవుడి క్విజ్

Vinayaka Devudi Quiz - Telugu Devotional Quiz | P V Padmavathi Madhu Nivrithi
వినాయక దేవుడి క్విజ్ - తెలుగు భక్తి క్విజ్ | పి. వి. పద్మావతి మధు నివ్రితి
Published in manatelugukathalu.com on 30/09/2026
వినాయకుడు లేదా గణేశుడి గురించి మన పురాణాల్లో ఎన్నో ఆసక్తికరమైన కథలు, విశేషాలు ఉన్నాయి. భక్తితో పాటు పురాణ విజ్ఞానాన్ని పెంచే ఈ గణేశ క్విజ్‌ను చదివి మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి.
భాగం 1 (గణేశుని జననం)
1Q) వినాయకుడు / గణేశుడు ఎలా జన్మించాడు లేదా పరిణామం చెందాడు?
జవాబు)
పార్వతి స్నానం చేసేటప్పుడు ఏకాంతం కోరుకుంది. అందుకని ఆమె తన శరీరంపై ఉన్న పసుపు, చందనం (శనగపిండి) ముద్దను ఒక బాలుడి రూపంలోకి మలిచి, అతనికి ప్రాణం పోసి, తలుపును కాపలా కాయమని, ఎవరినీ లోపలికి రానివ్వవద్దని చెప్పింది.
2Q) గణేశుడు / వినాయకుడు ఏనుగు తల ఎలా పొందాడు?
జవాబు)
i) పార్వతి స్నానం చేస్తున్న గదికి కాపలాగా ఉన్న గణేశుడు (బాలుడు)... అటుగా వచ్చిన శివుడిని అడ్డుకున్నాడు. తనకు ఎవరో తెలియకపోయినా వినాయకుడు శివుడిని లోపలికి వెళ్లనీయలేదు. దీంతో కోపగించిన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తలను ఖండించాడు.
ii) జరిగిన విషయం తెలుసుకుని పార్వతీదేవి శోకసంద్రంలో మునిగి, తన కుమారుడికి మళ్లీ ప్రాణం పోయాలని శివుడిని కోరింది.
iii) తన తప్పును తెలుసుకున్న శివుడు, ఉత్తర దిశగా తలపెట్టి పడుకుని ఉన్న ఏనుగు (మొదటి పసి ప్రాణి) తలను తెచ్చి బాలుడికి ప్రాణప్రతిష్ఠ చేయాలని తన గణాలను ఆదేశించాడు. అలా ఏనుగు తలను అతికించి వినాయకుడిని పునర్జీవింపజేశాడు (మహాశివుడు).
-----------------------X X X --------------------------
భాగం 2 (గణేశునికి వివిధ పేర్లు ఎలా వచ్చాయి?)
3Q) గణేశునికి ఏనుగు తల పొందినందుకు ఏ పేరు వచ్చింది?
జవాబు)
గజానన.
4Q) గణేశునికి విఘ్నేశ్వర అనే పేరు ఎలా వచ్చింది?
జవాబు)
'విఘ్న' అంటే ఆటంకాలు లేదా కష్టాలు.
'ఈశ్వర' అంటే ప్రభువు లేదా అధిపతి.
ఈ రెండూ కలిపి "విఘ్నేశ్వర" అంటే "కష్టాలు మరియు అడ్డంకులన్నింటికీ అధిపతి" లేదా "విఘ్నాలను - కష్టాలను నివారించేవాడు / తొలగించే దైవశక్తి" అని అర్థం.
5Q) హిందూ సంప్రదాయంలో ఏ మంచి పనినైనా, పూజనైనా, కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించే ముందు విఘ్నేశుడిని మొదటిగా పూజిస్తారు. అలా ఎందుకు?
జవాబు)
భక్తుల జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా, ఎలాంటి ఆటంకాలనైనా ఆయన తన బుద్ధిబలంతో తొలగిస్తాడని నమ్ముతారు. అందుకే ఆయనకు "విఘ్నేశ్వరుడు", "విఘ్నహర్త" అనే సార్థక నామాలు వచ్చాయి.
6Q) గణేశునికి వినాయక అనే పేరు ఎలా వచ్చింది?
