top of page

జీవన చదరంగం - ఎపిసోడ్ 17'Jeevana Chadarangam - Episode 17' - New Telugu Web Series Written By

Vadapalli Purna Kameswari Published In manatelugukathalu.com On 03/04/2024

'జీవన చదరంగం - ఎపిసోడ్ 17' తెలుగు ధారావాహిక

రచన : వాడపల్లి పూర్ణ కామేశ్వరి 

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


సిరిచందనకి తాతగారన్నా, అయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం. ఆ ముచ్చట్లు స్నేహితురాలు, మామయ్య కూతురు మైత్రితో పంచుకుంటూ ఉంటుంది. 

పదేళ్ల కిందట రైల్వే స్టేషన్ లో జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది. ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తలిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని, బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్ లో వెళ్ళిపోతారు. అదే ట్రైన్ లో పక్క కంపార్ట్మెంటు లోంచి పన్నెండేళ్ళ షర్మిల అనే మరో అమ్మాయి, అలాంటి వ్యక్తులని విడిపించుకొని ప్లాట్ ఫారమ్ మీదకు దూకేస్తోంది. 

ఇంతలో ట్రైన్ రావడంతో సిరి, తన పేరెంట్స్ తో తాతయ్య వాళ్ళ వూరు చేరుకుంటుంది. అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిలను చూస్తుంది. వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది. 


వాళ్ళు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని, వాళ్ళతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నట్లు చెబుతాడు ఆయన. మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంది సిరి. 

బెంగుళూరులో రాజా వాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల. కూతురు షర్మిలను హాస్టల్ లో చేరుస్తుంది. ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్లారా చూస్తుంది. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు. ఆశ్రమం నుండి పారిపోయిన షర్మిలను రాజారామ్ దంపతులు ఆదరిస్తారు. ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు. 


మైత్రి, సిరి లు జగపతిరాజపురం వెళ్తారు. అక్కడ రాజా కొడుకు రాఘవతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది. 


రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది సిరి. పిల్లలు లేని రాధ గౌరికి పుట్టిన నాల్గవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది. ఆ పాపే మైత్రి. 


మాయ మాటలతో మైత్రిని శారీరకంగా లొంగదీసుకుంటాడు రాఘవ. మైత్రి నెల తప్పుతుంది. ఇంటినుండి పారిపోయి రాఘవను పెళ్లి చేసుకుంటుంది. మైత్రి తనను దూరం పెట్టిందని రాధతో చెప్పి బాధ పడుతుంది సిరి. డబ్బు అవసరమని మైత్రి నగలు తీసుకుంటాడు రాఘవ. అతని తండ్రి రాజాను పోలీసులు అరెస్ట్ చేస్తారు.


మైత్రి పుట్టింటికి చేరుతుంది. రాఘవ కూడా వచ్చేస్తాడు.

కానీ ఏ ఉద్యోగం కుదురుగా చెయ్యడు. శ్యామల కేసు రీ ఓపెన్ అవుతుంది. రాజా, రాఘవ చిక్కుల్లో పడతారు.ఇక జీవన చదరంగం ఎపిసోడ్ 17 చదవండి. 


సీలుచేయబడ్డ SR బ్రదర్సు కంపెనీనుంచి ఇప్పటికీ నకిలీ స్టాంప్ పేపర్ల సరఫరాల లావాదేవీలుకొనసాగుతున్నాయన్న వార్త వచ్చి, బెంగళూరు పోలీసులు నిర్ఘాంతపోయారు. వెంటనే దాడికి వెళ్ళారు. ఆరు మాసాల క్రితమే వచ్చిన ఫిర్యాదులు, సాక్ష్యాల ఆధారంగా కంపెనీని ముందస్తుగా సీల్ చేయడమైంది. ఇంకా దర్యాప్తు లోనున్న కేసు, పోలీసు సీలులో ఉన్న కంపెనీ నుంచి సరుకు సరఫరా జరగడం డిపార్టుమెంటుకే అప్రదిష్ట. అనేక రాజకీయ నాయకులకు ఇందులో భాగంఉందన్న అనుమానాల కారణంగా ముందస్తు చర్యగా సీల్ చేయడమైనది. 


