top of page
Original.png

చెప్పీ చెప్పీ… చివరికి చుప్!


ఒకరు చెబుతూనే ఉన్నారు — మరొకరు అర్థం చేసుకోనట్టే ఉన్నారు

Cheppi Cheppi Chivariki Chup Telugu Inspirational Article | Kotha Viritha

చెప్పీ చెప్పీ… చివరికి చుప్! తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 23/08/2026


కొంతమందికి విషయం అర్థం కాక కాదు… అర్థం చేసుకోవాలనే ఆలోచన లేక! ఒక్కసారి చెప్పినా వినరు, రెండుసార్లు చెప్పినా పట్టించుకోరు, మూడుసార్లు చెప్పినా మళ్లీ అదే ప్రశ్న అడుగుతారు. ఉదాహరణ ఇస్తే మరో విషయం, ఆధారం చూపిస్తే మరో అభిప్రాయం, ప్రశాంతంగా చెబితే “ఎక్కువగా ఆలోచిస్తున్నావు” అంటారు. చివరికి వివరించేవాడి ఓపికే రాజీనామా చేస్తుంది!



నీకు అర్థం కాదు అని నాకు అర్థం అయ్యాక, ఎంత అర్థవంతంగా చెప్పినా

అది అంతా దండగే కదా!


ఒక్కసారి చెప్పాను... వినలేదు, 

రెండుసార్లు చెప్పాను... పట్టించుకోలేదు, 

మూడుసార్లు చెప్పాను... మళ్లీ అదే ప్రశ్న, 

నాలుగోసారి చెప్పేలోపే

నా ఓపికే పెట్టింది రాజీనామా!


మాట చెబితే మాట మీద మాట, విషయం చెబితే మరో కొత్త వింత, సమాధానం ఇస్తే ఇంకో సందేహం, 

చివరికి నా పరిస్థితి 

“ఇది సంభాషణా? లేక ప్రశ్నాపత్రం?”


కొంతమందికి విషయంఅర్థం కాక కాదు, అర్థం చేసుకోవాలనే ఆలోచన లేక!

నువ్వు ఉదాహరణ ఇస్తే, “అది వేరే విషయం!”

నువ్వు ఆధారం చూపిస్తే, 

“అది నీ అభిప్రాయం!”

నువ్వు ప్రశాంతంగా చెబితే, 

“నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు!”

చివరికి నువ్వే మౌనంగా ఉంటే “ఏంటి? కోపమా?”


అయ్యో బాబోయ్…మాటకో మలుపు, మలుపుకో ప్రశ్న, 

ప్రశ్నకో వాదన, 

వాదనకో కొత్త కథనం!


అర్థం చేసుకునే మనసుంటే

అరమాట చాలు.అర్థం చేసుకోకూడదనే నిర్ణయముంటే

వేదాంతం చెప్పినా వాదనే, 

విజ్ఞానం చెప్పినా సందేహమే!


కొన్ని విషయాలకు వివరణ అవసరం లేదు, 

కొంతమందికి వివరణ ఇవ్వడం అవసరం లేదు.


ఎందుకంటే…

చెప్పీ చెప్పీ… చివరికి చుప్!


మాట పెరుగుతుంది, 

మైండ్ తిరుగుతుంది, 

ఓపిక కరుగుతుంది, 

మనం అలసిపోతాం…


వాళ్లు మాత్రం చివరికి

అదే అమాయకమైన ముఖంతో

“నాకేం అర్థం కాలేదు!” 


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Kishan Kotha
Kishan Kotha
40 minutes ago
Rated 5 out of 5 stars.

అర్థం చేసుకునే మనసుంటే

అరమాట చాలు.అర్థం చేసుకోకూడదనే నిర్ణయముంటే

వేదాంతం చెప్పినా వాదనే,

విజ్ఞానం చెప్పినా సందేహమే......

వండర్ఫుల్

Like
bottom of page