జవాబు)
'వి' అనగా విశేషమైన లేదా ప్రత్యేకమైన అని, 'నాయక' అనగా నాయకుడు అని అర్థం. అంటే తనకుతానే సాటి అయిన అధిపతి / నాయకుడు లేనివాడు / తనకంటే పైన ఎవరూ నాయకులు లేరు అనే భావం.
7Q) గణేశునికి "గణేశ" అనే పేరు ఎలా వచ్చింది?
జవాబు)
గణ: శివుని శిష్యులు, అనుచరులు లేదా పార్థివ సమూహాలను 'గణాలు' అంటారు.
ఈశ: అధిపతి లేదా ప్రభువు.
అలా గణేశుడు అంటే "గణాలకు అధిపతి" అని అర్థం.
(గమనిక: శివుడు తన గణాలన్నింటికీ/శిష్యులకు ఆయన్ని నాయకుడిగా ప్రకటించడం వల్ల ఈ "గణేశుడు" / "గణేశ" పేరు స్థిరపడింది.)
8Q) గణేశునికి "లంబోదరుడు" అనే పేరు ఎలా వచ్చింది?
జవాబు)
సంస్కృతంలో 'లంబ' అంటే పెద్దది లేదా వ్రేలాడేది అని, 'ఉదర' అంటే పొట్ట అని అర్థం. ఈ రెండు పదాలు కలిసి 'లంబోదరుడు' (పెద్ద పొట్ట గలవాడు) అనే పేరు వచ్చింది.
(గమనిక: బ్రహ్మాండ పురాణం ప్రకారం గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును అనగా సమస్త విశ్వాన్ని/బ్రహ్మాండాలను తన ఉదరంలో/పొట్టలో ఇముడ్చుకున్న దేవుడు కాబట్టి ఆయనకు ఈ పేరు సార్థకమైంది. ఆధ్యాత్మికంగా ఇది ఆయన సర్వవ్యాపకత్వాన్ని, సృష్టిలోని సమస్త చరాచర జగత్తును రక్షించే గుణాన్ని సూచిస్తుంది.)
9Q) గణేశుడికి ఏకదంతుడు అనే పేరు ఎలా వచ్చింది?
జవాబు)
కైలాసానికి కాపలాగా ఉన్న గణేశుడు, శివుని ఆజ్ఞ మేరకు అక్కడికి వచ్చిన పరశురాముడిని లోనికి అనుమతించలేదు.
పరశురాముడు ఆగ్రహంతో యుద్ధం ప్రకటించాడు.
పరశురామునితో జరిగిన యుద్ధంలో ఆయన గొడ్డలి దెబ్బ కారణంగా గణేశుడు తన ఒక దంతాన్ని కోల్పోయాడు.
ఆ చప్పుడు విని శివుడు బయటకు వచ్చి ఇద్దరినీ శాంతింపజేశాడు.
(గమనిక:
i) రెండవ దంతం ఒకటి మాత్రమే మిగిలింది, అలా గణేశుడికి 'ఏకదంతుడు' అనే పేరు వచ్చింది.
ii) మరో కథనం ప్రకారం, మహాభారత రచన సమయంలో వ్యాసుడు నోటితో చెప్పే శ్లోకాలను నిరంతరాయంగా రాయడానికి కలం విరిగిపోవడంతో, వినాయకుడు తన ఒక దంతాన్ని విరిచి కలంగా ఉపయోగించడం వల్ల ఆయనకు ఏకదంత అనే పేరు వచ్చింది అని కూడా అంటారు.)
10Q) గణేశుడికి "వక్రతుండ" అనే పేరు ఎలా వచ్చింది?
జవాబు)
వంకర తొండం ఉండటం వల్ల.
(గమనిక: సంస్కృతంలో 'వక్ర' అంటే వంకరైన లేదా తిరిగిన అని, 'తుండ' అంటే ముఖం లేదా తొండం అని అర్థం. అంటే వంకరగా తిరిగిన తొండం కలిగినవాడు అని దీని భావం.)
11Q) గణేశుడికి మూషికవాహనుడు / మూషికాసుర విజేత అనే భావనతో మూషిక సంబంధం ఎలా వచ్చింది?
జవాబు)
ఎందుకంటే అతని వాహనం, ఆసనం ఎలుక (మూషికం) కాబట్టి. మూషికాసురుడనే రాక్షసుడిని సంహరించాడు కాబట్టి
-----------------------X X X --------------------------
భాగం 3 (గణేశుని కుటుంబం)
12Q) గణేశుని తల్లిదండ్రులు ఎవరు?
