top of page
Original.png

ఇక్కడ క్యాన్సర్ అమ్మబడును

ఇక్కడ క్యాన్సర్ అమ్మబడును, కర్లపాలెం హనుమంతరావు, తెలుగు కథ, సామాజిక కథ, క్యాన్సర్, చిన్నారి, ఆసుపత్రి, మానవత్వం, భావోద్వేగ కథ

ఇంటి ముందు "ఇక్కడ క్యాన్సర్ అమ్మబడును" అనే బోర్డు,
ఇంటి ముందు "ఇక్కడ క్యాన్సర్ అమ్మబడును" అనే బోర్డు,

Ikkada Cancer Ammabadunu - Telugu Emotional Story | Karlapalem Hanumantha Rao

ఇక్కడ క్యాన్సర్ అమ్మబడును - తెలుగు భావోద్వేగ కథ | కర్లపాలెం హనుమంతరావు

Published In manatelugukathalu.com On 15/07/2026


పెచ్చులూడి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న పెంకుటిల్లు.


ఇంటి తలుపు మీద వంకర టింకర అక్షరాలతో కనిపించింది ఓ చిన్న బోర్డు.. 


"ఇక్కడ క్యాన్సర్ అమ్మబడును"


ఆ బోర్డు కథ ఏంటో తెలుసుకుందామనిపించింది.


ఇంటి తలుపు తట్టాను.


తలుపు ఓరగా తెరుచుకుంది. పెద్ద పెద్ద కళ్లతో ఒక చిన్న పాప నన్ను చూసి ముద్దుగా అంది ,"అమ్మ, ఇంట్లో లేదు"


"బయట ఆ బోర్డు నువ్వే రాశావా పాపా?", అడిగాను.


తలూపింది అవునన్నట్లు.


"క్యాన్సర్ అమ్మడం ఏంటి? "


"నిజంగానే అమ్ముతా అంకుల్! మీకు కావాలా?" అంది అరిందాలా.


వింతగా అనిపించినా, విషయం ఏంటో తేల్చుకోవాలనిపించింది. 


 "కావాలమ్మా" అన్నాను.


ఈసారి తలుపు పూర్తిగా తెరిచి నన్ను లోపలికి రానిచ్చింది పాప .


"కూర్చోండి, ఇప్పుడే వస్తా" అని ఓ మురికి సోఫా చూపించి తను లోపలికి వెళ్ళింది.


పాప నడకలో ఏదో తేడా ఉంది! గోడపై ఉన్న ఫోటోలో మాత్రం ఆ పాప నిండు ఆరోగ్యతో  కళకళలాడుతుంది.


"అంకుల్, జాగ్రత్త! పడిపోకుండా  పట్టుకోండి!"


తల తిప్పి అటు చూసేలోపే ఒక గాజు కడ్డీని నా వైపు విసిరేసింది ఆ పాప .


ఆకుపచ్చ రంగులో తళతళా మెరుస్తోంది ఆ కడ్డీ! 


క్రికెట్ బాల్ ‌లా వడుపుగా పట్టుకున్నాను.


అంతే! ఒంట్లోకి వేల వోల్టుల విద్యుత్ తరంగాలు ప్రవహిస్తున్నట్లు..

వంటి నిండా నిప్పు సెగలు రేగుతున్నట్లు ...

శరీర భాగాలు కరిగి లావాలా పారుతున్నట్లు....


ఆ బాధ భరించలేక గావు కేక పెట్టడం ఒక్కటే తెలుసు నాకాక్షణంలో.


తిరిగి కళ్ళు తెరిపిడి పడేసరికి నేను అదే చింకి సోఫాలో పడున్నట్లు అర్థమయింది.


పక్కనే ఒక నడివయసు ఆవిడ ఆందోళనగా నా మొహం వంకే చూస్తూ నిలబడి ఉంది .


పాప తెచ్చిన మంచి నీళ్ళు అందిస్తూ "ఇప్పుడు నిమ్మళంగా ఉందా సార్? “ అని అడిగిందామె  ఆదుర్దాగా.


