top of page
Original.png

ఎవడు చూడమన్నాడు?

18 hours ago
2 min read

“ఎవడు చూడమన్నాడు?” తెలుగు సోషల్ మీడియా వ్యంగ్య రచనకు సంబంధించిన చిత్రం. తనకు పట్టనట్లు చేతితో సంకేతం చేస్తున్నప్పటికీ, మరొకరి ప్రయాణం, కొనుగోలు, సంతోషం, విజయానికి సంబంధించిన సోషల్ మీడియా స్టోరీలను ఆసక్తిగా చూస్తున్న వ్యక్తి కనిపిస్తాడు. పక్కనే అతను చూసిన విషయాలను మరొకరితో గాసిప్ చేస్తున్న దృశ్యం, అద్దంలో అతని అసూయతో కూడిన ముఖం కనిపిస్తూ నచ్చకపోతే విమర్శించకుండా స్కిప్ చేయవచ్చనే భావాన్ని ప్రతిబింబిస్తుంది.

Evadu Chudamannadu Telugu Inspirational Article | Kotha Viritha

ఎవడు చూడమన్నాడు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 15/09/2026


ఎవరో సోషల్ మీడియాలో స్టేటస్ లేదా స్టోరీ పెట్టారు—మనల్ని ప్రత్యేకంగా చూడమని పిలవలేదు. అయినా చూస్తాం; నచ్చకపోతే మళ్లీ చూసి, తర్వాత విమర్శలు కూడా మొదలుపెడతాం! 



మనుషులకు ఉన్న గొప్ప టాలెంట్ ఏంటో తెలుసా?

తమకు సంబంధం లేని విషయాల్లో అనవసరంగా వేలు పెట్టి కేలుకోవటం. ఎవరో ఒకరు స్టేటస్ లో స్టోరీ పెట్టారు. వాళ్ళేమో

చూడమని పిలవలేదు. 


కానీ చూస్తారు. వీడియో పెట్టారు. వాళ్ల కోసం ప్రత్యేకంగా తీయలేదు. కానీ మూడు సార్లు మొఖం ముడుచుకొని చూస్తారు, చూసిన తర్వాత మొదలవుతుంది అసలు కార్యక్రమం…


“అబ్బా! ఎంత చూపిస్తున్నారు! ”


“వీళ్లకి ఇంత సీన్ అవసరమా?”


“ఎక్కడికి వెళ్లారో చూశావా?”


“ఏం కొన్నారో చూశావా?”


“ఎవరితో ఉన్నారో చూశావా?”


మీకు నచ్చకపోతే చూడకండి కదా! వాళ్ల జీవితం మీకు నచ్చేలా నడపాల్సిన అవసరం వాళ్లకు లేదు. ఎవరో సంతోషంగా ఉన్నారని చూసి మీకు అసూయ వస్తే, అది వాళ్ల సమస్య కాదు…మీ మనసులో ఉన్న కొరతకు వచ్చిన నోటిఫికేషన్. 


ఎవరో ప్రయాణం చేస్తే “షో ఆఫ్. ”


ఎవరో కొత్తది కొంటే “అవసరమా?”


ఎవరో సంతోషంగా ఉంటే

“నటన. ”


ఎవరో ఎదిగితే

“అదృష్టం. ”


మరీ ముఖ్యంగా…

స్టోరీ చూసి గోస్సిప్స్ చేయడం, ఫోటో చూసి తీర్పు చెప్పడం, వీడియో చూసి అసూయ పడటం…ఇవన్నీ చేసి చివరికి “నాకు వాళ్లంటే అసలు పట్టదు, నాకు అవసరం లేదు” అంటారు. 


అవును, పట్టదు... పాపం అందుకే కదా వాళ్ల స్టోరీకి నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారీ ముందుగా మీరే చూస్తారు! నిజానికి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికీ ఒక చిన్న సలహా అవసరం, చూడాలనిపిస్తే చూడండి. నచ్చితే మెచ్చుకోండి. నచ్చకపోతే స్కిప్ చేయండి. 


అసూయ వస్తే మీ మనసు లోనే చూసుకోండి. 


ఎందుకంటే…వాళ్లు స్టోరీ పెట్టింది తమ జీవితం గురించి మీరు రివ్యూ రాయమని కాదు! చివరగా ఒక్కటే ప్రశ్న, అంత నొప్పిగా ఉంటే అసలు


“ఎవడు చూడమన్నాడు?”

***

కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Sagar Kandukuri
Sagar Kandukuri
14 hours ago
Rated 5 out of 5 stars.

excellent

Like

Rated 5 out of 5 stars.

Super excellent write up

Like
bottom of page