జవాబు) పార్వతీపరమేశ్వరులు.
13Q) గణేశుని సోదరుడు ఎవరు?
జవాబు) కార్తికేయుడు / సుబ్రహ్మణ్యస్వామి.
14Q) గణేశుని (ఇద్దరు) భార్యలు ఎవరు?
జవాబు) సిద్ధి - బుద్ధి.
15Q) సుబ్రహ్మణ్యస్వామి (ఇద్దరు) భార్యలు ఎవరు?
జవాబు) వల్లి - దేవయాని.
భాగం 4 (గణేశుని కుటుంబ వాహనాలు - ఆసనాలు)
16Q) గణేశుని వాహనం - ఆసనం ఏది?
జవాబు) మూషికం / ఎలుక.
17Q) కార్తికేయుడు / సుబ్రహ్మణ్యస్వామి వాహనం - ఆసనం ఏది?
జవాబు) నెమలి.
18Q) శివుడి వాహనం - ఆసనం ఏది?
జవాబు) నంది / ఎద్దు.
19Q) పార్వతీదేవి వాహనం - ఆసనం ఏది?
జవాబు) వాహనం సింహం (లేదా పులి) కాగా, ఆమె ఆసనం పద్మం (తామరపువ్వు) లేదా సింహాసనం.
(గమనిక:
i) సాధారణంగా పార్వతీదేవిని సింహవాహినిగా కొలుస్తారు. శైలపుత్రి, చంద్రఘంట, కూష్మాండ వంటి నవరాత్రి రూపాలలో ఆమె సింహాన్ని వాహనంగా చేసుకుంటుంది.
ii) కొన్ని సందర్భాల్లో పులిని కూడా వాహనంగా చూపుతారు.
iii) దేవి ప్రశాంత రూపంలో ఉన్నప్పుడు పద్మాసనంపై/తామరపువ్వుపై కూర్చుని కనిపిస్తుంది.
iv) అలాగే లలితా త్రిపురసుందరి వంటి రాజసం ఉట్టిపడే రూపాల్లో రత్నాలు పొదిగిన సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది.)
------------------------ X X X -------------------------
భాగం 5 (గణేశుని కథలు)
20Q) గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగాడని (ప్రదక్షిణ చేశాడని), లోకాన్ని చుట్టివచ్చినంత ఫలితాన్ని పొందాడని చెప్పే కథ మన పురాణాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. ఆ కథను వివరించండి?
జవాబు)
i) ఒకరోజు పరమశివుడు, పార్వతీదేవిల వద్దకు ఒక అమూల్యమైన జ్ఞానఫలం (కొన్ని కథల ప్రకారం నారదుడు తెచ్చిన ఒక ప్రత్యేకమైన పండు) వస్తుంది. ఆ పండును తమ కుమారులైన గణేశుడు, కుమారస్వామి (కార్తికేయుడు) లలో ఎవరికి ఇవ్వాలా అని వారు ఆలోచిస్తారు. ఇద్దరూ ఆ పండు కావాలని పట్టుబట్టడంతో, శివపార్వతులు ఒక పోటీని పెడతారు.
ii) ఎవరైతే తమ వాహనాలపై ముల్లోకాలను (ప్రపంచాన్ని) మూడుసార్లు అత్యంత వేగంగా చుట్టి, మొదటగా తమ వద్దకు తిరిగి వస్తారో, వారికే ఈ జ్ఞానఫలాన్ని ఇస్తామని శివుడు ప్రకటిస్తాడు.
iii) పోటీ వినగానే, కుమారస్వామి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన వేగవంతమైన వాహనమైన నెమలిని ఎక్కి, విశ్వాన్ని చుట్టి రావడానికి వేగంగా బయలుదేరుతాడు. నదులు, పర్వతాలు, సముద్రాలు దాటుకుంటూ లోకాలను చుట్టడం ప్రారంభిస్తాడు.
iv) మరోవైపు, గణేశుడు ఆలోచనలో పడతాడు. ఆయన శరీరం స్థూలంగా ఉంటుంది, పైగా ఆయన వాహనం అత్యంత నెమ్మదిగా వెళ్లే చిన్న ఎలుక (మూషికం). ఆ వాహనంతో విశ్వమంతా తిరగడం కుమారస్వామితో పోలిస్తే సాధ్యం కాదని గణేశుడికి తెలుసు. కానీ, గణేశుడు కేవలం బలంతో కాకుండా బుద్ధితో ఆలోచించాడు.
