top of page
Original.png

ఇంద్రలోక వైభవం - పార్ట్ 2

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #ఇంద్రలోకవైభవం, #IndralokaVaibhavam, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Indraloka Vaibhavam - Part 2/3 - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 23/12/2025

ఇంద్రలోక వైభవం - పార్ట్ 2/3పెద్ద కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

జరిగిన కథ: అది శిథిలావస్థలో ఉన్న ఒక నేత కార్మికుల గ్రామం.

తన నాన్నమ్మను తీసుకెళ్లడానికి ఆ గ్రామం వచ్చిన పార్థసారథి అక్కడి నేత కార్మికుల కష్టాలు చూసి చలించిపోతాడు.


ఇక ఇంద్రలోక వైభవం పెద్దకథ రెండవ భాగం చదవండి.


అలా ఆ ముందు రోజు ఉదయం బెంగళూరులో తన ఇంట్లో భార్యతో వాదన. అలా గుర్తుకు వచ్చిన ఆ సంఘటన నుండి తన చిన్ననాటి పల్లెటూరులో గానుగచెట్టు కింద కూర్చున్న పార్థసారథి బయటపడ్డాడు తన పాతమిత్రుల పిలుపుతో. 


''సారథిగారు. ''


'' ఒరేయ్.. సారథిగారు.. అని కాదు సారథి అని నన్ను పిలవండిరా మీరు. ఇలా నా చుట్టూ కూర్చోండి. మీరంతా ఏం చేస్తున్నారు. వీడు అనంతగాడు కదూ.. ఇలా రూపం మారిపోయింది. ''


'''ఆడి రూపం ఏం మారలేదు మామూలు మనుషుల్లా అడుక్కుంటుంటే డబ్బులు ఇవ్వరని మేమందరం కలిసి వీడి మీసం తీసేసి మగాఆడ కానట్టు తయారుచేసాం. ఈ వేషంతో వీడు రోజు బాగా సంపాదిస్తాడు. మన చేనేత బట్టలు నేసే వాళ్ళందరి కన్నా ఇప్పుడు వీడి బతుకేనయం. 

ఆడిమూలానే ఒక్కొక్కసారి మేమందరం గంజి తాగు తున్నాం''


''సరే కానీ మీరందరూ మన పాత వృత్తిని.. అదే బట్టలు నేయడం మళ్ళీ మొదలు పెట్టగలరా. ''


''వద్దు సారథి.. మమ్మల్ని అందరినీ మళ్లీ ఆ బురద గుంటలోకి లాగొద్దు.. '''


''ఏం కాదు. మీ జీవితాలు తప్పుడు గాడిలో పడ్డాయి. మన నేత వృత్తి అతి ప్రాచీనమైన పవిత్రమైన వృత్తి. చరిత్ర లో ఒక విషయం చెబుతా వినండి. 


ఒకసారి అక్బర్ తన కొలువులో ఆశీనుడై ''అన్ని పుష్పాల లోకి ఉత్తమమైన పుష్పం ఏది. '' అని ప్రశ్నించాడట. అందరూ ఎవరికి తోచిన రకాల పుష్పాల పేర్లు వారు చెబుతుండగా బీర్బల్ సభలోకి ప్రవేశించి.. ''రాజా, అతి ఉత్తమ మైన పుష్పం పత్తిపుష్పం. '' అని చెప్పాడట. 


''సువాసన లేని పత్తిపుష్పం ఎందుకు ఉత్తమమైనది. '' అని రాజు అడగగా "మానవాళి మానాన్ని రక్షిస్తుంది కనుక".. అని సభికుల హర్షద్వారాల మధ్య చెప్పాడట బీర్బల్. 


ఇది చరిత్ర. అంటే 600 సంవత్సరాలకు పూర్వమే నేతవస్త్రం ఆవిర్భ వించిందని దీన్ని బట్టి చెప్పవచ్చు. అలాంటి అతి ప్రాచీన మైన పవిత్ర మైన చేనేతవృత్తిని ఎలా వదులుకోవాలి. 


