top of page
Original.png

కొత్త ఏమీ లేదు

Jul 15
2 min read

కొత్త ఏమీ లేదు, కొత్త విరిత, తెలుగు వ్యాసం, జీవిత చింతన, ప్రేరణాత్మక వ్యాసం, జీవన తత్వం, సానుకూల ఆలోచనలు, Motivation Telugu, Inspirational Telugu Article, Daily Life, Positive Thinking, Life Lessons

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అనుకున్నా... అంతే' వ్యాసంలో  మనసులో బాస్, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ధైర్యంగా మాట్లాడుతున్నట్లు ఊహించుకుంటూ, బయట మాత్రం ప్రశాంతంగా స్పందిస్తున్న యువకుడి ఆలోచనలను ప్రతిబింబించే దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అనుకున్నా... అంతే' వ్యాసంలో  మనసులో బాస్, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ధైర్యంగా మాట్లాడుతున్నట్లు ఊహించుకుంటూ, బయట మాత్రం ప్రశాంతంగా స్పందిస్తున్న యువకుడి ఆలోచనలను ప్రతిబింబించే దృశ్యం.

Kottha Emee Ledu - Telugu Inspirational Article | Kotha Viritha

కొత్త ఏమీ లేదు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 15/07/2026


జీవితంలో ప్రతిరోజూ ఏదో కొత్త అద్భుతం జరగాలని మనసు కోరుకుంటుంది. కానీ నిజానికి ప్రతి రోజూ కొత్త సంఘటనలు కాకుండా, పాత క్షణాల్లో కొత్త అర్థాన్ని కనుగొనడమే జీవితం. "కొత్త ఏమీ లేదు" అనే ఈ ఆలోచనాత్మక రచన మన రోజువారీ జీవితాన్ని మరో కోణంలో చూసేలా చేస్తుంది.


అలారం పెట్టుకున్న టైమ్ కన్నా ముందే మెలకువ వచ్చింది...

కొత్త ఏమీ లేదు.


చేయాల్సిన పనులు, కట్టాల్సిన భోజనం డబ్బాలు, తిన్న టిఫిన్ ప్లేట్లు...కొత్త ఏమీ లేదు.


పువ్వులు అమ్మే సరస్వతి, రోడ్లు ఊడ్చే మున్సిపాలిటీ, పిల్లల కోసం వచ్చిన స్కూల్ బస్సు, బండి మీద అరటిపండ్లు అమ్మే వాడు, హడావిడిగా ఉన్న రోడ్డు...

కొత్త ఏమీ లేదు.


రాత్రి కొంత కురిసాను కదా, మళ్లీ చూద్దాం లే అని వెళ్లిపోతున్న మబ్బులు...ఒక్క రెండు నిమిషాలు లేట్ అయితే ట్రాఫిక్ పెరిగిపోతుందని పరుగులు తీసే ఉద్యోగులు...కొత్త ఏమీ లేదు.


అదే ట్రాఫిక్... అదే హారన్ మోత…


రోడ్డుకు అడ్డంగా నిలిపిన వాహనం..."ఏమీటిది?" అని గొడవపడేవాళ్లు…


"నాకెందుకులే!" అని వెళ్లిపోయేవాళ్లు...కొత్త ఏమీ లేదు అదే ల్యాప్‌టాప్... అవే మీటింగులు...అదే లంచ్... అదే లాగౌట్ టైమ్...కొత్త ఏమీ లేదు.


కానీ...ప్రతి రోజూ ఏదో అద్భుతం జరగాలని ఆశించడం కూడా ఒక వ్యసనమే.ప్రతి ఉదయం కొత్త కథ మొదలవదు.ప్రతి రోజు కొత్త మనుషులు ఎదురవరు.


ప్రతి సాయంత్రం కొత్త అనుభూతి రాదు.జీవితం సినిమా కాదు ప్రతి సీన్‌లో ట్విస్ట్ ఉండటానికి.మనం "కొత్త" కోసం వెతుకుతూ... "ఉన్నది" చూడడం మానేశాం.


అదే అమ్మ చేసిన కాఫీలో ప్రేమ కొత్తగా ఉంటుంది.అదే పిల్లల నవ్వులో ఆనందం కొత్తగా ఉంటుంది.అదే సూర్యోదయంలో రంగు కొత్తగా ఉంటుంది.


అదే వానలో వాసన కొత్తగా ఉంటుంది.బోరింగ్ అనిపించేది జీవితం కాదు,ప్రతి రోజూ సంచలనం కావాలనే మన అంచనాలు.


కొత్త ఏమీ ఉండదు, అయినా రోజు కొత్తగా ఉండదు అనుకున్నప్పుడే

"కొత్త ఏమీ లేదు" అనే మాట కూడా," ప్రతి రోజూ జీవించడానికి ఎంత ఉందో!" అనే అనుభూతిగా మారిపోతుంది.


ఇదంతా నేను కొత్తగా ఏమీ చెప్పటం లేదు


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత
కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Excellent write up 👌 👌 👌 👌

Like

Rated 5 out of 5 stars.

నైస్ 👍

Like
bottom of page