v) శాస్త్రాల ప్రకారం "తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. సృష్టికి మూలమైన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే, ముల్లోకాలను చుట్టివచ్చినంత పుణ్యం లభిస్తుంది" అనే పరమ సత్యాన్ని ఆయన గుర్తుచేసుకున్నాడు.
vi) గణేశుడు భక్తిశ్రద్ధలతో తన తల్లిదండ్రులైన శివపార్వతులను ఒకచోట కూర్చోబెట్టాడు. వారికి నమస్కరించి, తన మూషిక వాహనంపై వారి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేశాడు.
vii) ఆయన బుద్ధికి, శాస్త్రజ్ఞానానికి, పితృభక్తికి శివపార్వతులు ఎంతో సంతోషించారు. కుమారస్వామి లోకాలను చుట్టి తిరిగి వచ్చేసరికి, గణేశుడే విజేతగా నిలిచి ఆ జ్ఞానఫలాన్ని అందుకున్నాడు.
------------------------ X X X -------------------------
భాగం 6 (గణేశుని 12 వివిధ పేర్లు... 8 అవతారాలు)
21Q) శ్రీ గణేశ ద్వాదశనామ స్తోత్రంలో ఉన్న పన్నెండు పేర్లు ఏవి?
జవాబు)
i) వక్రతుండ
ii) ఏకదంత
iii) కృష్ణపింగలాక్ష
iv) గజవక్త్ర
v) లంబోదర
vi) వికట
vii) విఘ్నరాజ
viii) ధూమ్రవర్ణ
ix) భాలచంద్ర
x) వినాయక
xi) గణపతి
xii) గజానన
22Q) గణేశుని 8 వివిధ అవతారాలు ఏవి?
జవాబు)
i) వక్రతుండ అవతారం: మత్సరాసురుడు (అసూయకు ప్రతీక) అనే రాక్షసుడిని సంహరించేందుకు గణేశుడు ఈ అవతారం ఎత్తాడు. ఇది వంకరగా ఉన్న తొండం కలిగి ఉంటుంది.
ii) ఏకదంతుడు: మదాసురుడు (గర్వం/మదం) అనే అసురుడిని అంతం చేయడానికి ఏకదంతునిగా అవతరించాడు. ఇది వివేకానికి, ఏకాగ్రతకు ప్రతీక.
iii) మహోదరుడు: మోహాసురుడు (మోహం, గందరగోళం) అనే రాక్షసుడిని ఓడించడానికి ఈ పెద్ద పొట్ట కలిగిన రూపాన్ని ధరించాడు.
iv) గజాననుడు: లోభాసురుడు (దురాశ) అనే అసురుడిని ఓడించడానికి గణేశుడు గజానన రూపాన్ని తీసుకున్నాడు. ఇది సర్వోన్నత జ్ఞానాన్ని సూచిస్తుంది.
v) లంబోదరుడు: క్రోధాసురుడు (కోపం) అనే రాక్షసుడిని ఎదుర్కోవడానికి లంబోదరుడి అవతారాన్ని ఎత్తాడు. ఇది కోపాన్ని నియంత్రించడాన్ని నేర్పుతుంది.
vi) వికటుడు: కామాసురుడు (కోరికలు/కామం) అనే రాక్షసుడిని నాశనం చేయడానికి వికట రూపాన్ని ధరించాడు.
vii) విఘ్నరాజుడు: మమాసురుడు (మమకారం, వ్యామోహం) అనే అసురుడిని అణచివేసేందుకు విఘ్నరాజ రూపాన్ని ధరించాడు. సమస్త విఘ్నాలను తొలగించే దేవుడిగా ఈ రూపం చాలా ప్రసిద్ధి చెందింది.
viii) ధూమ్రవర్ణుడు: అహంకారాసురుడి (అహంకారం) అహంభావం అణచివేసేందుకు పొగ రంగులో ఉండే ధూమ్రవర్ణ అవతారాన్ని ధరించాడు. ఇది అంతర్గత శుద్ధికి, ఆధ్యాత్మిక వృద్ధికి ప్రతీక.
23Q) గణేశునికి భాలచంద్రుడు అనే పేరు ఎలా వచ్చింది?
