top of page
Original.png

మహా అయితే ఏం చేస్తారు?

4 hours ago
2 min read

“అంటే… మరి!” తెలుగు రచనకు సంబంధించిన చిత్రం. ఒక మహిళ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు బయటకు చిరునవ్వుతో కనిపిస్తున్నప్పటికీ, ఆమె మనసులో చెప్పలేని అనేక భావాలు, మాటలు తిరుగుతున్నట్లు ప్రతీకాత్మకంగా చూపించారు. మొహమాటంతో మనసులోని మాటను చెప్పకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చనే భావాన్ని చిత్రం సూచిస్తుంది.

Maha Ayithe Em Chestharu - Telugu Inspirational Article | Kotha Viritha

మహా అయితే ఏం చేస్తారు? - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 06/10/2026


ఇతరుల వ్యాఖ్యలకు భయపడకుండా అపజయాన్ని దాటి ముందుకు సాగాలనే సందేశాన్ని సరదా వ్యంగ్యంతో చెప్పే కొత్త విరిత రచన “మహా అయితే ఏం చేస్తారు?”




మనిషి ఓడిపోయాడంటే చాలు… చుట్టూ సలహాలు చెప్పేవాళ్లు తయారైపోతారు.

“అప్పుడే చెప్పాను కదా!” అంటూ అందరూ పెద్ద తెలివైన వాళ్లలా మాట్లాడతారు.

ఎక్కడ తప్పు జరిగిందో చెప్పడానికి మాత్రం అందరికీ చాలా ఆసక్తి.

ఎందుకంటే "అది" మన ఓటమి కాదు కదా… మనకెందుకు బాధ!


పడిపోయినవాడిని లేపడం కంటే,“ఎలా పడిపోయావో నాకు ముందే తెలుసు” అని చెప్పడం చాలా సులువు. ఇతరుల తప్పులు చెప్పడంలో అందరూ ముందుంటారు, తమ తప్పులు వస్తే మాత్రం కారణాలు సిద్ధంగా ఉంటాయి. 


వాడి తప్పు అయితే “వాడి తప్పు”…

మనది అయితే “పరిస్థితుల తప్పు!”


ఒకరి ఓటమి కొందరికి నవ్వు…

ఇంకొందరికి టీ టైమ్ చర్చ.


“వాడు పనికిరాడు” అని చెప్పడం చాలా సులువు. అదే మాట మన గురించి ఎవరైనా అంటే మాత్రం వెంటనే బాధ మొదలవుతుంది.


నిజానికి ఓడిపోయినవాడికి ఆ సమయంలో పెద్ద సలహాలు అవసరం లేదు.

“పర్లేదు… మళ్లీ ప్రయత్నించు” అనే చిన్న మాట చాలు.


మొత్తానికి అనేవాళ్ళు మనుషులే.

మనుషులకు తెలిసిన మొదటి విద్య, "మాట్లాడటం".

సో....మహా అయితే నాలుగు మాటలు మాట్లాడుతారు…

తర్వాత మర్చిపోతారు.


***

కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page