లాస్ట్ పంచ్ మనదైతే
- Kotha Viritha

- Jun 12
- 2 min read
Updated: Jun 15
self-reflection article, life lessons telugu, motivational article telugu, relationship understanding, communication skills, family relationships, office relationships, conflict resolution, emotional intelligence, personal growth, Telugu inspirational article, positive thinking, life philosophy, mutual understanding, Telugu web article, human psychology, meaningful discussions

Last Punch manadaithe - Telugu Inspirational Article | Kotha Viritha
లాస్ట్ పంచ్ మనదైతే - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 12/06/2026
జీవితంలో ప్రతి ఒక్కరికీ తమ చర్యలకు, నిర్ణయాలకు ఒక కారణం ఉంటుంది. కుటుంబంలో, ఉద్యోగంలో, స్నేహాల్లో... చాలాసార్లు అసలు సమస్య కంటే ఎవరి మాట చివరిది అన్నదే ముఖ్యమైపోతుంది. కానీ ప్రతి వాదనలో గెలవడం నిజమైన విజయం కాదు. పరస్పర అవగాహన, వినగలిగే మనసు, సంబంధాలను కాపాడుకునే పరిపక్వతే జీవితాన్ని అందంగా మారుస్తాయి. "లాస్ట్ పంచ్ మనదైతే" అనే ఈ ఆలోచనాత్మక వ్యాసం మనిషి మనస్తత్వాన్ని సరదాగా విశ్లేషిస్తూ విలువైన జీవిత పాఠాన్ని అందిస్తుంది.
ప్రతి విషయానికీ ప్రతి ఒక్కరి దగ్గర ఒక వివరణ ఉంటుంది.
ముఖ్యంగా, ప్రతి ఒక్కరికీ చివరి మాట తమదే కావాలని ఉంటుంది.
కూరలో ఉప్పు ఎందుకు ఎక్కువ అయింది అని అడగటానికి భర్త దగ్గర ఒక కారణం ఉంటుంది.
రోజంతా ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, వంట పనుల మధ్య పొరపాటున ఉప్పు ఎందుకు ఎక్కువ అయిందో చెప్పటానికి భార్య దగ్గర కూడా ఒక కారణం ఉంటుంది.
అక్కడ అసలు విషయం ఉప్పు కాదు.
ఎవరి వివరణ బలంగా ఉందన్నదే ముఖ్యం అవుతుంది.
చివరికి ఎవరిది చివరి డైలాగ్ అయితే, వారే గెలిచినట్లు భావిస్తారు.
ఆఫీసులో కూడా ఇదే కథ.
రిపోర్ట్ చూసి "ఎందుకు ఆలస్యమైంది?" అని అడగటానికి మేనేజర్ దగ్గర ఒక కారణం ఉంటుంది.
సమయానికి పని పూర్తి కావాలని అతని బాధ్యత.
అదే సమయంలో, టెక్నికల్ సమస్యలు, డిపెండెన్సీలు, అనుకోని అడ్డంకుల వల్ల పని ఎందుకు ఆలస్యం అయిందో వివరించటానికి ఉద్యోగి దగ్గర కూడా ఒక కారణం ఉంటుంది.
ఇక్కడ కూడా అసలు సమస్య కంటే, ఎవరి వాదన చివరి వరకు నిలబడుతుందన్నదే పెద్ద విషయం అవుతుంది.
ఇలా చూస్తే జీవితమంతా కారణాల చుట్టూనే తిరుగుతుంది.
భర్తకు ఒక కారణం, భార్యకు ఒక కారణం.
మేనేజర్‌కు ఒక కారణం, ఉద్యోగికి ఒక కారణం.
తల్లిదండ్రులకు ఒక కారణం, పిల్లలకు ఒక కారణం.
ఎవ్వరూ తమను తాము తప్పు అని అనుకోరు.
ఎందుకంటే ప్రతి మనిషి తన కోణంలో సరైనవాడే.అందుకే చాలాసార్లు చర్చలు సమస్యను పరిష్కరించటానికి కాకుండా, చివరి మాట చెప్పటానికి సాగుతాయి.
సినిమాల్లో హీరో అందరూ మాట్లాడాక ఒక పంచ్ డైలాగ్ చెబితే థియేటర్ మొత్తం చప్పట్లతో మారుమోగుతుంది.
"లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా!" అనిపిస్తుంది.
కానీ నిజ జీవితంలో ప్రతి వాదనను గెలవాల్సిన అవసరం లేదు.కొన్ని సందర్భాల్లో చివరి మాట కంటే, ఎదుటివారి మాట వినడమే గొప్ప విజయం.ఎందుకంటే సంబంధాలను నిలబెట్టేది వాదనలో గెలుపు కాదు, పరస్పర అవగాహన.
"చివరి మాట చెప్పడంలో కిక్ ఉంటుంది... కానీ అవసరం లేని చోట ఆగిపోవడంలో క్లాస్ ఉంటుంది."
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
***************************************
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
250 కి పైగా శీర్షికలు,కథలు,100 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్, టెక్ మహీంద్రా లో చేస్తున్నాను.




"Beautifully written. The characters and emotions were portrayed very well. Keep up the good work!"
బాగుందమ్మా... అన్ని ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఇదే తంతు. వాదనల్లో నిజం కంటే స్థాయితో వచ్చే డాంబికమే చెల్లుతుంది ఎవరి కారణాలు వారికి ఉన్నా...
Nice and Super writings so far Viritha gaaru
Superb