top of page
Original.png

కరికాల చోళుడు - పార్ట్ 33

 #MKKumar, #ఎంకెకుమార్, #KarikalaCholudu, #కరికాలచోళుడు, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

ree

Karikala Choludu - Part 33 - New Telugu Web Series Written By - M K Kumar

Published In manatelugukathalu.com On 27/11/2025

కరికాల చోళుడు - పార్ట్ 33 - తెలుగు ధారావాహిక

రచన: ఎం. కె. కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కరికాలుడు రాజ్యంలో లేని సమయంలో అతని తండ్రి, చోళ చక్రవర్తి ఇలంచెట్చెన్ని మరణిస్తాడు. అధికారాన్ని కరికాలుడికి దక్కకుండా చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి.


అజ్ఞాతంలోకి వెళ్తాడు కరికాలుడు. ప్రజల మనోభావాలు తెలుసుకుని, అనుచరులను కూడగట్టుకుని అధికారంలోకి వస్తాడు. తుళువ యువరాణి యానై క్కట్చి ని వివాహం చేసుకుంటాడు కరికాలుడు. తుళువ రాజ్యం తో మైత్రి వలన చోళ సామ్రాజ్యం మరింత బలపడుతుంది. శత్రువైన పాండ్య రాజుకు సహకరిస్తున్న ద్రోహులకు కఠిన శిక్షలు విధిస్తాడు కరికాలుడు. తండ్రి మరణంపై కుట్రకోణంలో దర్యాప్తు చేస్తాడు. విషప్రయోగం జరిగిందని గుర్తిస్తాడు.

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక కరికాల చోళుడు - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక కరికాల చోళుడు - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఇక కరికాల చోళుడు - పార్ట్ 33 చదవండి.


కరికాల ఆలోచిస్తూ “మారన్దేవా, రాజభవనంలో ఆ రాత్రి కాపలా ఉన్న సైనికులను వెంటనే విచారించాలి. ఎవరికైనా అనుమానాస్పదంగా తోచిందా? ఏదైనా గమనించారా?”


మారన్దేవన్ నమస్కరించి “మహారాజా, నేను ఇప్పటికే ఆ పని ప్రారంభించాను. కానీ…”


కరికాల కుటిలంగా “ఏమిటి? చెప్పు”


మారన్దేవన్: ‘ఆ రాత్రి రాజ వైద్యుని గదిలో ఒక నీడ కనిపించిందని ఒక కాపలాదారు చెప్పాడు. కానీ, అతను భయంతో ఎవరో చూడలేదు. అంతేకాదు, రాజ వైద్యుడు కనిపించకుండా పోయిన తరువాత కొందరు దాసులను విచారించాం.”


ఆరయన్: “వారు ఏమన్నారు?”


మారన్దేవన్: ‘రాజ వైద్యుని గది నుండి ఓ మహామంత్రికి చెందిన ముద్రావిషయం బయటపడింది.”


కరికాల: కళ్ళు మెరిపిస్తూ “ఏ మంత్రిది?”


సభలో ఒక్కసారిగా మౌనం నెలకొంది. అందరూ కదలకుండా కరికాల ముఖాన్ని చూస్తున్నారు. 


మారన్దేవన్ కొంత కంగారు పడుతూ ముందుకు వచ్చాడు.


మారన్దేవన్ మంచం మీద లభించిన ముద్రావిషయాన్ని చూపిస్తూ “మహారాజా... ఇది మహామంత్రి గోవిందరాజుని ముద్ర”


అంతఃపుర సభలో ఒక్కసారిగా కదలికలు నిలిచిపోయినట్టయింది. 


గోవిందరాజు, అత్యంత శక్తివంతమైన మంత్రి. ఇలమ్సెట్చెన్ని రాజుకి అతి దగ్గరగా ఉండే వ్యక్తి. అతను కుట్రలో భాగమా?”


కరికాల గట్టిగా “గోవిందరాజా, నువ్వేనా ఈ ద్రోహం వెనుక ఉన్నవాడవు? “


అంతా గమనించగానే గోవిందరాజు ముందుకు వచ్చి నిటారుగా నిలబడ్డాడు. 


అతని ముఖంలో భయం కనిపించలేదు, కానీ కొంత అసహనం తళుక్కుమంది.


గోవిందరాజు ఆత్మస్థైర్యంతో “మహారాజా, నా మీద తప్పుడు ఆరోపణలు చేయడానికి యత్నిస్తున్నారా? నాపై కుట్ర జరుగుతోందని నేను అనుకుంటున్నాను.”


కరికాల తీవ్రంగా “అయితే నీ ముద్రావిషయం రాజ వైద్యుని గదిలో ఎలా దొరికింది?”


గోవిందరాజు నిశ్చలంగా “ఎవరైనా అది నకిలీగా వాడి, నన్ను ద్రోహిగా చిత్రీకరించేలా చేసి ఉండవచ్చు. నేను మీ తండ్రికి విశ్వాసపాత్రుడిని, ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు పన్నాగం పన్నుతాను?


సభలో ఉన్న మంత్రులు ఒక్కసారిగా సందేహంతో గుసగుసలాడారు. 


ఎవరిని నమ్మాలో, ఎవరిపై అనుమానం వ్యక్తం చేయాలో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 


కరికాల గట్టిగా “నువ్వు నిజాయితీపరుడివేనా? అయితే నీ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకో.


