top of page
Original.png

హోమ్ టూర్


హోమ్ టూర్ కథలో ఇంటి సామాన్లన్నీ పోయి నేలపై కూర్చున్న షాక్‌లో ఉన్న సతీష్, పక్కన అమాయకంగా నిల్చున్న భార్య సీత.

Home Tour - Telugu Comedy Family Story | Harish Babu Pondugula

హోమ్ టూర్ తెలుగు హాస్య కుటుంబ కథ | హరీష్ బాబు పొందుగుల

Published in manatelugukathalu.com on 07/09/2026


హోమ్ టూర్ ఒక సరదా తెలుగు హాస్య కుటుంబ కథ. గవర్నమెంట్ ఉద్యోగం చేసే సతీష్, నెలలో సగం రోజులు టూర్స్‌కి వెళ్తుంటాడు. అలాంటి ఒక టూర్‌ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన అతనికి, తన ఇంట్లోని ఖరీదైన సామాన్లన్నీ మాయమైనట్టు కనిపిస్తుంది. అసలు అవన్నీ ఏమయ్యాయి? భార్య సీత చేసిన హోమ్ టూర్ వీడియో వెనుక ఉన్న రహస్యం ఏమిటి?


చదివింది బీటెక్ అయినా గవర్నమెంట్ జాబ్ వచ్చినందుకు చాలా సంతోషించాడు సతీష్.


గవర్నమెంట్ జాబ్ కానీ నెలలో పదిహేను రోజులు టూర్స్ వెళ్ళాల్సి వచ్చేది.

అలాగే ఒకసారి బెంగళూరు వెళ్ళి పదిహేను రోజుల తర్వాత బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు.


కాలింగ్ బెల్ రింగ్ అవడంతో డోర్ తీసి దిష్టిబొమ్మలా నుంచుంది భార్య సీత.

“ఏంటి సీతామహాలక్ష్మి... లోపలికి రానివ్వవా ఏంటి అడ్డంగా నుంచుని ఉన్నావు?” అంటూ చిరాగ్గా భార్యని తప్పుకోమని లోపలికి నడిచాడు సతీష్.


అలిసిపోయిన సతీష్ అటు ఇటు చూడకుండా లగేజ్ బ్యాగ్ ఆమె చేతికి ఇచ్చి, డైరెక్టుగా బాత్రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాల్‌లోకి వచ్చాడు.

ఇంటిని చూసి దిమ్మ తిరిగింది. ఇది మా ఇల్లా కాదా అన్నట్టు చూస్తూ ఉండిపోయాడు... లోపలికి వచ్చినప్పుడు గమనించలేదు ఇల్లంతా బోసిగా ఉంది ఏదో ఇంట్లో సామానంతా అమ్మి ఇల్లు ఖాళీ చేస్తున్నట్టుగా.


“ఏంటి సీతా... ఇంట్లో సామానంతా ఏమైంది?” అడిగాడు సతీష్.


“ఇన్కమ్ టాక్స్ వాళ్ళు వచ్చి రైడ్ చేసి మొత్తం పట్టుకెళ్ళారండి.”


“ఏంటే నువ్ చెప్పేది... ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ఎందుకు వచ్చారు?”


“అది... అది...” అని నసుగుతున్న భార్యను...

“త్వరగా చెప్పవే హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది....” అన్నాడు సతీష్.


“ఏం లేదండి మీరు వెళ్ళాక నాకు టైమ్ పాస్ కాక కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్‌లో...

అందులో ‘హోమ్ టూర్’ అని ఒక వీడియో పెట్టి మన ఇంట్లో ఉన్న ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. అది చాలా వైరల్ అయింది....


కానీ రెండు రోజుల్లోనే ఐటీ వాళ్ళు రైడ్ చేశారు... వాళ్ళు ఉన్న వస్తువులన్నీ వాల్యుయేషన్ చేసి...


మీ భర్త శాలరీతో కంపేర్ చేస్తే... ఇవి చాలా ఎక్కువ, వాటికి బిల్స్ చూపించి మళ్ళీ తీసుకెళ్ళండి అని పట్టుకెళ్ళిపోయారండి” అని చెప్పింది.


దానికి కంగుతిన్న సతీష్—

“నీకు మైండ్ ఏమయినా పోయిందా... నీకేమన్న బుద్ధి ఉందా... హోమ్ టూర్ చేయడానికి మన ఇంట్లో ఏ వస్తువు అయినా వైట్ మనీతో కొన్న వస్తువులను అనుకున్నావా...


ఇవన్నీ బ్లాక్ మనీ. ఎక్కడ పెట్టాలో అర్థం కాక... ఈ ఖరీదైన ఐటమ్స్ కొని పెట్టాను. నీ మైండ్ కి అది కూడా తెలియదు అనమాట. నా కర్మ... మొత్తానికి 4 రోజుల్లో నా సంపద మొత్తం మట్టిలో కలిపేశావ్ కదే” అంటూ తల బాదుకున్నాడు సతీష్. సోఫా లేదు కదా నేల మీదే కులబడ్డాడు.


“అదేంటండి మీరు ఎపుడు అడిగినా... నా సంపాదన నా సంపాదన అనేవారు కదా...” అంటూ బుగ్గన వేలు వేసుకొని కళ్ళు మీటకరిస్తూ అడుగుతున్న భార్య వైపు బాధగా చూసాడు సతీషు.


-- సమాప్తం --


***

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:




హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



హరీష్ బాబు పొందుగుల

పరిచయం: హరీష్ బాబు పొందుగుల


ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు.   వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష . 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page