డిజిటల్ బానిసలు
డిజిటల్ బానిసలు, తెలుగు కథ, AI కథ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ వ్యసనం, సోషల్ మీడియా ప్రభావం, మొబైల్ వ్యసనం, టెక్నాలజీ కథ, భవిష్యత్ కథ, సైన్స్ ఫిక్షన్ తెలుగు, తెలుగు సామాజిక కథ, యువత కథ, ప్రేమ కథ, AI ప్రమాదాలు, డిజిటల్ ప్రపంచం, టెక్నాలజీ మరియు మనిషి, Telugu Story, AI Telugu Story, Digital Addiction, Future Fiction

Digital Banisalu - Telugu Emotional Story | Karlapalem Hanumantha Rao
డిజిటల్ బానిసలు - తెలుగు భావోద్వేగ కథ | కర్లపాలెం హనుమంతరావు
Published In manatelugukathalu.com On 02/07/2026
కాలేజీ లైబ్రరీ రూమ్ నుండి బయటపడ్డ ఈశ్వర్‌కు తన గుండె ఎందుకో బరువుగా అనిపించింది.
ఈశ్వర్ జేబులో ఉన్న ఫోన్ వైబ్రేట్ అయింది. తీసి చూశాడు.
'ట్రూథింక్' యాప్ నోటిఫికేషన్ "థేంక్స్ ఫర్ ది టైమ్లీ యాక్షన్ ఈశ్వర్! నౌ యువర్ అడ్రినలిన్ లెవెల్ రేటింగ్ టచ్డ్ 4.2%. కీపిట్ గోయింగ్ బ్రో!"
ఈశ్వర్ విరక్తిగా నవ్వుకున్నాడు. గతంలో మనుషులు తమ మనసు చెప్పిన మాట వినేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే ఆఖరి మాట అయిపోయింది. ఫోన్లలోని ‘ట్రూథింక్’ యాప్ చెప్పిందే వేదం అయిపోయింది!
ఈ ఫోన్ మైక్రోఫోన్ ద్వారా చుట్టూ జరిగే మాటలను వింటుంది, ఎదుటివారి హావభావాలను స్కాన్ చేస్తుంది, అనలైజ్ చేసి ఏం చేస్తే మంచిదో వివరిస్తుంది.
చలికాలమే అయినా ఉక్కబోతగా ఉంది వాతావరణం. ఈశ్వర్ రోడ్డు పక్కన నడుస్తూ ఆలోచించసాగాడు.
అనన్యతో గడిపిన ఆ కొన్ని క్షణాలు ఎంత మధురంగా ఉన్నాయో! ఆమె కళ్ళలో మెరుపు, ముఖంలో కాంతి, మాటలో ఆత్మీయత.. తను కోరుకునే అమ్మాయి రూపుదిద్దుకుని కళ్ళెదుటే ఉంది. మొదటిసారి ఒక అందమైన ఆడపిల్లతో మాట కలిపినప్పుడు ఏ యువకుడి గుండెలైనా తనకు లాగే కొట్టుకుంటాయి. కానీ ట్రూత్ యాప్ మాత్రం ఆ ఉద్వేగాన్ని 'ఆందోళన' గా అర్థం చేసుకుంది.
"సొంతంగా ఆలోచించే సామర్థ్యం కోల్పోయి డిజిటల్, ఈ స్క్రీన్లకి బానిస అయిపోతున్నానా?" ఉన్నట్టుండి ఈశ్వర్‌లో ఒక రకమైన అసహనం మొదలయింది.
ఏమైతేనేం, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇక వెనక్కి తిరిగి వెళ్ళలేడు. తలంతా బరువుగా తయారైంది.
రిలీఫ్ కోసం పక్కనే ఉన్న ఒక ఇరానీ కేఫ్‌లోకి అడుగుపెట్టాడు. వేడి చాయ్ ఆర్డర్ ఇచ్చి, కిటికీ పక్కన కూర్చున్నాడు.
అప్పుడే తన ముందు టేబుల్ దగ్గర ఒక అమ్మాయి, అబ్బాయి కూర్చుని ఉండటం గమనించాడు. వాళ్ళు కూడా లవర్స్‌లా ఉన్నారు.
కానీ విచిత్రం ఏంటంటే... వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం లేదు. ఇద్దరి కళ్ళూ ఫోన్ స్క్రీన్ల మీదే ఉన్నాయి. బహుశా వాళ్ళ యాప్‌లు ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ ఇస్తున్నాయేమో!
ఈశ్వర్‌కు చచ్చే చిరాకేసింది. ఈ రకం యాప్‌లను నమ్ముకునే వాళ్ళకి ఏ గతి పడుతుందో ఈ లవ్ బర్డ్స్‌కు ఇప్పుడే తెలిసే అవకాశం లేదు. అయినా మనిషి స్వేచ్ఛను డిజిటల్ లోకం శాసించడం ఏంటి?"
జేబులో నుంచి ఫోన్ తీసి అన్‌లాక్ చేశాడు.. ‘ట్రూథింక్’ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని డిలీట్ బటన్ మీద వేలు పెట్టాడు.
కానీ సరిగ్గా అదే సమయంలో... అతని ఫోన్ 'ష్’ అంది. కొత్త మెసేజ్ ఒకటి వచ్చింది. పంపింది ఎవరో కాదు... అనన్య!
ఈశ్వర్ ఆత్రుతగా ఆ మెసేజ్ ఓపెన్ చేశాడు. అందులో ఇలా ఉంది:
"సారీ ఈశ్వర్, నీతో అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు. నిజానికి నీతో చాలా మాట్లాడాలని, సరదాగా గడపాలని నా మనసు ఉవ్విళ్ళూరింది.
కానీ నీ ఎదుట కూర్చున్నంతసేపూ నా ఫోన్‌లోని 'ట్రూథింక్' నసపెడుతూనే ఉంది. 'ఇతని ప్రవర్తన స్థిరంగా లేదు. ఇతనితో బంధం నీకు భవిష్యత్తులో ప్రమాదం. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో' అంటూ ఒకటే వైబ్రేషన్స్! సారీ ఆ టైంలో నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఈ యాప్ మాయలో పడి అర్థాంతరంగా లేచి వెళ్ళిపోయాను. సారీ, ఫర్ మై సెన్స్‌లెస్ బిహేవియర్!"
ఈశ్వర్ షాక్‌తో ఆ మెసేజ్ వైపు చూస్తూ ఉండిపోయాడు. బుర్ర గిర్రున తిరిగిపోతుంది. ఆ క్షణంలో ఏం చేయాలో పాలుపోవడం లేదు.
మళ్ళీ ‘ష్’ మని సౌండు వచ్చింది. ఫోన్లో మెసేజ్ మెరిసింది, “బి అలర్ట్ మిస్టర్ ఈశ్వర్! మీ బ్రైన్‌లోని అమిగ్డలా రెస్పాన్స్ రేటు అబ్నార్మల్ స్థాయిలో పెరుగుతోంది. వెంటనే ఇంటికి పో! నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని నైటంతా కదలకుండా పడుకుండిపో!”
***
సమాప్తం.
కర్లపాలెం హనుమంతరావు గారి కొన్ని ఇతర రచనలు:
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.











Comments