పోలీసుల ద్వారా సీలు చేయబడ్డ కంపెనీ నుంచి సరఫరాల వార్తల వల్ల కమిషనరేట్ ఆఫీసును మీడియావారంతా చుట్టముట్టారు. వారి అసమర్ధతను నిలదీస్తూ ప్రశ్నలతో వేధించ సాగరు. కమీషనర్ గారిపై వత్తిడి పెరిగింది. జరుగుతున్నది మన్నించారాని నేరంగా పరిగణింప బడడమే కాకఅలా జరగడంపోలీసు డిపార్టుమెంటు వారి హస్తంలేకుండా జరగడం అసాధ్యమని పేర్కొంటూ నిలదీసారు. ఇది వారిపై ఒక పెద్ద మచ్చ అవ్వడంతో అనేక చోట తనిఖీలు తీవ్రం చేశారు. 


అసలు, ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు అందరూపోలీసు కస్టడీలో ఉండగా, ఎవరి ఆధ్వర్యంలో ఈ పనులు ఇంకా కొనసాగుతున్నాయో అంతు చిక్కకుండా ఉంది. ఆ మేరకు ఆరా తీయ సాగరు. ఐతే, ఆ కంపెనీ సంబంధిత వ్యక్తులెవ్వరూ బెంగళూరులో లేకపోవడంతో పోలీసులకు ఆ కేసు మరింత చిక్కు ప్రశ్నగా మారి, క్లిష్టంగా తయారైయ్యింది. ఏ కోణంలోంచి చూసినా ఎలాంటి క్లూలూ దొరకలేదు. వేసిన సీలు వేసినట్టే ఉండగా ఇంతటి ఉదంతు రావడం, ఎంలాంటి వివరాలూ రాష్ట్రమంతా గాలించినా దొరకకపోవడం, మర్మంగానే మిగిలింది. 


ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ సైతం, మూడు ప్రత్యేక టీములను తయారు చేసి, ఈ కేసులో మరింత కీలకమైన దర్యాప్తులు చెయ్యాలని ఉత్తర్వులిచ్చారు బెంగళూరు పోలీసు అధికారులు. దాదాపు రెండున్నర వారాలు శ్రమించగా అబ్బురపడే విషయం ఒకటి బయటపడింది. 


SR కంపెనీకి ఈశాన్యంగా ఉన్న పవర్ రూమ్ గుండా ఒక బంకరుకు స్వరంగమార్గం కనిపెట్టారు పోలీసులు. కేసులో ఇది ఒక పెద్ద అమూల్యమైన క్లూ. ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా అనేక ఫింగర్ ప్రింట్స్ తీసుకుని పరిశీలించగా, నేరస్తుల జాబితాలో ఉన్న ఎవ్వరితోను మ్యాచ్ అవ్వకపోవడంతో మళ్ళీ నిరాశే ఎదురయ్యింది. 


అనుకోకుండాఅనుమానాస్పద పరిస్థితిలో దొరికిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కరీమ్ అనే అతనిని ప్రశ్నించగా చెన్నై తాను చెన్నైకి చెందినవాడిగానూ అక్కడ దోపిడీల ముఠాకు చెందినవాడే గానీ బెంగళూరు కేసులో బుక్ చేసిన కరీమ్ కు ఎటువంటి లింకులూ లేవని తేలింది. హోటల్లో ఎవరికో ఒక బాగ్ అందజేయడం తప్ప తనకు ఇక్కడ మరేమి పని ఇవ్వలేదని చెప్పాడు. ఐతే, స్టాంపు-పేపర్ల కేసుకీ ఇతనికీ ఎలాంటి సంబంధమూ లేకపోతే ఇతనికీ బెంగళూరుకూ ఉన్న సంబంధాన్ని ఆరా తీశారు. అప్పటికి వాడిని వదిలేసి వాడి మీద ఒక కన్నేసి ఉంచమని అధికారులు చెప్పి ఉంచడంతో వాడిని గమనిస్తూనే ఉన్నారు స్పెషలు టీమ్ పోలీసులు. 


పొరుగూర్లనుంచి వచ్చే పోయే వాహనాల వివరాలను టోల్-గేట్ల వద్దనున్న సీసీటీవీ కెమెరాల ద్వారా వెలికి తీశారు. అందులో కరీమ్ వచ్చిన వాహన వివరాలు ఉన్నాయి. తనని మాత్రం బెంగుళూరులో ఉన్న ఒక ప్రదేశంలో డబ్బు అందచెయ్యడానికి మాత్రమే నియోగించారని తేలింది నిజమేనని ధృవికరణైయ్యింది. చెప్పినచోట డబ్బు అందచేయడం తప్ప అంతకు మించి ఈ ఊర్లో ఏమి జరుగుతుందో నాకు తెలియదని పదే పదే చెప్పాడు. అది చెన్నై నుంచి వచ్చిన వాహనమే. 