జవాబు) ఆయన తన నుదుటిపై (శిరస్సుపై) నెలవంకను (చంద్రుడిని) ధరించడం వల్ల వచ్చింది.
(వివరణ:
i) చంద్రుని గర్వభంగం - గణేశుని శాపం: ఒకసారి వినాయకుడు భోజనం చేసిన తర్వాత తన వాహనమైన మూషికం (ఎలుక) పై ప్రయాణిస్తుంటాడు. మార్గమధ్యంలో ఒక పాము అడ్డురావడంతో మూషికం భయపడి పక్కకు తప్పుకుంటుంది.
దాంతో గణేశుడు కిందపడిపోతాడు. ఈ దృశ్యాన్ని ఆకాశం నుండి చూసిన చంద్రుడు, తన అందంపై ఉన్న గర్వంతో వినాయకుడి రూపాన్ని చూసి గట్టిగా నవ్వుతూ అవహేళన చేస్తాడు. చంద్రుని అహంకారానికి కోపగించిన గణేశుడు, "ఇకపై నీ అందం, ప్రకాశం క్షీణించిపోతాయి.
నిన్ను ఎవరూ చూడరు; వినాయక చవితి రోజున నిన్ను చూసిన వారికి అపనిందలు (నీలాపనిందలు) కలుగుతాయి" అని శపిస్తాడు. శాపం కారణంగా తన కాంతిని కోల్పోయిన చంద్రుడు, బ్రహ్మదేవుని సలహాతో తన తప్పును తెలుసుకుని గణేశుడిని తీవ్రంగా ప్రార్థిస్తాడు. చంద్రుని పశ్చాత్తాపానికి సంతోషించిన వినాయకుడు శాపవిమోచనం ప్రసాదిస్తూ, చంద్రుడు క్షీణించడం... తిరిగి పూర్తి రూపం పొంది ప్రకాశించడం అనే నియమాన్ని ఏర్పాటు చేస్తాడు.
ii) అనలాసురుని కథ: మరో కథనం ప్రకారం, లోకాలను పీడిస్తున్న 'అనలాసురుడు' అనే రాక్షసుడిని వినాయకుడు మింగేస్తాడు. ఆ రాక్షసుడి శరీరంలోని తీవ్రమైన అగ్ని కారణంగా వినాయకుని శరీరంలో అమితమైన వేడి (ఉష్ణము) పుడుతుంది.
ఆ వేడిని చల్లార్చడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా చంద్రుడు వచ్చి వినాయకుడి నుదిటిపై నిలిచి తన శీతల కిరణాలతో ఆ వేడిని తగ్గిస్తాడు. అలా చంద్రుడిని శిరస్సుపై/నుదిటిపై ధరించినందుకు గాను ఆయనకు ఈ పేరు వచ్చింది.
iii) ఆధ్యాత్మిక భావం: ఆధ్యాత్మికంగా, వినాయకుడి నుదిటిపై ఉండే భాలచంద్రుడు ప్రశాంతతకు, అత్యున్నతమైన జ్ఞానానికి మరియు సమయపాలనకు సంకేతంగా నిలుస్తుంది.)
24Q) గణేశుడి కొన్ని ప్రసిద్ధ పేర్లకు వివరణాత్మక వివరణ ఇవ్వండి?
జవాబు)
భాలచంద్రుడు: తలపై/నుదుటిపై చంద్రుని ధరించినవాడు.
గౌరీసుతుడు: పార్వతీదేవి (గౌరీదేవి) కుమారుడు.
గజవక్త్ర: ఏనుగు ముఖము (తొండము) గలవాడు.
కృష్ణపింగలాక్ష:
i) శారీరక రూపం ఆధారంగా అర్థం:
కృష్ణ: నలుపు లేదా ముదురు వర్ణం.
పింగ: ఎరుపు-గోధుమ రంగు.
అక్ష: కళ్ళు.
మొత్తం అర్థం: "నల్లని లేదా ముదురు రంగు శరీరం మరియు ఎరుపు-గోధుమ రంగు కళ్ళు కలిగినవాడు" అని అర్థం. వినాయకుని ఈ రూపం ఆయనలోని తపశ్శక్తిని, తీవ్రమైన దైవిక శక్తిని సూచిస్తుంది.
ii) ఆధ్యాత్మిక/తత్వశాస్త్ర పరమైన అర్థం: నారద మహర్షి వివరణ ప్రకారం దీనికి మరొక అంతరార్థం ఉంది:
కృష్ణ: లోకంలో జరిగే చీకటి పనులు లేదా చెడు కార్యాలు (పాపాలు).
