ఇంద్రలోక వైభవం - పార్ట్ 3
- Nallabati Raghavendra Rao

- 8 hours ago
- 7 min read
#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #ఇంద్రలోకవైభవం, #IndralokaVaibhavam, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Indraloka Vaibhavam - Part 3/3 - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 26/12/2025
ఇంద్రలోక వైభవం - పార్ట్ 3/3 - పెద్ద కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
జరిగిన కథ: అది శిథిలావస్థలో ఉన్న ఒక నేత కార్మికుల గ్రామం.
తన నాన్నమ్మను తీసుకెళ్లడానికి ఆ గ్రామం వచ్చిన పార్థసారథి అక్కడి నేత కార్మికుల కష్టాలు చూసి చలించిపోతాడు. తాను అక్కడే ఉండి, పేదలకు సహాయం చేస్తానంటాడు.
ఇక ఇంద్రలోక వైభవం పెద్దకథ మూడవ భాగం చదవండి.
కొన్నాళ్లకు తన మామగారితో, పిల్లలతో గుర్రపు బండి మీద ఆ పల్లెలో దిగింది లలిత.
''ఏమండి, నన్ను క్షమిస్తారా.. మీ నిర్ణయం ప్రకారం మీతోనే నా జీవితం. అర్థం చేసుకున్నాను. కష్టం సుఖం మీతో కలిసి పంచుకోవడంలోనే ఆనందం ఉంది. తప్పుగా ఆలోచించాను. మన వృత్తివాళ్లకు మనమే న్యాయం చేయాలని బుద్ధి తెచ్చుకొని అర్థం చేసుకున్నాను. '' భర్త పాదాలకు నమస్కరిస్తూ అంది లలిత.
''లలితా.. ఇందులో నీ తప్పు ఏమీ లేదు. మనుషులకు ఉండే సహజ ఆలోచనతోనే నువ్వు ఆలోచించావు. ప్రతి ఊరిలో నేత పనివాళ్ళు ఉండవచ్చు లేదా అణగారి పోయిన వేరే వృత్తుల వారు ఉండవచ్చు. అయితే ఆ వృత్తుల నుంచి బయటకు వెళ్లి కోటీశ్వరులైన అదృష్టలక్ష్మీ పుత్రులు వాళ్లకు చేయూత నివ్వాలి.. ఇది మానవ ధర్మం. మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన బ్రతుకు అలా మలుచుకోవాలి. అప్పుడే భరతమాత తన బిడ్డలను చూసి సంతోషిస్తుంది. సరే ఇప్పటికైనా నువ్వు ఇక్కడికి రావడం చాలా సంతోషం. నాన్నకు కూడా ఇక్కడి వాతావరణం బాగా ఉపయోగిస్తుంది. ఒక నెలలో మామూలు మనిషి అవ్వడం ఖాయం. '' ఖచ్చితమైన అభిప్రాయం తో చెప్పాడు పార్థసారథి.
అలా మరో ఆరునెలలు ఆ భార్య భర్తలు ఇద్దరూ మగ్గం నేస్తూ అక్కడి పని వాళ్ళందరిని స్వయంగా ముందుకు నడిపించారు.
ఆ రోజుకు ఆ పల్లెలో నవవసంతం వెల్లివిరిసి సరిగ్గా సంవత్సరం అయింది.. ఆ ఉదయం..
''లలిత.. ఇక మన బాధ్యత పూర్తయింది వీళ్ళందరూ సంఘంగా ఏర్పడి లాభాల బాటలో నడుస్తున్నారు. ఇప్పుడు చెప్పు.. మన దగ్గర ఉన్న ఆ రెండు కోట్లతో మన కుటుంబం ఒక్కటే ఆనందంగా బ్రతికే కన్నా ఈ 80 కుటుంబాలు మహదానందంగా బ్రతుకుతున్నాయి.. చూశావు కదా.. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా తృప్తిగా ఉంది. ఇక మనం బెంగళూరు వెళ్ళిపోదాం. ఏదో ఓ కంపెనీ లో నాకు ఇదివరకటిలా మంచి ఉద్యోగం దొరక్కపోదు. ఇక్కడ నాన్న పరిస్థితి కొంచెం నయం అయింది కనుక నానమ్మకు కూడా పూర్తి ఆ రోగ్యం చేకూరింది కనుక ఆవిడను జాగ్రత్త గా నాన్నను చూసుకోమని అప్పచెప్పి మనం బయలు దేరుదాం. '' అన్నాడు భార్య లలితతో పార్థసారథి.
