హనీమూన్ హారర్
- Munipalle Vasundhara Rani

- 8 hours ago
- 3 min read
హనీమూన్ హారర్, తెలుగు హాస్యకథ, హనీమూన్ కథ, కామెడీ కథ, తెలుగు కుటుంబ హాస్యం, కొత్త జంట కథ, తెలుగు వినోద కథ, కుటుంబ కామెడీ, నవ్వుల కథ, తెలుగు కథలు, మన తెలుగు కథలు, Funny Telugu Story, Honeymoon Comedy Story

Honeymoon Horror - Telugu Comedy Story | Vasundhara Rani Munipalle
హనీమూన్ హారర్ - తెలుగు హాస్యకథ | వసుంధర రాణి మునిపల్లె
Published in manatelugukathalu.com on 04/07/2026
"హనీమూన్ హారర్" అనేది కొత్తగా పెళ్లైన జంట జీవితంలో జరిగే అపార్థాలను హాస్యరసంతో మేళవించిన అద్భుతమైన తెలుగు హాస్యకథ. హనీమూన్ అంటే ప్రేమ, ప్రైవసీ అనుకునే సమయంలో, ఇద్దరి కుటుంబాలు కూడా వెంట రావడంతో ఏర్పడే వినోదభరిత పరిస్థితులు, అతిగా జాగ్రత్తపడే తల్లిదండ్రులు, బామ్మ చెప్పిన హెచ్చరికలు, అనుమానాలతో నిండిన సంఘటనలు పాఠకుడిని కడుపుబ్బా నవ్విస్తాయి. కుటుంబ అనుబంధాలను సరదాగా చూపించే ఈ కామెడీ తెలుగు కథ చివరి వరకు ఆసక్తిని నిలబెడుతుంది.
రవి, రాణి పెళ్లి జరిగి వారం కూడా కాలేదు. కానీ, హనీమూన్‌కి వెళ్లాలంటేనే ఇద్దరికీ వెన్నులో వణుకు.
పక్కింటి బామ్మ, "మా కాలంలో కాశీకి వెళ్ళి తిరిగి వస్తే ఎంతో అదృష్టవంతులు అనేవారు! ఇప్పుడు ఈ హనీమూన్ నుంచి సజీవంగా తిరిగి రావడం అంటేనే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి!" అని కీళ్లు విరిచి హెచ్చరించడంతో, ఆ అదృష్టం తమకు దక్కాలని ప్రాణాలు కాపాడుకోవడానికి పదిమంది ఫ్యామిలీ మెంబర్స్‌ని వెంటబెట్టుకుని రిసార్ట్‌కి బయలుదేరారు.
రిసార్ట్‌లో ఆ రాత్రి సీన్ ఒక "మర్డర్ మిస్టరీ" సినిమాను తలపించింది. రవి, రాణి ఇద్దరూ కళ్లు ఆర్పకుండా ఒకరినొకరు గమనించుకుంటున్నారు.
రవి మెల్లగా రాణి వైపు తిరిగి, "మనం హనీమూన్ నుంచి వచ్చాక కూడా మా అమ్మ నాన్నను మనతోనే ఉంచుకుందాం. నేను ఒక్కడినే కదా వాళ్లకు!" అని అడిగాడు.
రాణి వెంటనే, "అవును రవి, అలాగే చేద్దాం. మా అమ్మ నాన్నను కూడా మనతోనే ఉంచుకుందాం. నేను ఒక్కదాన్నే కదా వాళ్లకు! ఎవరి సేఫ్టీ వాళ్లు చూసుకోవాలి కదా!" అంది.
ఒక రాత్రి రవికి దాహం వేసి, పాలు తాగుదామని అనుమానంగానే గ్లాసు అందుకున్నాడు. సరిగ్గా అప్పుడే నిద్రలో ఉన్న మామగారు గట్టిగా, "ఏంట్రా.. అవి తాగి చావాలనుకుంటున్నావా!" అని కలవరించారు.
ఆ అరుపుకి రవి ఉలిక్కిపడి గ్లాసుని చేతిలోంచి జారవిడవడంతో అది 'భళ్లన' పగిలింది. ఆ శబ్దానికి అందరూ లేచారు.
రవి వాళ్ల నాన్న కోపంగా, "ఏంట్రా కోంపదీసి ఆ పాలు గానీ తాగేశావా ఏంటి ఖర్మ! ఇప్పుడు ఎలా ఉందిరా? ఆ అమ్మాయే ఇచ్చిందా ఆ గ్లాసు? నడువు, తొందరగా హాస్పిటల్ కి వెళ్దాం!" అని కంగారుపడ్డారు.
రవి, "లేదు నాన్న, ఇంకా తాగలేదు.. చేయి జారి పడిపోయింది!" అని బతిమాలాడు.
రవి వాళ్ల అమ్మ, "అమ్మో! లేచిన వేళా విశేషం బాగుంది.. లేకపోతే తాగితే ఏమయ్యేదో!" అంటూ రాగాలు తీసింది.
రాణి కోపంగా, "ఆ గ్లాసు నేను ఇవ్వలేదు.. రిసార్ట్ వాడు ఇచ్చాడు!" అని అరిచింది.
అప్పుడు రాణి వాళ్ల అమ్మ ముక్కు ఎగబీల్చుకుంటూ, "అయినా ఇంతకుముందు మీ అబ్బాయి బయటకు వెళ్లి ఏదో స్వీట్ తెచ్చి నా కూతుర్ని తినమన్నాడు. సమయానికి నేను ఉండి, రాణి చేతిలోంచి లాగి అవతలకు పారేశాను!" అని బాంబు పేల్చింది.
రవి వాళ్ల నాన్న నిట్టూర్చి, "సరేలే మీ గొడవ మీరూను.. నడవండి, మనం బయటకు వెళ్దాం. వీళ్లకి అస్సలు ప్రైవసీ లేకుండా చేస్తున్నాం!" అంటూ లేవబోయారు.
అంతే! రవి వెంటనే, "నాన్నగారు, మీరెవరూ ఎక్కడికి వెళ్లొద్దు! అందరం ఒక్కచోటే ఉందాం!" అని కంగారుగా అన్నాడు.
రాణి కూడా, "అమ్మ, నువ్వు, తమ్ముడు, నాన్న.. నన్ను వదిలి ఎక్కడికి వెళ్లొద్దు ప్లీజ్!" అని బతిమాలింది.
నిజానికి, ఈ రోజుల్లో తల్లితండ్రిని పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు, కానీ వీళ్లు మాత్రం అమ్మానాన్నలు పక్కనే ఉంటే తమ తమ సంతానాన్ని ప్రాణాపాయం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు కాబట్టి, తమకు దక్కిన ఈ వింత భద్రతను చూసి సంబరపడ్డారు.
హనీమూన్ అంటే రొమాన్స్ కాదు, ఇది ఒక 'ఫ్యామిలీ సేఫ్టీ డ్రామా' అని, బామ్మ చెప్పినట్టు హనీమూన్ నుంచి సజీవంగా తిరిగి రావడం అంటేనే ఒక పెద్ద పుణ్యం చేసుకుని ఉండాలని వారు అప్పటికి తెలుసుకున్నారు.
తెల్లవారగానే, ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డామన్న తృప్తితో, హనీమూన్ అనే 'సస్పెన్స్ థ్రిల్లర్'ను ముగించుకుని, బామ్మ చెప్పిన అదృష్టాన్ని తమ సొంతం చేసుకున్నామని గర్వంగా ఇంటికి తిరుగుప్రయాణమయ్యారు.
***
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.







Comments