అలాంటి వృత్తి మీ కంటికి పీక్కుతినే కొరిమిదెయ్యం లా కనిపిస్తుందిప్పుడు. ముందు ఆ భావం మీలో పోవాలి. అది సరే.. మా నానమ్మ నుదుటన మచ్చ ఏమిటి. ''


''సారథి.. ఆ విషయం మాకందరికన్నా నీకే గుర్తుండాలి. ''


''గుర్తులేదు.. గుర్తు చేయండిరా''


''నువ్వు పదవ తరగతి పరీక్ష రాయడానికి మూలకారణం రా మీ నానమ్మ. నీ ఇప్పటి ఈ హోదాకి పునాది తొలి మెట్టు ఆవిడే. ఆ రోజుల్లో 35 రూపాయలు పరీక్ష రాయ డానికి ఫీజు లేక చదువు మానేశావు నువ్వు. ఇదే గట్టుమీద కూర్చుని ఏడుస్తుంటే నీ దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పింది మీ నాన్నమ్మ. పాగళ్లను అల్లుపట్టి మగ్గం పైకి చేర్చే పనిలో వేరే వాళ్ళ దగ్గర కుదిరి రెండు రోజులు కష్టపడి సంపాదించిన 35 రూపాయలు నీకు ఇవ్వాలని పరుగున ఆనందంతో ఇంటికి వస్తుంటే అదిగో ఆ రాములోరి గుడి దగ్గర నీరసం తో కళ్ళు తిరిగి పెద్ద బండరాయి మీద పడిపోయిందిరా. 


అయినా ఆమె బాధ పడలేదు. వెంటనే లేచి తలకి నూలు గుడ్డముక్క కట్టు కట్టుకుని ఇంటికి వచ్చి ఆ డబ్బులు ఎవ రికీ తెలియకుండా నీకే ఇచ్చింది కదా. ఆ తర్వాతే నువ్వు పదవ తరగతి పరీక్షలు రాయడానికి అవకాశం కలిగింది. పరీక్షలు అయిన తర్వాత మరో పది రోజులకే మీ నాన్న, అమ్మతో సహా నువ్వు అప్పుల వాళ్లకు భయపడి ఈ ఊరు నుండి పారిపోవడం.. మళ్లీ ఇదిగో పుష్కరంన్నరకి ఇప్పుడు రావడం. ఇదంతా మర్చిపోయావట్రా. '' వివరంగా గతం వివరించాడు అందరిలో బాగా మాట్లాడగలిగిన వెంకటేశు. 


''అంటే.. ఇన్ని సంవత్సరాలైనా నా మూలంగా నానమ్మకు తగిలిన గాయం.. ''


''తగ్గుతుంది పెరుగుతుంది తీపి జ్ఞాపకంలా పచ్చిగానే అలా మిగిలిపోయి ఇంకా తగ్గలేదురా. అయినా ఏనాడైనా మందులేసుకుంటే కదా తగ్గడానికి. '' అందరూ బాధగా చెప్పారు. 


అంతే.. మిత్రులందరూ చెప్పింది విని అప్పటికే వృద్ధురాలైన తన నానమ్మ తన ఉన్నతి కోసం చేసిన త్యాగానికి చలించిపోయాడు పార్థసారథి. 


వెంటనే పరుగు పరుగున చెట్టు కింద నానమ్మ పడుకున్న పందిరి కిందకు వెళ్లి.. నానమ్మ కాళ్లకు నమస్కరించి బయటకు వచ్చి సెల్ తీశాడు. 


''హలో లలిత. ''


''మాట్లాడేది నేనేనండి. నానమ్మను తీసుకొచ్చేద్దామని వెళ్లారు కదా. ఎప్పుడొస్తున్నారు. ''


''ఆ విషయం చెబుదామనే ఫోన్ చేశాను నేను రావటం లేదు నానమ్మను కూడా తీసుకురావడం లేదు. ''


''అంటే.. ''


''నా మనసు మార్చుకున్నాను. చెప్తాను గాని నాన్నగారు ఎలా ఉన్నారు అక్కడ. ''


''మతిస్థిమితం తప్పిన వ్యక్తి కదా. ఎలా ఉంటారు.. ఇప్పటి వరకు వీధులు అన్ని తిరిగి నానా గత్తర చేసి ఇప్పుడే ఇంటికి వచ్చారులెండి.. ''


''నిజమే నువ్వన్నట్టు మతిస్థిమితం తప్పిన వ్యక్తి కదా. 