''అది మీ నిర్ణయం.. నా నిర్ణయం వింటారా. మనం బెంగుళూరులో ఉన్నప్పుడు మీరు ఉద్యోగానికి బయటకు వెళ్ళి నప్పుడు ఇంటిదగ్గర ఆ నాలుగు గోడల మధ్య నేను అనుభవించేది ఆనందం కాదండి.. టీవీ చూస్తూ.. ఆ పాల వాడు, కూరగాయలువాడు, చాకలివాడుతో మాత్రమే మాట్లాడుతూ సంవత్సరాలు అలానే గడిపేయటం.. జీవితం అలా నిస్సారంగా గడిచిపోవడం నాకు ఇప్పుడు ఇష్టం అనిపించటం లేదు. మీ పురుషలక్షణం నెరవేర్చు కోవడం కోసం మీరు వెళ్ళండి. కానీ నా భర్త ఆశయసాధన కోసం నేనిక్కడే పిల్లలతో ఉండిపోతాను.
వాళ్ల చదువులు చూసుకుంటూ ఇక్కడ ఉన్న వారందరినీ మరింత అభివృద్ధి పథం వైపు నడిపించే బాధ్యతతో పాటు మీ నానమ్మ, మీ నాన్నల బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఆ పిల్లగాలు లు, ఆ పున్నాగ పూలు, రకరకాల రంగురంగుల పేకలతో అందమైన వస్త్రాలు నేసేటప్పుడు చేనేత మగ్గాలు చేసే చిరుసవ్వడులు, దూరంగా గలగల పారే ఆ పిల్ల కాలువ. నాకు స్వర్గంగా ఉంది. ఎక్కడికీ రావాలనిపించడం లేదు. '' భర్తకు తన నిశ్చితాభిప్రాయం తెలియజేసింది లలిత.
అంతే పార్థసారథి ప్రేమగా లలితను తన గుండెలకు హత్తు కున్నాడు. ఆ క్షణం మధురం మధురం.
మరో సంవత్సరం అలా గడిచింది.
*
బెంగుళూరులో రింగ్ అయిన సెల్ అందుకొని పార్థ సారథి చెవి దగ్గర పెట్టుకున్నాడు.
''ఏమండీ నేను మీ లలితను. మీకు శుభవార్త చెప్ప మంటారా.. ఇక్కడ.. ఇక్కడ మామగారిలో పూర్తి మార్పు వచ్చింది. పేపర్ చదువుతున్నారు, మగ్గం మీద చీరలు నేయగలుగుతున్నారు.
మరో న్యూస్ చెప్పమంటారా. మీరు థ్రిల్ల్ అవ్వటంఖాయం
.. అట్టడుగున ఉన్న చేనేత సంఘాలను అభివృద్ధి పరచి అధిక అమ్మకాలు చూపించినందుకు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే రాష్ట్రస్థాయి అవార్డు నా కృషికి ఫలితంగా నాకే వచ్చినట్టు టెలిగ్రామ్ వచ్చిందండి.
ఎగ్జిబిషన్లో కూడా అమ్మకాలు పెట్టించి కోటి రూపాయలు అమ్మకాలు చూపించగలిగాను. ఏమండీ. బాగా గిరాకీ ఉన్న పానీ, క్రిస్టల్, ముత్యాల వర్కు ఇంకా ఖరీదైన బంగారు వెండి తీగల జర్దోసి వర్క్కు చీరలు త్వరలోనే మొదలుపెట్టే అభివృద్ధి పథకం వైపు దూసుకు వెళ్లాలను కుంటున్నాం. మనవాళ్ళు అందరూ చాలా ఆరోగ్యంగా చలాకీగా కొత్త కొత్త ఆలోచనలతో మంచి పని వాళ్లుగా రాటుదేలేలా ప్రత్యేక అధికారులను తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను.
