top of page
Original.png

కలవరపెట్టిన వార్త

Telugu moral story, fake news awareness Telugu, fact-checking story Telugu, family moral story, Telugu educational story, information awareness story, Telugu short story

Kalavarapettina Vartha Telugu Inspirational Story | Dr. Krishna Kumar Vepepakomma 

కలవరపెట్టిన వార్త - తెలుగు ప్రేరణాత్మక కథ | డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ

Published in manatelugukathalu.com on 29/05/2026


ఒక చిన్న పొరపాటు... ఒక కుటుంబాన్ని పెద్ద ఆందోళనలోకి నెట్టింది.

సమాచారం నిజమో కాదో నిర్ధారించుకోవడం ఎంత ముఖ్యమో ఈ కథ తెలియజేస్తుంది.

నేటి సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ చదవాల్సిన సందేశాత్మక కథ.


అది భోపాల్ నగరం. ఉదయం ఏడు గంటలు కావొస్తోంది. అక్కడి ఓ కాలనీలో నివాసముంటున్న బామ్మకు రోజూ పేపర్ రాగానే హెడ్‌లైన్స్ పెద్దగా చదవడం అలవాటు. 


ఆ రోజు కూడా ఆమె పేపర్ తీసుకుని పెద్దగా చదవడం ప్రారంభించింది…

‘చెన్నై నుంచి న్యూ ఢిల్లీ వెళ్తున్న గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. ఎంతమంది చనిపోయారో ఇంకా నిర్ధారణ కాలేదు’ అంటూ ఆ దుర్ఘటనను వెల్లడించింది. 


ఆ వార్త వింటూనే కోడలు సుజాత“అయ్యో, అయ్యో! అందులో ప్రయాణిస్తున్నాడు మా తమ్ముడు భరణి. తను భోపాల్ వస్తున్నాడు రేపు!” అంటూ కంగారుగా ఏడవడం ప్రారంభించింది. 


ఆ విషయం తెలిసి బామ్మ కూడా కంగారు పడింది. 

కొడుకు వెంకటేష్ సుజాతను బుజ్జగిస్తూ, ‘త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయి’ అంటూ ధైర్యం చెప్పాడు. 


ఇల్లంతా నిశ్శబ్దం చోటుచేసుకుంది. ఎవరి ముఖంలోనూ మాట కనిపించలేదు. సుజాత కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. బామ్మ చేతిలోని పేపర్ వణుకుతుండగా, ఇంట్లో ఆందోళన వాతావరణం నెలకొంది. 


ఒక పది నిమిషాల తర్వాత, ఇంటర్ చదువుతున్న మనుమరాలు సౌగంధి వసరాలోనించి హాల్లోకి వస్తూ పేపర్ చదువుతూ నవ్వుతూ పెద్దగా “కంగారు పడొద్దు, ఎవరూ చనిపోలేదు” అంది. 


వాళ్ల అమ్మ సుజాత ఆశ్చర్యంతో వెంటనే “అదేంటి, ఇప్పుడేగా బామ్మ చదివింది! ఎంతో మంది చనిపోయారని!” అని గట్టిగా అంది. 


సౌగంధి పెద్దగా నవ్వుతూ, “బామ్మ చదివిన పేపర్ నిన్న ధోబీ ఐరన్ చేసిన బట్టలతో పాటు వచ్చిన ఐదు సంవత్సరాల నాటి పాత పేపర్. నాన్న నిన్న ఆ పేపర్ చక్కగా మడిచి టేబుల్ పై పెట్టాడు. బామ్మ పొరపాటున అది ఈరోజు పేపర్ అనుకుని చదివి, ఇంత హడావిడి చేసింది. మనందరినీ కంగారు పెట్టింది” అంటూ బామ్మ చేతిలోని పాత పేపర్‌ను లాగేసుకుంది. 


అప్పుడే లోపలినుంచి మనుమడు 12 ఏళ్ల రాకేష్ చేతిలో ఒక ప్లకార్డ్‌తో బయటికి వచ్చాడు. 

ప్లకార్డ్ మీద అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి:

…………………………

సూచన:

“పుస్తకం అయినా, పేపర్ అయినా, మెసేజ్‌లు ఫార్వర్డ్ చేసే సమయంలో అయినా తేదీ, సమయం చూసుకోవడం అవసరం. సమాచారం నిజమో కాదో నిర్ధారించుకున్న తర్వాతే దానిని చర్చించడం లేదా ఇతరులతో పంచుకోవడం మంచిది. ఇలా చేస్తే అపార్థాలు, అనవసరమైన ఆందోళనలు తగ్గుతాయి. ”

…………………………

చదివి బామ్మ సిగ్గుతో తలవంచుకుంది. “పాత పేపర్ అని గమనించకుండా మీ అందరినీ కంగారు పెట్టేశానురా! ఇక మీదట తేదీ చూసుకుని మాత్రమే చదువుతాను” అని బామ్మ మెల్లగా అంది. 


“ముందు నిజం తెలుసుకుని తర్వాతే ఇతరులకు చెప్పాలి” అని సౌగంధి చెప్పింది. 


సుజాత నవ్వుతూ కిచెన్‌లోకి వెళ్లింది. 

మరొకసారి ఇల్లంతా నిశ్శబ్దం ఆవహించింది. 

………………

“నిజం తెలుసుకోకుండా ఏ వార్తను నమ్మకండి. ”

———————————

డా. కృష్ణకుమార్ వేపకొమ్మ


***

డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ  గారి కొన్ని ఇతర రచనలు:


డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్కారం,

నేను డా. వేపకొమ్మ కృష్ణకుమార్, జువాలజీ లో డాక్టరేట్ పొందిన విశ్రాంతి ప్రొఫెసర్; మాజీ ప్రిన్సిపల్. విద్యారంగంలో 30 సంవత్సరాల పైగా అనుభవం కలిగి, పుస్తక రచయిత, పరిశోధక, విద్యా నిపుణుడిగా సేవలందించాను. ప్రస్తుతం పలు ప్రముఖ పత్రికల్లో కాలమిస్టుగా సామాజిక, విద్యా, సమకాలీన అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాను.

మీ సంస్థలో నా అనుభవాన్ని ఉపయోగించి గుణాత్మక, ఆసక్తికర వ్యాసాలు అందించగలనని తెలియజేయడం నాకు సంతోషంగా ఉంది.

డాక్టర్ కృష్ణ కుమార్ వేపకొమ్మ

ప్రొఫెసర్ & ప్రిన్సిపాల్ (రిటైర్డ్)

వార్తాపత్రిక కాలమిస్ట్

రాజీవ్ నగర్, హైదరాబాద్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page