పింగాక్ష: నిరంతరం నిఘా ఉంచే కన్ను కలిగినవాడు.
మొత్తం అర్థం: ప్రపంచంలో జరిగే చెడు పనులపై లేదా పాపాలపై నిరంతరం తన దృష్టిని ఉంచి, వాటిని నాశనం చేసేవాడు.
వికటవిఘ్న: లోకాలను పీడిస్తున్న కామాసురుడు అనే రాక్షసుడిని అంతం చేయడానికి వినాయకుడు ఈ అవతారాన్ని ఎత్తాడు.
'వికట' అంటే అసాధారణమైన లేదా విలక్షణమైన రూపం.
'విఘ్న' అంటే అడ్డంకులను తొలగించేవాడు.
(గమనిక: వికటవిఘ్న అవతారంలో వినాయకుడు నెమలిని (మయూరం) వాహనంగా చేసుకుని దర్శనమిస్తాడు. ఈ రూపంలో స్వామివారు సౌమ్యంగా, కాంతివంతంగా ఉంటూ భక్తుల కష్టాలను తీరుస్తాడని నమ్ముతారు. ఈ అవతారం కామ క్రోధాలను అణచివేయడానికి మరియు భక్తుల జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద విఘ్నాలను తొలగించడానికి ఉద్దేశించబడింది.)
విఘ్నరాజేంద్ర: (విఘ్నరాజ + ఇంద్రుడు) సంస్కృతంలో 'రాజేంద్ర' అంటే 'రాజులకు రాజు' లేదా 'అధిపతి' అని అర్థం. సమస్త విఘ్నాలను, అడ్డంకులను తొలగించడానికి ఆయనే ప్రభువు, సర్వాధికారి, రారాజు.
ధూమ్రవర్ణుడు: 'ధూమ్రవర్ణ' అనేది వినాయకుని 12 ముఖ్యమైన నామాలలో, అలాగే ఆయన ఎనిమిది (అష్ట) అవతారాలలో ఒకటి. సంస్కృతంలో 'ధూమ్ర' అంటే పొగ అని, 'వర్ణ' అంటే రంగు అని అర్థం. అంటే, పొగ లాంటి బూడిద/లేత రంగు శరీరం కలిగినవాడు.
(గమనిక: సూర్య భగవానుడికి ఒకానొక సమయంలో తన శక్తుల పట్ల విపరీతమైన గర్వం (అహంకారం) కలుగుతుంది. ఆ అహంకార తలంపుల నుండి 'అహంకారాసురుడు' (లేదా అహంతాసురుడు) అనే శక్తివంతమైన రాక్షసుడు జన్మిస్తాడు. అతడు లోకాలను పీడిస్తూ, దేవతలను ఇబ్బంది పెడుతుంటాడు. దేవతల ప్రార్థనలను ఆలకించి, వినాయకుడు 'ధూమ్రవర్ణ' అవతారాన్ని ఎత్తి, పొగ రంగు రూపంలో ప్రత్యక్షమై ఆ రాక్షసుడి అహంకారాన్ని అణచివేసి లోకకల్యాణం చేస్తాడు.)
------------------------ X X X -------------------------
గణేశ క్విజ్ సమాప్తం
హామీ పత్రం:
ఇది మా స్వంత సంకలనం.
ధన్యవాదాలు,
పి.వి. పద్మావతి మధు నివ్రితి
12-11-1519/1518/1,
సన్‌షైన్ రెసిడెన్సీ,
బౌద్ధ్ నగర్,
సికింద్రాబాద్ - 500061,
తెలంగాణ, భారత్.
M: +91 7671054394
14 సెప్టెంబర్ 2026, సోమవారం
-------------------- నీతి సమాప్తం ---------------------
This is OUR SENT "166th" article in this popular prestigious Telugu web magazine. ....In about 1.5 years.
THANKS to the encouraging & inspirational management of ... www.manatelugukathalu.com
--------X X X --------- X X X ------- X X X ---------
--------------------- END -----------------------
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి కొన్ని ఇతర రచనలు:
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).











Comments