కరీమ్ ను వారికి అప్పగించి అతను చెప్పిన విషయాల పై దర్యాప్తు చేయడానికిపైదరాబాదు పోలీసులకు, వారు సేకరించిన వివరాల నందించారు బెంగళూరు పోలీసులు. 


పైదరాబాదు క్రైమ్ బ్రాంచ్ ఇంచార్జిగా కమీషనర్ రాజేశ్వరి ఉన్నారు. రాష్ట్రంలోని ఒక ముఠా అనేక దొంగతనాలకు దోపిడీలకు పాల్పడి అలజడి సృష్టించి పరారీలో ఉన్నారు. వారికోసమే గాలింపులు కొన్ని నెలలుగా జరుపుతున్నారు సైబరాబాదు పోలీసులు. అప్పటికే దోపిడీ దొంగతనాలు చేసి అనేక రాష్ట్రాలకు విస్తరించి, పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్నారు. అలా కళ్ళు కప్పి తిరుగుతున్న నేపధ్యంలో ఆ ముఠాకే చెందిన నిందితుడు కనకరాజ్ మరో నేరారోపణకూ గురవ్వడంతో కమీషనరుగారు స్వయంగా సంబంధిత స్టేషనులోనే ఉండి కూలంకశంగా కేసు వివరాలు పరిశీలిస్తున్నారు. 


కరీమ్ ఇచ్చిన వివరాలలో కనకరాజ్ పేరుండడంతో ఈ రెండు కేసులకీ ఏదో సంబంధం ఉందని తేలింది. అశ్లీల ఫోటోలు తీసి, బ్లాక్మెయిల్ కు పాల్పడుతూ అనేక మంది ఆడపిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారన్నది ప్రాధమిక సూచన. కనకరాజ్ సైతం ఆరుగురు పేర్లను కనుగొన్నారు. విషయం చాలా తీవ్రమైనదిగా గ్రహించి, అనేక రాజకీయ నాయకుల కొడుకులు ఇందులో కూటమిగా ఉన్నారని తెలిసిన పోలీస్ వింగ్, మధ్య తరగతి కుటుంబాలకు చెందిబలైనవనితలను ప్రశ్నించి, విషయం రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చి భయపడుతున్న వారి వద్దనుంచి వివరాలు సేకరించారు. 


ఈ ఆడపిల్లలందరినీ ప్రేరేపించి వారి కట్టుబాటులో ఉంచుకుని ఆశ్రమంలో అనేక అత్యాచారాలకు గురిచేయడంతో కేసు అటు మలుపు తిరిగింది. మహర్షి హత్య కేసు ఈ రహస్యాలు తెలిసిన కారణంగానే అయ్యి ఉంటుందని పసికట్టారు పోలీసులు. ఇక ఆశ్రమంలో వివరాలు తెలియాలి. అందుకు గాను శివాని భవానిలను సంప్రదించడానికి ప్రయత్నించారు. 


శివాని భవానిల తండ్రి అనేక సార్లు తమ బిడ్డలతో మాట్లాడడానికి ప్రయత్నించగా వారు ఎన్నడూ చలించకపోగా, వారు తమ ఆధ్యాత్మికత కోసమే ఆశ్రమవాసులమైయ్యామని చెప్పారు. ఈ విషయమే పరిశీలిస్తూ రాజారామ్ ని వెతుకుతూ వారిని చేరిన పోలీసులకు షర్మిల ద్వారా మరిని వివరాలు తెలిసాయి. ఆశ్రమంతో రాజాకున్న లింకు, అలాగే సీలుచేయబడ్డ పేపరు కంపెనీలో వారికున్న వాటా గురించి ఆరా దొరికింది. అంతే, అన్ని దారులు ఒకే చోటకి చేరినట్టు రాజాతో సహా రాఘవ కూడా కేసుల్లో ఇరుక్కున్నాడు. 


రాజారామ్ షర్మిల ఉద్యమం గురించిన తన పరిశోధనలో పలువురితో పరామర్శలు జరిపిన సిరికి షర్మిలతో సంభాషించడం చాలా ఆసక్తి కరంగా అనిపించింది. షర్మిల జీవిత ఘట్టాలన్నింటి గురించి విపులంగా తెలుసుకుంది. రాజారామ్ గారి కుమార్తెలు శివాని భవాని ఎలాంటి పరిస్థితుల్లో ఆశ్రమ పద్ధతులకు ఆకర్షింపబడి ఆ తరువాత ఆ నియమాలకు కట్టుబడి మరింత ముందుకు సాగుతూ నిర్బంధంలో చిక్కుకున్నారో తెలుసుకుంది. 