సరే లలిత నాకో మాట ఇవ్వగలవా. ''


''నేనేమి ఇవ్వగలను. అడగండి.. ''


''నా పల్లెటూరులో నా వాళ్ళ కోసం నేను నా జీవితంలో కొంత భాగం త్యాగం చేయాలనుకుంటున్నాను. ''


''మీ జీవితం నీ ఇష్టం. నన్ను అడగడం దేనికండి. ''


''అయినా నీ అనుమతి కావాలి. ఇప్పుడు నువ్వు నా జీవిత భాగస్వామివి కదా. విను లలిత.. మనం ఇప్పటి వరకు సంపాదించిన రెండుకోట్లతో ఒక మంచి బిల్డింగు, 

ప్లాట్లు, షేర్లు, బంగారాలు, బ్యాంకు బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఆడబ్బు మానవ జీవితం అనుభవించలేకపోతున్న చేనేత పని వాళ్ళ కోసం నా పల్లెటూరులో వాళ్ళ బాగు కోసం ఖర్చు పెడదాం అనుకుంటున్నాను. ఏ ఆ పని మీరే చేయాలా ఇంకెవరూ లేరా అని నువ్వు అడగొచ్చు.. 


ఇప్పుడు నీకు కొంచెం ప్రసంగం ఇవ్వక తప్పదు.. బిల్ గేట్ తెలుసు కదా అతని అస్తి లక్ష 25 వేల కోట్లలో 75% ట్రస్టులకు దానం చేశాడు. ఆయన గురువు బఫెట్ తన ఆస్తి లక్ష 85 వేల కోట్లలో 85% ట్రస్టులకు దానం చేశాడు.. ఇక సినీ నటుడు జాకీచాన్ తనకున్న ఆస్తిలో 50% దానాలు చేశాడు. ఏ వాళ్లే ఎందుకు అలాచేయాలి ఇప్పుడు చెప్పు.. ఎందుకంటే వాళ్లు దైవాంశ సంభూతులు కనుక. తమ కోసం కాకుండా జగత్ కళ్యాణం కోసం ఆలోచించే మహాను భావులు. 


నేను అంతటి వాడిని కాదు కానీ ఉడతా భక్తిగా నా మానవ ధర్మం కోసం నే నీ నిర్ణయం తీసుకున్నాను లలితా.. మనం ఐదు కోట్లు 10 కోట్లు ఎంతైనా సంపాదించగలము. కానీ నేను ఎన్ని కోటానుకోట్లు సంపాదించిన తినేది ఆ పిడికెడు మెతుకులే కదా. జీవితానికి సార్ధకత ఏర్పడాలంటే సంపా దన సక్రమంగా వినియోగించాలి. మన బాగు కొన్నేళ్లు వాయిదా వేస్తే ఇక్కడ చాలా కుటుంబాలు ఉరి వేసుకునే కార్యక్రమాన్ని మరిచిపోతాయి. 


నేను ఉద్యోగం వదులుకొని కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండి వీళ్ళకు ధైర్యం ఇస్తూ వాళ్లతోపాటు నా కులవృత్తి అయిన చేనేత బట్టలు నేస్తూ వాళ్ళకు కోట్లాది రూపాయల విలువైన మనోనిబ్బరం వచ్చేవరకు ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను. అప్పుడు కానీ వృత్తిరుణం, మా నానమ్మ.. ప్రజల రుణం తీర్చుకున్న వాడిని కాను. నువ్వు బాగా ఆలోచించుకో. కొన్నాళ్లు పాటు బిడ్డలతో మీ ఇంటికి వెళ్లిపోతావో.. మా నాన్నతో బయలుదేరి ఇక్కడ నాకు సహాయకురాలిగా వస్తావో అంతా నీ ఇష్టం. ఏ పని చేయ డానికయినా నీకు మాత్రం డబ్బుకు కొదవ ఉండదు. '' నిబ్బరంగా అన్నాడు.. పార్థ సారథి. 


