వెధవే
- Kotha Viritha

- 5 hours ago
- 2 min read

Vedhave - Telugu Inspirational Article | Kotha Viritha
వెధవే - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 24/08/2026
“ప్రతి ఫ్రెండ్ వెధవే!” అని తల్లిదండ్రులు సరదాగా అంటుంటారు. కానీ ఆ వెధవలతోనే మన జీవితంలోని అతి అందమైన నవ్వులు, అల్లరి జ్ఞాపకాలు, రాత్రివేళల సంభాషణలు, చెప్పుకోలేని రహస్యాలు, కష్టాల్లో దొరికే అండ అన్నీ ముడిపడి ఉంటాయి. ప్రపంచం మొత్తం మనల్ని అర్థం చేసుకోకపోయినా, ఒక నిజమైన ఫ్రెండ్ “ఏమైంది?” అని అడిగితే మనసు కొంచెం తేలిక అవుతుంది.
ప్రతి ఫ్రెండ్ వెధవే… మన తల్లితండ్రుల నుండి వినే అతి సాధారణం మాట. కానీ అదే మన జీవితానికి అదృష్టం అని దాని వెనుక ఎంత ప్రేమ, ఎంత అనుబంధం దాగి ఉందో మనకి మాత్రమే తెలుసు.
ఫ్రెండ్స్ అంటే సీరియస్‌గా ఉండే సంబంధం కాదు, అది పిచ్చి నవ్వులతో, అర్ధం లేని మాటలతో, అల్లరి జ్ఞాపకాలతో నిండిన ఒక ప్రత్యేకమైన బంధం. వాళ్లతో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో అలా ఉండగలుగుతాం, ఎలాంటి నటన లేకుండా, ఎలాంటి ముసుగు లేకుండా. మన కష్టాల్లో మనం మౌనంగా ఉన్నా… వాళ్లు మన కళ్లలోని బాధని ఇట్టే చదివేస్తారు.
ప్రపంచం మొత్తం మనల్ని అర్థం చేసుకోకపోయినా ఒక ఫ్రెండ్ “ఏమైంది” అని అడిగితే చాలు మనసు కొంచెం తేలిక అవుతుంది.
ఎన్ని సిల్లీ పనులు చేసినా, అదే గుర్తొచ్చి మనం నవ్వుకుంటాం.
అర్ధం లేని జోక్స్, రాత్రి వరకు మాట్లాడిన ఫోన్స్, ఎన్ని సార్లంటే అన్నిసార్లు కలిసి తాగిన టీ లు, ఎవరికీ చెప్పలేని సీక్రెట్లు ఇవన్నీ ఫ్రెండ్స్‌తోనే పంచుకుంటాం.
జీవితంలో ఎంత దూరం వెళ్లినా ప్రతి ఒక్కరు తమ తమ దారిలో నడిచినా ఒక చిన్న మెసేజ్, ఒక కాల్ చాలు, ఆ బంధం మళ్లీ అదే స్థాయిలో దగ్గర అవుతుంది.
ప్రతి ఫ్రెండ్ మన జీవితంలో ఒక కథ. కొంతమంది నవ్వులు నేర్పిస్తారు, కొంతమంది సహనం నేర్పిస్తారు. మరికొందరు మనకి మనమే ఎంత ముఖ్యమో గుర్తు చేస్తారు. కష్టకాలంలో పక్కన నిలిచే వాళ్లే నిజమైన ఫ్రెండ్స్.
సంతోషాల్లో కలిసి నవ్వేవాళ్లు చాలా మంది ఉంటారు కానీ కష్టాల్లో మన చేతిని పట్టుకుని నిలబెట్టేవాళ్లు చాలా అరుదు.
అందుకే ఈ ప్రపంచానికి
“ప్రతి ఫ్రెండ్ వెధవే” అనిపించినా,
ఆ వెధవలే మన జీవితాన్ని అందంగా మార్చే నిజమైన సంపదలు.
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.






Comments