పడి పడి....
- Kotha Viritha

- 1 hour ago
- 2 min read

Padi Padi - Telugu Inspirational Article | Kotha Viritha
పడి పడి.... - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 22/08/2026
ఒకప్పుడు జాబ్ కావాలంటే మినిమం డిగ్రీ, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం ఉంటే చాలు.అవి ఉంటే ఉద్యోగం వచ్చేది… వచ్చాక నేర్చుకోవడం మొదలయ్యేది.
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది చదివేది ఒకటి, చేసేది ఇంకోటి. చదివిన డిగ్రీని చూస్తే ఉద్యోగం నవ్వుతుంది, ఉద్యోగాన్ని చూస్తే డిగ్రీ ఏడుస్తుంది!
పోనీ ఉద్యోగంలోకి వెళ్లాకైనా ప్రశాంతంగా ఉంటామా అంటే అదీ లేదు.మార్కెట్ డిమాండ్స్ నగర వాతావరణంలా ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికీ తెలియదు!
నిన్నటి వరకు ఒక కోర్సు ట్రెండ్… ఈరోజు ఇంకో కోర్సు తప్పనిసరి.ఒక టెక్నాలజీ నేర్చుకునేలోపే, దాని స్థానంలో ఇంకో కొత్త టెక్నాలజీ వచ్చేస్తుంది.
“ఇది కూడా నేర్చుకోవాలి” అనే మాట ఉద్యోగ జీవితంలో శాశ్వత సభ్యత్వం తీసుకుంది.ఉద్యోగం కోసం ఎంత పడి పడి చదివినా,కోర్స్ చేస్తూ పడి… సర్టిఫికేట్ తీసుకుంటూ పడి… కొత్త స్కిల్ కోసం మళ్లీ పడి నేర్చుకోవాల్సిందే.ఇక పాత తరం పరిస్థితి మరీ ఘోరం.ఒకప్పుడు ఉద్యోగం కోసం చదివిన వాళ్లు, ఇప్పుడు ఉద్యోగం నిలబెట్టుకోవడానికి మళ్లీ చదువుతున్నారు.వచ్చే తరంతో పోటీ పడాలంటే వయసు కాదు, అప్‌డేట్ అవుతున్న స్పీడ్ ముఖ్యం.పిల్లలు కొత్త టెక్నాలజీని ఆటలా నేర్చుకుంటుంటే, పెద్దవాళ్లు “ఇది ఎక్కడ క్లిక్ చేయాలి?” అని వెతుకుతున్నారు!
అయినా ఆగే అవకాశం లేదు… ఎందుకంటే మార్కెట్ ఆగదు, టెక్నాలజీ ఆగదు, పోటీ ఆగదు, బ్రతుకూ ఆగదు.
ఇదే కాలం చెప్పే నిజం ఉద్యోగం పొందడం ఒకప్పుడు చదువుతో పూర్తయ్యేది… ఇప్పుడు ఉద్యోగంలో ఉండటానికే చదువు ఎప్పటికీ పూర్తికాదు!
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.






Comments