మధ్యతరగతి వారికి చిప్స్, కుందన్ షో, మిర్రర్మెర్ఫార్సు కుందన్స్ ఉపయోగించిన చీరలు అతి తక్కువ ధరలో తయారు చేయటం మన వాళ్ల ప్రత్యేకత అండి. మరో విషయం విన్నారా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల ద్వారా వ్యక్తి గతంగా పొందిన రుణాలు మాఫీ చేస్తారట. పిఎంఆర్వై రాజీవ్ యువశక్తి పథకాల రుణాలు కూడా మాఫీ చేయ బోతున్నారట. ఏమండీ ఊరూరా తిరిగి సంతలలో, ఎగ్జిబిషన్లో, ప్రత్యేక కూడళ్ళలో కూడా అమ్మించి అమ్మ కాలు చాలా అభివృద్ధి చేశాను. ఒకరి బాధ్యత అందరి బాధ్యతగా కలసికట్టుగా స్వయం సహాయక సంఘంగా ఏర్పడి నాతో సహా అందరం కష్టపడి పని చేస్తున్నామండి. అసలు ఫోన్ వింటున్నారా వేరే పనిలో ఉన్నారా.. మాట్లాడరే.. '' చిరు కోపంగా అంది లలిత.
''ఏం మాట్లాడను లలిత.. నీ మనసు ఎదుగుదలకి నీ మీద నాకు గౌరవం పెరుగుతుంది దాంతో ఆనందంతో మాటలు రావడం లేదు. "
'' ఈ వార్త వినండి మరి.. రేపే ఈ చుట్టుపక్కల చేనేత సంఘాల వాళ్ళందరూ నాకు సన్మానం చేయడానికి భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నా మతిమండా నాకు సన్మానాలు ఏమిటండి.. ఏం సాధించాను.. వద్దు అన్నాను. అయినా వాళ్ళు వినేలా లేరు బాబు. సరే మీరు తప్పకుండా రావాలి ఇప్పుడే బయలుదేరండి. ఆ సన్మానం చూడాలి మీరు నా కృషికి నన్ను అందరిముందు అభినందించాలి. నన్ను పొగడాలి.. అప్పుడు కానీ నాకు ఆనందంగా ఉండ దు బాబు. వస్తారు కదూ.. వస్తారని నాకు మీ మీద నమ్మ కం లేదండి. వస్తానని నా చేతిలో చేయివేసి చెప్పండి.. నా మతి మండా సెల్ఫోన్లో చేతిలో చెయ్యి ఎలా వేస్తారు. '' లలిత ఉబ్బితబ్బిబ్బు అయినట్టు మహాదానందంగా ఊపిరి తీసుకోకుండా చెప్పింది.
''మానవులు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదండి.
అయితే మీరు చెప్పిన ఒక మాటను మాత్రం నేను జీవి తాంతం మరిచిపోను. ఏ వృత్తి లోనైనా ఏ ప్రాంతంలోనైనా బలహీనునికి బలవంతులు సహాయపడాలి అని మీరు చెప్పారు కదా అది మానవధర్మం అన్నారు కదా నిజమే నండి. మానవత్వపు రక్తం చెప్పే న్యాయం అది.
మనిషి జన్మ అనుభవిస్తున్నందుకు తన కుటుంబానికే కాకుండా మరో 10 మందికి ఉపయోగపడే ఆదర్శ ప్రాయ మైన ఆలోచన చేయగలిగితే చాలు. చనిపోయేటప్పుడు తను కూడా తీసుకుపోయేది మానవత్వమే అని గుర్తించి అలా బ్రతుకును మలుచుకుంటే వాడే దేవుడు. అంటే 'మీలాంటి దేవుళ్ళు ఉన్న ప్రతి ఊరులో ప్రతి ఇంటి ముంగిళ్ళు అవుతాయి ఇంద్రలోకపు వాకిళ్లు. '.. ఎలా ఉంది నా కవిత. '' అంది ఆనందంగా గట్టిగా పకపక నవ్వేస్తూ లలిత.
పార్థసారథి ఊహించిందే జరిగింది. ఇప్పుడు పార్థ సారథి ఆనందంగా ఉన్నాడు.
సమాప్తం
**
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు




Comments