"నాకేమైందసలు? గ్రీన్ కలర్లో మెరిసే ఆ ట్యూబేంటి ? పాప ఎందుకలా విసిరేసింది నా మీద? " అన్నీ ప్రశ్నలే! 


అయోమయంగా ఉన్న   నా మొహం చూసి కాబోలు, అడక్కుండానే ఆవిడ సర్వం చెప్పు కొచ్చింది. 

 

"రేడియో థర్మల్ క్యాండిల్ సార్ అది.. రేడియేషన్ కి ఉపయోగిస్తారు.. మీకు తెల్సనుకుంటా" అందామె కన్నీళ్ళతో.


ఆమె మొహంలో అపరాధ భావన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 


"సారీ సార్! తెలీక చేసింది పాప.. క్షమించండి! తనకు క్యాన్సర్ .. సెకండ్ స్టేజ్ లో ఉంది. వారానికోసారి  కీమోథెరపీ చేయిస్తున్నా . ఆసుపత్రిలో వాడే ఆ క్యాండిల్ అంటే దీనికి చచ్చే భయం.  ట్యూబ్ వల్లే తనకు క్యాన్సరొచ్చిందని పిచ్చి కోపం. ఎంత నచ్చజెప్పినా వినడం లేదు మొండిది! ఆసుపత్రి నుంచి క్యాండిల్ మాయం చేస్తే క్యాన్సర్ ఇక రాకుండా పోతుందని స్కూల్లో ఎవరో కూశార్ట . అప్పట్నుంచీ మొదలైంది దీని  తిక్క చేష్టలు"


అంత ప్రమాదకరమైన వస్తువు ఈ పాపకెలా దొరికింది అసలు? 


అదే అడిగితే ఆ పిల్ల తల్లి చెప్పిన సమాధాన,  ఇవాళా రేపూ ఆసుపత్రుల్లో జరిగే ఘనకార్యాలకు  నిదర్శనంగా ఉంది.


వాడేసిన తరువాత డెస్ట్రాయ్ చెయ్యాల్సిన థర్మల్  ట్యూబుల్లో ఏవి ఎక్కడికి పోతున్నాయో పట్టించుకునే నాథుడు లేడట అక్కడ!


"డబ్బుకి కక్కుర్తి పడి ఏ దరిద్రుడో దీనికి  అంటగట్టాడీ దరిద్రాన్ని  . ఇదేమో పాకెట్ మనీ పోసి కొని కొంపకు  తెచ్చింది. .నాకూ తెలీదు ఈ సంగతులన్నీ నిన్నటి దాకా . తెలిస్తే ఇదంతా జరగనిచ్చే దాన్నా సార్?" 


సంజాయిషీ ఇస్తున్న ఆమె మొహం చూస్తే చాలా బాధేసింది. 


అంతకన్నా ఎక్కువగా పసిపాపను చూసి!


క్యాన్సర్ పోవాలని రేడియో థర్మల్ క్యాండిల్‌ను డబ్బులు పోసి కొనడమే కాదు.. ఖర్చయిన సొమ్మును తిరిగి రాబట్టుకోవాలని ఇదంతా చెయ్యడం! 


ఇవాళో రేపో కూలడానికి సిద్ధంగా ఉన్న ఆ కొంపను చూస్తేనే తెలుస్తుంది.  .. తండ్రి లేని ఈ పసిదానికి అలాంటి పెచ్చి ఆలోచన ఎందుకొచ్చిందో!

***


***

సమాప్తం. 


కర్లపాలెం హనుమంతరావు గారి కొన్ని ఇతర రచనలు:



కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కర్లపాలెం హనుమంతరావు
కర్లపాలెం హనుమంతరావు

రచయిత పరిచయం:

కర్లపాలెం హనుమంతరావు -పరిచయం


రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.

#KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #తెలుగునీతికథలు, #మురికి, #Muriki, Inspirational Telugu Stories, Life Lessons Telugu, Social Stories Telugu, Emotional Stories Telugu, Humanity Stories, Telugu Kathalu, Heart Touching Stories, Railway Story Telugu

 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page