ప్రత్యేక శ్రద్ధతో వారి మనస్తత్వాన్ని పరిశోధిస్తూ వారితో చర్చించడానికి అనుమతి కోరింది. అనేక ప్రయత్నాలు చేయగా, ఆశ్రమాన్ని వీధిన లాగడానికి కాకుండా, వారిని గురించు తెలుసుకోవడానికి అని నిర్ధారించుకున్న తరువాత ఎట్టగేలకు శివాని భవానులు సిరిచందనతో మాట్లాడడానికి అనుమతించారు. 


“మీ బాల్యం గురించి వివరించగలరా?” అడిగింది సిరి. 


“మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మా బాల్యం ఎంతో సంతోషంగా గడిచింది. ఎన్నో ఆశయాలకోసం పాటుపడే మా నాన్నగారు మా ఒక్కరికే కాక చుట్టుపక్కల అందరి చదువులకోసం పాటు పడేవారు. ఆయన ఎంతో ఆదర్శజీవి. ఆయనకు అనుకూలవతి మా అమ్మ. ఉన్నదాంట్లో మమ్మల్ని చదివిస్తూ, సమాజ శ్రేయస్సుకి ప్రయోజనం కలిగే పనులు చేసేవారు. నలుగురికి ఉపయోగపడూతూ ఉండేవారు” శివాని వివరించింది. 


“మరి, అందరి ఆడపిల్లల్లా చదువుకుని, ఉద్యోగం సంపాదించుకుని పెళ్లిచేసుకుని జీవితాన్ని మీ నాన్నగారి ఆదర్శాలతో కొనసాగించాలని ఎందుకు మీకు అనిపించలేదు?” అడిగింది సిరిచందన. 


“ఉద్యోగాలు, ఆదర్శాలు, సమాజ శ్రేయస్సు అంటూ అమ్మా నాన్నలు చాలా బిజీగా ఉండేవారు. కొన్నాళ్ళు మాకూ అవి చాలా బాగా అనిపించేవి. ఒక సమయంలో ఎక్కడో ఒక చిన్న వెలితి కనిపించి కొద్దిగా మరో ప్రపంచాన్ని చూడాలన్న కోరిక కలిగింది. సరిగ్గా అదే సమయానికి మా ఊరికి ఈ కాషాయి రంగు యూనీఫార్మ్ వేసుకున్న వాలంటీర్లు వచ్చారు. చాలా సున్నితంగా మాట్లాడుతూ ఫైనల్ సంవత్సరంలో ఉన్న బాలికలను ఎక్కువగా ఆకట్టుకునేందుకు ప్రయత్నించేవారు.


 అలాంటి మాటలు మమ్మల్ని చాలా ప్రభావితం చేసేవి. ఎంతో ఉత్తేజవంతంగా ఉండేవి వారి మాటలు. ఈ సంసార సాగరంలో పడిపోయి ఈదుకుపోవడం కంటే ఆధ్యాత్మికంగా ఎంతో ఎత్తుకి ఎదగాలనే సాలోచనా బీజాన్ని మా అందరిలో మాకే తెలియకుండా నాటేసారు. అంతే ఒక్కసారిగా ఎంతో మంది అటువైపు తిరిగిపోయాము. మాయామోహభరితమైన జీవితంలో ఏవుంది? మళ్ళీ ఈ మాయలో చిక్కుకోవడం తప్ప అని ఆ వ్యక్తి ముందుగా చెప్పినపుడు ఆసక్తి కరంగా అనిపించింది. ఆ తరువాత, అది చాలా తీయగా అనిపించాయి. కొన్నాళ్ళకు అక్కడికి వెళ్ళిపోవాలని మనసు లాగేసింది. అంతే అలా తీసుకున్న నిర్ణయమది” వివరించింది భవాని. 


“వెళ్ళినందుకు ఈరోజు దాకా మీరు సంతోషంగా ఉన్నారా? మీరనుకున్న ఆధ్యాత్మిక సాధన చేయగలిగారా? మామూలు మనుషులుగా మీరుండి జయించలేనికి అక్కడ జయించారా?” అడిగింది సిరి. 


వారి ముఖాల్లో రంగులు మారడం సిరి గమనించకపోలేదు. కానీ ఎంతో మామూలుగా ఉండి వారి సమాధానం కోసమన్నట్టుగా వేచి ఉంది. 


