top of page
Original.png

నీలి మేఘాలలో ఎస్ జానకి


పెళ్లి వేడుకలో అభిమానితో చిరునవ్వుతో మాట్లాడుతున్న గానకోకిల ఎస్. జానకి

Dayaleni Danam- Telugu Emotional Article | Penumaka Vasantha

నీలి మేఘాలలో ఎస్ జానకి - తెలుగు భావోద్వేగ వ్యాసం | పెనుమాక వసంత

Published In manatelugukathalu.com On 24/08/2026


తెలుగు సినీ సంగీత చరిత్రలో తన మధుర గానంతో చెరగని ముద్ర వేసిన గానకోకిల ఎస్. జానకి కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు, నిరాడంబరతకు, వినయానికి ప్రతిరూపంగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం. ఆమెను ఒక పెళ్లి వేడుకలో ప్రత్యక్షంగా కలిసిన సందర్భాన్ని పెనుమాక వసంత ఈ రచనలో ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు. ఆటోగ్రాఫ్ అడిగిన అభిమానులను చిరునవ్వుతో పలకరించిన తీరు, తన పాటల గురించి చెప్పినప్పుడు చూపిన సహజత్వం, జీవితంలో ఎన్నో అఘాతాలు ఎదురైనా నిండుకుండలా ప్రశాంతంగా నిలిచిన వ్యక్తిత్వం—ఇవన్నీ రచయిత జ్ఞాపకాల ద్వారా మన ముందుకొస్తాయి. సంగీతానికి ఆమె చేసిన సేవతో పాటు, “ఎంత ఎత్తుకు వెళితే అంత ఒదిగి ఉండాలి” అనే విలువను తన జీవితంతోనే చూపించిన ఎస్. జానకికి ఈ రచన ఒక ఆత్మీయ నివాళి.


అవి నేను ఇంటరైపోయి డిగ్రీ చేరే సెలవుల్లో మా పెద్దమ్మగారి అమ్మాయి పెళ్ళి చెన్నైలో జరిగింది. ఆ పెళ్ళికి పాటలు పాడే లెజెండరీ సింగరు, శ్రీమతి ఎస్. జానకి గారు వచ్చారు, వాళ్ల శ్రీవారితో కలిసి. పెద్ద బొట్టు, వి-నెక్ జాకెట్ పట్టుచీర. ఎంత సింపుల్గా ఉన్నారో. ఆవిడ లెవెల్కి సొమ్ములతో రావచ్చు. ఏమి లేవు ఒంటి మీద. నేను ఆవిడ పక్కనే కూర్చున్నా. అందరూ ఆవిడ దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు. అందరికీ చిరునవ్వుతో ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు.


నేను ఆవిడను చూస్తూ ఉన్నాను. అందరూ ఆవిడ దగ్గరికి వచ్చి స్టేజ్ మీద ఒక పాట పాడండి అంటే "గొంతు బాగాలేదు, ఏమనుకోవద్దు" అన్నారు. నేను ఆవిడతో "సిరిమల్లెపూవా! పాట నాకు ఇష్టం. ఎంత బాగా పాడారో" అంటే "అవునా!" అని నవ్వేరు. "నేను మీ ఫ్యాన్ను, సీతాకోకచిలుక, సాగరసంగమంలో పాటలు ఎపుడూ టేప్ రికార్డర్లో వింటూ వుంటాను" అనగానే "థాంక్స్" అన్నారు.


అపుడు నాకు 'అన్నీ ఉన్న ఇస్తరి అణిగిమణిగి ఉంటుందన్న' సామెత గుర్తుకొచ్చింది. ఆవిడతో ఫోటో దిగలేదు. అపుడు అంత ఆలోచన రాలేదు. ఇవాళా టీవీ పెట్టగానే ఎస్. జానకి కన్నుమూత అనగానే... పై జ్ఞాపకాలు నా కళ్ళ ముందు కదలాడాయి. ఎంత ఆస్తి ఉందనేది కాదు, సంతోషంగా జీవించామా లేదా అనేది ముఖ్యం. ఆవిడ జీవితములో ఎన్నో అఘాదాలు ఉన్నాయి. అయినా నిండుకుండ వలె తొణికిసలాడకుండా ఉండటం అది ఆమెకే చెల్లు.


సంగీతంలో ఒక ఉన్నత మేరు శిఖరం నేలకు ఒరగటం బాధగా అనిపించింది. ఎంత ఎత్తుకు వెళితే అంత ఒదిగి వుండాలనే మహోన్నతమైన వ్యక్తిత్వం ఆమెది. పాపం కొడుకు పోయిన తర్వాత ఆవిడ ఆరు నెలల కన్నా ఉండలేకపోవటం చాలా దురదృష్టకరం. అంత దుఃఖంలో కూడా అభిమానుల్ని చిరునవ్వు చిందిస్తూ వారి పాటలను ఆస్వాదించటం అది ఆమెకే చెల్లింది.  


ఆవిడ ఎక్కడ పుట్టారు లాంటి విషయాలు చెప్తూ ఉంటే.. ఆసక్తిగా టీవీ వైపు చూసాను. ఆవిడ 1938 ఏప్రిల్లో పల్లపట్లలో జన్మించారు. తమిళ సినిమా విధియిన్ విలయాట్టు అనే సినిమాతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. తెలుగులో మొదట విషాద గీతాలతో ప్రయాణం కొనసాగించారు. తర్వాత అన్ని రకాల పాటలు పాడి జనాలను మైమరపింప చేసారు.  


తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఒరియా, పంజాబీ, బుడుగు ఇలా ఎన్నో భాషల్లో యాభైవేలకు పైగా పాటలు పాడారు. అయినా ఎంత నిరాడంబరంగా ఉండేవారు. నాలుగుసార్లు జాతీయ అవార్డులు, ముప్పైపైగా నంది అవార్డులు అందుకున్నారు. బొమ్మలాగా ఒకే చోట కదలకుండా పాటలు పాడేవారు. ఆవిడ పాడిన పాటలు ఈ తరానికి ఒక మకుటం లాంటివి.


అవి పాడితే... వాళ్ళు పాటల్లో పీహెచ్‌డీ చేసినట్లే.  

ఆవిడ చివర ఇచ్చిన ఇంటర్వ్యూలో "నేను ఏంటో తెలుసుకోవాలి. నాలో ఉన్న పరమాత్మను తెలుసుకోవాలి. అపుడే నేను సార్థకత సాధించినట్లు" అని చెప్పారు. అభిమానులను ఆవిడ గౌరవించే పద్ధతిని చూస్తే... నిజంగా ఆవిడ పరమాత్మను దర్శించినట్లే. అమ్మా గానకోకిల, నీ పాటలతో మాకు అమృతాన్ని పంచావు. ఇక పైలోకంలో గానామృతాన్ని పంచడానికి వెళ్ళావు. వాళ్ళు అదృష్టవంతులు, మేము దురదృష్టవంతులం.


పెనుమాక వసంత గారి కొన్ని ఇతర రచనలు:




పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం


  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

Penumaka Vasantha

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page