top of page
Original.png

ఎదురిచ్చి ఒదిలించుకుంటారు

ఉద్యోగ జీవితం, layoffs, corporate culture, business decision, ఉద్యోగ భద్రత, ఉద్యోగి జీవితం, corporate reality, work life balance, employee experience, office politics, Telugu article, motivational article, career awareness, corporate truth

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'ఎదురిచ్చి ఒదిలించుకుంటారు' వ్యాసంలో కార్పొరేట్ ఉద్యోగి రాత్రివేళ ఆఫీసులో ఒంటరిగా కూర్చుని ఉద్యోగ భద్రతపై ఆలోచిస్తున్న భావోద్వేగ దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'ఎదురిచ్చి ఒదిలించుకుంటారు' వ్యాసంలో కార్పొరేట్ ఉద్యోగి రాత్రివేళ ఆఫీసులో ఒంటరిగా కూర్చుని ఉద్యోగ భద్రతపై ఆలోచిస్తున్న భావోద్వేగ దృశ్యం.

Eduricchi VadilinchukuntaruTelugu Inspirational Article | Kotha Viritha

ఎదురిచ్చి ఒదిలించుకుంటారు తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 20/06/2026


కార్పొరేట్ ప్రపంచం నిజంగా గొప్పది.

ముందు పది గంటలు పని చేయమంటుంది. తర్వాత ఇరవై గంటలు పని చేయమంటుంది.వీకెండ్లు, సెలవులు,కుటుంబ వేడుకలు,ఆరోగ్యం.ఇవన్నీ విజయానికి అడ్డంకులని ఎంతో ప్రేమగా వివరిస్తుంది.


రాత్రిళ్లు నిద్ర లేకుండా ప్రాజెక్టులు పూర్తి చేయి. కుటుంబాన్ని పక్కన పెట్టి టార్గెట్లు చేరుకో.అప్పుడు నీకు ప్రత్యేక బిరుదులు కూడా ఇస్తారు.


"నువ్వే మా బలం."

"నువ్వే మా స్టార్ పర్ఫార్మర్."

"మేమంతా ఒక కుటుంబం."


అంత ప్రేమ చూపించే యాజమాన్యం ఒకరోజు అకస్మాత్తుగా మీటింగ్‌కు పిలుస్తుంది.

ఐదు నిమిషాల కాల్.

రెండు నిమిషాల వివరణ.

మూడు మాటలు...

"వి ఆర్ సారీ."


"నేను ఏం తప్పు చేశాను" అని అడిగితే, అర్థం కాకుండా చెప్పే కార్పొరేట్ భాషలో కొన్ని వాక్యాలు వినిపిస్తాయి. చివరికి అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం "ఇది బిజినెస్ డెసిషన్."


నిన్నటి వరకు "ఫ్యామిలీ" అని పిలిచిన కంపెనీ,ఈరోజు "రిసోర్స్" అని పిలుస్తుంది. నిన్నటి వరకు "మా బలం" అన్న మనిషి, ఈరోజు ఎక్సెల్ షీట్‌లో ఒక లైన్ ఐటమ్‌గా మారిపోతాడు.


ఏళ్ల తరబడి కష్టపడిన ఉద్యోగి జీవితాన్ని మార్చేయడానికి కొన్ని గంటలే చాలనేది ఆధునిక కార్పొరేట్ ప్రపంచం సాధించిన అద్భుతమైన సామర్థ్యం.


అయితే ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి.

వాళ్లు చాలా మర్యాదస్తులు.

ముందు ఆశలు ఎదురిస్తారు.

తర్వాత కలలు ఎదురిస్తారు.


ఆ తర్వాత ప్రశంసలు ఇస్తారు. మరికొంత కాలం "నువ్వు లేకపోతే కంపెనీ నడవదు" అని నమ్మిస్తారు.

చివరికి, "వి ఆర్ సారీ" అని చెప్పి ఎంతో వినయంగా ఒదిలించుకుంటారు.


అందుకే కార్పొరేట్ ప్రపంచం మనకు నేర్పిన గొప్ప పాఠం ఏమిటంటే.. పనిని ప్రేమించు. జీతాన్ని గౌరవించు. కానీ కంపెనీ ప్రేమను మాత్రం ఉద్యోగ ఒప్పందంలో భాగంగా ఎప్పుడూ భావించకు.


ఎందుకంటే అక్కడ శాశ్వతమైనవి విలువలు కావు. బిజినెస్ డెసిషన్లే ఉంటాయి.

ముందు ఆశలు ఎదురిస్తారు. తర్వాత కలలు ఎదురిస్తారు.

చివరికి ఒక "వి ఆర్ సారీ" చెప్పి ఒదిలించుకుంటారు.


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Good narration and explained clearly the corporate systems.

Like

Rated 5 out of 5 stars.

Excellent 👌👌

Like
bottom of page