ఒక పరిశోధన కోసం వేస్తున్న ప్రశ్నలు గానే భావించి వివరించారు. 


“లేదు. మేము సంతోషంగా లేము. మేమనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నవి మరొకటి. వారు మమ్మల్ని ఇందులోకి లాగడానికి ముందు మాట్లాడినవి వేరు ఇక్కడి వాస్తవాలు వేరు. నిజం నిలకడలో తేలుతుందని ఊరికే అనలేదు. ఆ నిజం తెలిసేసరికి మేము మా మానసిక బలాన్ని, మా నాన్నగారు మాకు చిన్నప్పటినుండి నూరిపోసిన మనోధైర్యాన్ని, మా అమ్మ మాకు నేర్పిన అభిజాత్యాన్ని అన్నిటినీ కోల్పోయాము. మనుషులుగా వచ్చిన మేము యంత్రాల్లా తయారైయ్యాము. 


ఇదో కర్మాగారం. ఇక్కడ మనం చేయవలసినవే కాని ఆలోచనలకు పనిలేదు. వ్యక్తిత్వానికి గౌరవంలేదు. ఏదీ ప్రశ్నించడం కానీ తర్కించడం కానీ చేయరాదు. ఇక్కడి పద్ధతుల ప్రకారం నడచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇందులోకి వచ్చేదారేకానీ వెలుపలికి పోయే దారి ఉండదు. అది తెలిసేసరికి సమయం మీరిపోయింది” చెపుతున్న భవాని స్వరంలో బాధ ప్రతిధ్వనించింది. 


“మరి మీరు వెలుపలికి, మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేయలేదా?”


“అది ప్రయత్నం అవ్వదు సాహసం అవుతుంది” క్లేశంతో చెప్పింది శివాని. 

శివాని భవానులు ఎంతో మథన పడుతున్న విషయాన్ని గ్రహించిన సిరిచందన, తన రికార్డింగుని మరింత కొనసాగించింది. 


“మీ తల్లిదండ్రులను నిరాకరించి కారణం?”మళ్ళీ ప్రశ్న. 


“నిస్సహాయత” అంది భవాని. 


“ప్రభుత్వ సహాయంతో చట్టబద్దంగా మిమ్మల్ని వారి వద్దకు చేర్చే ప్రయత్నం జరిగితే మీరందుకు ఆమోదిస్తారా? మనస్ఫూర్తిగా వారి దగ్గరకు వెళ్ళి ఈ దుర్భర జీవితాన్ని వదిలి మళ్ళీ పునఃప్రారంభిస్తారా?” ఆశని చిగురింపచేస్తూ అంది సిరి. 

కొంత సమయం నిశ్శబ్దం చోటు చేసుకుంది. 


“తప్పకుండా?” అని పెదవులు పలుకలేదు. చమ్మగిల్లిన కళ్ళు చెప్పాయి. 


శివాని భవానుల మదుల్లో జరుగుతున్న మథనాన్ని ఆ కళ్ళల్లో చూసింది సిరిచందన. వారున్న పరిస్థితిని అర్థం చేసుకోగలిగింది. 


రాజారామ్ షర్మిలలతో కలిసి పోలీసుల వరకూ ఈ విషయాన్ని తీసుకెళ్ళాలని నిశ్చయించుకుంది సిరి. 


“సార్, శివాని భవాని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఉన్నారు. ఇకనైనా చర్యతీసుకోకపోతే, ఆత్మహత్య వంటి తీవ్రమైన చర్యకు పాల్పడే అవకాశం ఉంది. తక్షణం మనం వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి” స్పష్టతతో చెప్పింది సిరి. 

*****


సిరి వారితో చేసి సంభాషణలు, వారు స్వయంగా చేసుకొనేలా విశ్లేషణ చేసిన తీరుతో నెమ్మదిగా శివాని భవానిలలో అంతర్మథనం మొదలైయ్యింది. ఇంత కష్టపడుతూ, కన్న వాళ్ళను కష్టపెడుతూ తాము సాధించినదే ఏమిటి? అసలు జీవితంలో తన లక్ష్యమేమిటి? నాగరిక ప్రపంచానికి వాస్తవికతకూ దురమై తమను తాము ఉద్ధరించుకోగలిగినతేమిటి? సమాజానికి వారు చేయగలిగినమేమిటి? పలు విధాలుగా ఆలోచించారు. 