నేను నా తండ్రి మరణానికి బాధ్యులెవరైనా విడిచిపెట్టను”


గోవిందరాజు తన స్వరం మరింత గంభీరంగా “అది నా బాధ్యత కాదు, మహారాజా. కానీ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీ శత్రువు మీ కంటే ముందే ఒకటి కాదు, రెండు కాదు, మూడడుగులు ముందుగా ఉన్నాడు”


కరికాల చోళుడి ముఖం కఠినంగా మారింది. నిజం ఇంకా బయటకు రాలేదు. 


కానీ, ఈ కుట్ర వెనుక ఉన్నదెవరో త్వరలో బయటపడేలా ఉంది


రాజభవనం లోని అంతఃపుర సభా మందిరం. కరికాల చోళుడు ఆలోచనలో మునిగిపోయాడు. 


అతని ముందు గోవిందరాజు నిలబడి ఉన్నాడు. మిగతా మంత్రులు, సేనాధిపతులు మౌనంగా ఉన్నారు.


కరికాల గంభీరంగా “గోవిందరాజా, నీపై నమ్మకం పోయేలా చేస్తున్నారు. కానీ, నువ్వు నిజంగా నిర్దోషివేనా?”


గోవిందరాజు కళ్ళలోకి నేరుగా చూసి “మహారాజా, నేను మోసగాడు కాదు. మీకు వ్యతిరేకంగా కుట్రపన్ని ఉంటే, మీ ముందు నిలబడి మాట్లాడే ధైర్యం ఉండేది కాదు.”


అతను ఒక్కసారి మౌనంగా ఆలోచించాడు. అప్పుడు అతని కళ్ళలో ఒక ఆలోచన మెరుపు దట్టింది.


గోవిందరాజు గట్టిగా “మహారాజా, ఒక సలహా ఇస్తాను. ముందుగా, రాజ వైద్యుని ఏమైనా క్షుణ్ణంగా విచారించాలి. అతను తప్పించుకున్నాడా? లేక… ఏదైనా జరిగిందా?”


కరికాల తీవ్రంగా “మారన్దేవా, వెంటనే రాజ వైద్యుని గదిని పూర్తిగా తనిఖీ చేయించు. అతను ఎక్కడైనా దాగి ఉన్నాడా, లేక పారిపోయాడా అని తెలుసుకో”


మారన్దేవన్ వెంటనే తన కొంత మంది సైనికులతో బయటకు వెళ్లిపోయాడు. 


అంతఃపురం లోపల ఒక ఒత్తిడితో కూడిన నిశ్శబ్దం నెలకొంది.


కొంత సేపటి తర్వాత, మారన్దేవన్ తిరిగి వచ్చాడు. అతని ముఖంలో ఆందోళన కనిపించింది.


కరికాల ఆతృతగా “ఏమైంది?”


మారన్దేవన్ నిశ్శబ్దంగా “మహారాజా… రాజ వైద్యుని గది వెనుక ఒక రహస్య మార్గం ఉంది.”


ఆరయన్ ఆశ్చర్యంగా “రహస్య మార్గమా?”


మారన్దేవన్: “అవును. మనం ఇంత వరకూ చూడలేదు. అక్కడ రక్తపు మరకలు కూడా ఉన్నాయి. అంటే… అక్కడ ఎవరో హత్యచేసి ఉంటారు.


కరికాల కోపంగా “అంటే, రాజ వైద్యుడు హత్యకు గురయ్యాడా?”


మారన్దేవన్ తలనొగ్గి “అవును, మహారాజా. అది ఖచ్చితంగా కొత్తగా జరిగిన హత్య. అతని శరీరం లేదు, కానీ గది మొత్తం పోరాటం జరిగినట్టు ఉంది.”


గోవిందరాజు గంభీరంగా “ఇంతకీ, అసలు కుట్ర ఎవరిదీ?”


కరికాల తీవ్రంగా “నన్ను కూలదోసి, చోళ రాజ్యాన్ని పట్టుకోవాలనే శత్రువుల పన్నాగం. ఇది రాజభవనం లోపల ఉన్న కొందరి అనుభవం, తెలివితేటలతో నడిపిన కుట్ర”


అంతఃపురంలో మంత్రులు, సైనికులు ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు శత్రువు చాలా దగ్గరగా ఉన్నాడని కరికాల చోళుడు గ్రహించాడు.


కరికాల సింహాసనం వద్ద నిలబడి, తన అనుచరులను చూస్తూ మాటలు ప్రారంభించాడు.


కరికాల: "నా తండ్రి ఇలమ్సెట్చెన్ని చంపిన వారెవరో నేను తెలుసుకోవాలి. నా రాజ్యాన్ని బలహీనపరచాలని చూశారు. కానీ నేను తండ్రి లేని కుమారుడినే. కాని, నా రాజ్యం తండ్రి లేని అనాధ రాజ్యమయ్యేలా చేయను"

========================================================

ఇంకా వుంది..

కరికాల చోళుడు - పార్ట్ 34 త్వరలో

========================================================

ఎం. కె. కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: ఎం. కె. కుమార్


నేను గతంలో ఎప్పుడో కథలు, కవితలు వ్రాశాను. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నాను. నేను పీజీ చేశాను. చిన్న ఉద్యోగం ప్రైవేట్ సెక్టార్ లో చేస్తున్నాను. కథలు ఎక్కువుగా చదువుతాను.


🙏

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page