జవాబు కోసం ఎదురు చూడకుండా స్విచ్ ఆఫ్ చేశాడు 


**

 

ఆరు నెలలుగా పార్థసారథి ఆ పల్లె ప్రజల జీవనవిధానం అభివృద్ధికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. వాళ్లల్లో ఉండే అనారోగ్యాలు తగ్గేలా ముందుగా అందరికీ వైద్యం చేయిం చాడు. తరచుగా వాళ్లు గురయ్యే శ్వాసకోశ వ్యాధులు, కంటి జబ్బులు, ఫైలేరియాకు స్పెషలిస్టుల పర్యవేక్షణలో వైద్యం చేయించాడు. వడ్డీ వ్యాపారస్తులకు వాళ్లు ఇవ్వ వలసిన డబ్బులు మొత్తం చెల్లించి 80 కుటుంబాల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధతో ఆ పరిసరాలు, ప్రదేశాలు శుభ్రపరపింపచేశాడు. వాళ్లని సొంత ఇళ్లల్లో పెట్టాడు. ప్రతిరోజు ఆ ఇళ్ళు శుద్ధమైన కల్లాపి జల్లులతో రంగురంగుల ముగ్గు లతో పచ్చని మామిడిఆకు తోరణాలతో కళకళలాడేటట్లు చేశాడు. వాళ్లలో మానసిక ఆనందం కలగడానికి రకరకాల ఆటలు ఆడిస్తూ యోగసాధన, వ్యాయామం లాంటి అనేక రకాలైన మానవప్రయత్నాలు వాళ్లకు అలవాటు చేశాడు. ఆ పల్లెలో పిల్లలకు పెద్దలకు విడిగా బడి పెట్టించి.. గ్రంథాలయం, హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయించాడు. 


చీకట్లో కూడా కష్టపడి ఆహారం సంపాదించుకునే పిల్లులను మూకుమ్మడి ఐకమత్యానికి ప్రతీకలైన చీమలను, విశ్వాస పాత్ర జీవనవిధానం కలిగిన కుక్కల్ని మనిషి ఆదర్శంగా తీసుకోవాలని వాళ్ళందరికీ బోధించేవాడు. రాత్రి పాఠశాలల్లో వాళ్ళందర్నీ అక్షరాస్యులను చేశాడు. 


వాళ్ల వృత్తికి సంబంధించిన మగ్గాలు వగైరా పనిముట్లు బాగు చేయించి కొత్తవి కొనిపించి ఒక శుభ ముహూర్తాన ఆరువీధుల కూడలిలో.. దూరంగా రామాలయంలో సీతా రాముల విగ్రహాల ముందు బాజాభజంత్రీలు మోగుతుండ గా పల్లెవాసులు అందరి చేత మగ్గం నేతలు ప్రారంభించా డు పార్థసారథి. 


మిల్లు వస్త్రాల పోటీ ఎక్కువగా ఉందని, ప్రభుత్వ సబ్సి డీలు లేవని, అధికారుల అవగాహన లోపమని, దళారుల

అధికార చలాయింపు అని, శ్రమదోపిడీ అని, ప్రభుత్వం నిర్లక్ష్యమని, వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలని, బీమా సౌకర్యం లేదని ఈ వంకలు ఓ పక్కన పెట్టి మొక్కవోని కార్యదీక్షతో వాళ్ళందరినీ ఒక్క తాటిమీద నడిపించాడు విజయంగా పార్థసారథి. 


ఇంకా ఉంది

ఇంద్రలోక వైభవం పెద్ద కథ మూడవ భాగం త్వరలో 

**

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree



ree


ree

రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 


bottom of page