ఒక సారి తప్పుచేసి, ఆత్మ విమర్శ తరువాత ఆ తప్పును సరిదిద్దుకోవడంలో తమ అహానికి ఎలాంటి భంగపాటు కలుగదని సిరి ఇచ్చిన ధైర్యం వారిని అలా ఆలోచింపజేసింది. 


తప్పు చేసి అందులోనే కూరుకుపోయే కంటే, తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవడం వివేకమని ఎట్టగేలకు గ్రహించారు. వెంటనే ఆప్రూవర్లగా మారి ఆశ్రమంలోని వారికి తెలిసిన అవకతవకల్ను పోలీసుకు చెప్పడానికి నిశ్చయించుకున్నారు. డిపార్టుమెంటుతోమాట్లాడి వారిని కేసులో కేవలం సాక్ష్యులుగా పరిగణించి వారికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా తాను చూసుకుంటానని సిరిచందన హామీ ఇచ్చింది. రాజారామ్ దంపతులను ఇబ్బంది పెట్టకుండా NGO అధినేతగా షర్మిల పోలీసు డిపార్టుమెంటుతో సింభాషణను జరిపింది. 


యువత ఉడురక్తపు ఆశక్తిని ఆసరా చేసుకుని కొన్ని ఆశ్రమాలు, మరి కొన్ని స్వార్థభరితమై అర్థరహితంగా సాగుతున్న విప్లవకారులనూ రెండు కళ్ళా కనిపెట్టి యువత తడపడకుండా చూసే బాధ్యతను చాలా మటుకు సమాజం పై ఉన్నా కొంత వరకూ పొలీసు డిపార్టుమెంటు కూడా అప్రమత్తంగా ఉంటూ యువతరానికి సరైన మార్గ నిర్దేశం చేస్తే ఇలా జరగదని తెలియచేసింది షర్మిల. 


వారికున్న భయాలను వీడి వారి అనుభవాలను పంచుకోవడానికి సిద్ధమైయ్యారు శివాని, భవాని. పన్నెండేళ్ళుగా వారు చేస్తున్న తపస్సుకు ఇదే ఫలితమని వెనుక వరుసలో కూర్చుని వర్షిస్తున్న కనుల మసకలోనే తమ ఇంటి దీపాలను చూసుకుంటున్నారు రాజారామ్ సీతాలక్ష్మి దంపతులు. 


“సిరిచందన గారూ, సమాజానికి మేము చేస్తున్న పోరాటాల వల్ల కలిగే ప్రయోజనం ఒక రకమైతే, మానసిక సంఘర్షణల్లో కొట్టుమిట్టాడుతున్న ఎందరికో మీ నైపుణ్యంతో మీరుచేస్తున్న సేవ మరింత గొప్ప విధానం. శివాని భవానిల విషయంలో మీ విధానం చాలా సకారాత్మకమైన ఫలితాలనిచ్చిందని నేను ప్రత్యక్షంగా చూసాను. మానసిక నిపుణుల అవసరం సమాజానికెంతైనా ఉందని, దాని వల్ల ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చని నిరూపించారు. హార్థిక అభినందనలు!” నవ్వుతూ అభినందించింది షర్మిల. 


========================================================================

ఇంకా వుంది..

========================================================================


వాడపల్లి పూర్ణ కామేశ్వరి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వాడపల్లి పూర్ణ కామేశ్వరి. పుట్టింది పిఠాపురం, తూ.గో. జిల్లా 1973 లో. హైదరాబాద్ లో26 ఏళ్ళ వరకూ, ఆ తరువాత ఇరవయ్యేళ్లు చెన్నై నివాసం. ఇప్పుడు నాకు 47 సంవత్సరాలు. దక్షిణ రైల్వే హెడ్ ఆఫీస్ లో ప్రైవేట్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను. ఆఫీసు వారు నిర్వహించే అనేక హిందీ పోటీల్లో పాల్గొనుట, ఆంగ్లములో సాంఘిక విషయాలపై బ్లాగుల్లో వ్రాయడం అలవాటు. తెలుగులో వ్రాయాలన్న ఆసక్తితో ఒక సంవత్సరం నుంచి ప్రారంభించాను. 20 కధలు, రెండు నవలలు వ్రాసాను. పోటీలకు మాత్రమే పంపుతుండగా రిజెక్ట్ అవుతున్నాయి. వెబ్ సైట్లలో పలు కథలకు, బహుమతులు పొందాను.

56 views0 comments

Comentarios

No se pudieron cargar los comentarios
Parece que hubo un problema técnico. Intenta volver a conectarte o actualiza la página.
bottom of page