పంచ రంగులు
- Bhaskara Rao B. R. K. V.

- 22 hours ago
- 2 min read

Pancharangulu - Telugu Inspirational Poetry | Bhaskara Rao B. R. K. V.
పంచ రంగులు - తెలుగు ప్రేరణాత్మక కవిత | బి ఆర్ కె వి భాస్కర రావు
Published in manatelugukathalu.com on 03/09/2026
నీటి బొట్టు.....
బి ఆర్ కె వి భాస్కర రావు
రూపు ఒక్కటే..
రుచులు వేరు..
రంగులేని అది ఉన్నచోట రంగునే పులుముకుని కనిపిస్తుంది...
జన్మస్థానాలు అనంతం
వాయువు...
రూపు లేదు..
మనోహరంగా ఒక్కోసారి
భయంకరంగా మరోసారి స్పర్శిస్తుంది
అద్దెకు తెచ్చుకున్న రంగులు కప్పుకుని ప్రయాణం చేస్తుంది...
పృథ్వి......
ఎన్నో వర్ణాల వస్త్రాలు ధరించి ఇంకెన్నో ఆకారాల తో కనువిందు చేస్తుంది...
ప్రేమతో అమ్మ అయి ఆకలి తీరుస్తుంది..
కోపమొస్తే కాళి అయి నోరు తెరిచి మింగేస్తుంది...
అగ్ని...
ఒకటే గుణం అన్నిచోట్లా..
పుట్టినచోటు తెస్తుంది పేరు,రంగు...
పేరుకు తగ్గట్టే దాని స్థానం కూడా..
గగనం...
అందంగా కనిపించే అబద్ధం...
అన్నిటిని ఆకర్షించే అదృష్టశాలి...
పగటిపూట ఒక్క పువ్వునే ధరించి
రాత్రుళ్ళు వళ్ళంతా మల్లెమొగ్గల్ని జల్లుకుంటుంది నల్లచీర సింగారించుకుని...
***
బి ఆర్ కె వి భాస్కర రావు గారి కొన్ని ఇతర రచనలు:
బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు
ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.
భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.
రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.
పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు
నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు
ఊరు పాలి









Comments