top of page

మత్తు వదలరా

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Matthu Vadalara' Written By Kidala Sivakrishna

రచన: కిడాల శివకృష్ణ

వ్యాధి సోకిన మనిషి తనే ఆ బాధను అనుభవిస్తాడు.

వ్యసనానికి లోనైన వ్యక్తి తనతో పాటు, తన కుటుంబాన్ని కూడా బాధ పెడతాడు. బలి తీసుకుంటాడు.

ఆ మత్తు వల్ల జీవితాలు ఎలా బలవుతాయో చెప్పే ఈ కథను యువ రచయిత కిడాల శివకృష్ణ గారు రచించారు..

‘పాపం ఆ అమ్మాయి ఉరి వేసుకుని చనిపోయినట్టు ఉంది, అని అందరూ అంటూ ఉన్నారు కానీ ఆ విధంగా జరగడానికి కారణం ఏమిటి అని ఏ ఒక్కరూ ఆలోచించరే, ఈ అమ్మాయి లాగా ఎంత మంది ఉరి వేసుకుని మరణిస్తున్నారో’ అని వీరయ్య బాధ పడుతూ ఉంటే,

వీరయ్య మనవడు రోహిత్, మనవరాలు సుజిత ఇద్దరూ వచ్చి “ ఏం తాతయ్యా బాధపడుతున్నావు? ఎందుకు, ఏం జరిగింది” అని ప్రశ్నించారు.

“ఏమీ లేదు రా! ఆ అమ్మాయి చనిపోయింది కదా… అందుకని” అన్నాడు తాతయ్య.

“ఆ అమ్మాయి చనిపోయింది అని నువ్వు బాధపడటం ఏమిటి? అర్థం కాలేదు” అన్నాడు రోహిత్.

“అంటే ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలి అవుతున్నారు అని బాధపడుతున్నాను రా రోహిత్”

అన్నాడు తాతయ్య.

“ఎవరు చేసిన పనికి ఎవరు బలి అవుతున్నారు తాతయ్యా? కాస్త వివరంగా చెప్పు” అంది సుజిత.

“అదేనమ్మా! మన ఊరి నీళ్ళ ట్యాంక్ దగ్గర ఉంది చూడు ఒక ఇల్లు… ఆ ఇంటిలో శివయ్య అనే వ్యక్తి కుటుంబం ఉంది. ఆయనకు పెళ్లి అయిన చాలా సంవత్సరాలకు ఒక్కటే కూతురు పుట్టింది. ఆ అమ్మాయికి పట్టుమని పద్దెనిమిది సంవత్సరాలు కూడా లేవు కానీ ఇంటి బాధ్యతను

భుజానికి ఎత్తుకుని సంసారాన్ని సాగిస్తుండేది. చదువుతూ జీవితాన్ని ఆట పాటలతో సంతోషంగా గడపాల్సిన వయస్సులో, ప్రతి రోజూ పనికి వెళ్లి, వచ్చిన డబ్బును ఇంట్లో తన తల్లికి ఇచ్చేది. తరువాత ఇంట్లో అల్లికలు అల్లడం, కుట్టు పనులు చేయడం ద్వారా వచ్చిన డబ్బులు కూడా ఇంట్లోకి ఇచ్చేది. ఆ డబ్బులను వాళ్ళ అమ్మ ఇంటిలో డబ్బాలో ఉంచ్చేది. ఆ డబ్బులను వాళ్ళ నాన్న తీసుకొని వెళ్లి మద్యం దుకాణంలో తగలెట్టేవాడు” అన్నాడు తాతయ్య.

“మరి ఆ అక్క చదువుకొని ఉంటే ఉద్యోగం చేసేది. జీవితం మంచిగా ఉండేది కదా తాతయ్యా? మరి ఎందుకు చదువుకోలేదు ఆ అక్క?” అన్నాడు రోహిత్.

“అరే! ఎక్కడ చదువుకోనిచ్చేవాడు రా వాళ్ళ నాన్న! ఆరో తరగతి వరకో, ఏడో తరగతి వరకో చదువుకుంది. అప్పటికే వాళ్ళ నాన్న పూర్తిగా మత్తుకు బానిస కావడంతో ఆ అమ్మాయిని కొట్టడం, తిట్టడం చేసేవాడు. పనికి పొమ్మని బెదిరించేవాడు. అందువల్ల ఆ అమ్మాయి బడికి పోవడం మాని, పనికి వెళ్తుంది” అన్నాడు తాతయ్య.

“మరి చనిపోవాల్సిన అవసరం ఏమి వచ్చింది ఆ అక్కకు” అంది సుజిత.

“ఏమి చేస్తాం.. విధి వైపరీత్యం! తన తండ్రి ప్రతి రోజూ తిట్టడం, కొట్టడం వల్ల మనఃశాంతి కోల్పోయింది. అంతేకాకుండా ఇరుగు పొరుగు వారు సూటి పోటి మాటలు అనడం వల్ల పూర్తిగా మనస్తాపనికి గురి అయ్యే సరికి దిక్కు తోచని స్థితిలో ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిసింది. అదే తన తండ్రి సక్రమంగా ఉండి ఉంటే ఆ అమ్మాయి చదువుకునేది, పెళ్లి చేసుకునేది, ఆమె జీవితం ప్రశాంతంగా, సంతోషంగా, అందంగా ఉండేది కదా.

ఈ విధంగానే చాలా కుటుంబాలు మత్తు వల్ల రోడ్డున పడుతున్నాయి, అనేక కుటుంబాలకు శోకం తప్ప మరేమీ మిగలడం లేదు. ఎంతో మందిని అనాధలుగా మారుస్తుంది ఈ మత్తు. అంతే కాకుండా ఎన్నో కుటుంబాలు తోడు లేక, నిరాశ్రయులుగా మారి మధ్యలోనే తమ జీవితాలని చాలించాల్సి వస్తుంది. ఈ మత్తు వల్ల ఎందరో ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి,

అందుకనే పిల్లలకు పెద్దలు ‘చెడు వ్యసనాలకు అలవాటు పడకండి’ అని.చెబుతూ ఉంటారు. తరువాత పిల్లలు ఏమైనా చెడు పనులు చేస్తున్నారు అని తెలిసినా చెడు వ్యసనాలకు లోనయ్యారు అని తెలిసినా మందలించేది అందుకే” అన్నాడు తాతయ్య.

“సరే తాతయ్యా! మేము చెడు వ్యసనాలకు లోను కాము” అన్నాడు రోహిత్.

“సరే! మీరు వెళ్లి సరదాగా కాసేపు ఆడుకొని రండి” అంటూ చెప్పి పంపాడు తాతయ్య.

సరే అని పిల్లలిద్దరూ ఆట ప్రాంగణానికి వెళ్లిపోయారు.

"సర్వే జనా సుఖినోభవంతు"

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం :

నా పేరు: కిడాల శివకృష్ణ.

వెంగల్లాంపల్లి గ్రామం, ప్యాపిలి మండలం, కర్నూలు జిల్లా. వ్యవసాయ పనులు చేస్తూ కాలీగా ఉన్నపుడు కవితలు రాస్తూ ఫేస్ బుక్ లో పెడుతూ ఉండేవాడిని. మీ కథల పోటీలు చూసిన తరువాత కథలు రాయడం మొదలు పెట్టాను.

నా కథలను మీరు ఆదరిస్తారు అని ఆశిస్తున్నాను.


Comments


bottom of page