మౌనం అర్దాంగీకారమేనా

Maunam Ardhangikaramena - Telugu Social Family Story | Harish Babu Pondugula
మౌనం అర్దాంగీకారమేనా - తెలుగు సామాజిక కుటుంబ కథ | హరీష్ బాబు పొందుగుల
Published in manatelugukathalu.com on 11/09/2026
“మౌనం అర్థాంగీకారమేనా...” అనే ఈ కుటుంబ సామాజిక కథ దాంపత్య జీవితంలో మాట్లాడుకోకపోవడం ఎంత పెద్ద సమస్యగా మారుతుందో చూపిస్తుంది. పరస్పర అవగాహన, స్వేచ్ఛ, ముఖ్యంగా మనసు విప్పి మాట్లాడుకోవడం కూడా.
"అమ్మా... నేను మా ఇంటికి వచ్చి ఒక పది రోజులు ఉండనా..!!" అంటూ పొద్దున్నే ఫోన్ చేసిన రాణి గొంతులో ఏదో తేడా అనిపించింది జానకమ్మకి...
"ఏంటే పొద్దున్నే ఫోన్ చేశావ్... అంతా బాగానే ఉంది కదా... అల్లుడు ఎలా ఉన్నాడు..."
రాణికి ఆనంద్ తో పెళ్లైంది... వాళ్లిద్దరూ అత్తయ్య మావయ్యతో కలిసి ఉంటున్నారు...
చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా పెరిగిన రాణికి ఆ వాతావరణంలో ఉండాలంటే ఏదో ఇబ్బందిగా అనిపించేది... అందుకే ఆనంద్ తో కూడా అంటిముట్టనట్టు ఉండేది...
ఎప్పుడూ ఏదో మౌనంలో ముభావంగా ఉండేది... ఇంటి దినచర్య చేస్తూ ఉండేది... వంట, బట్టలు ఉతకటం, ఇల్లు చక్కబెట్టటం... ఏ పని చేసినా అందులో జీవం ఉండేది కాదు.
ఆనంద్ రాణిని ఎంత అడిగినా ఏ సమాధానం ఉండేది కాదు... ప్రాబ్లమ్ ఏంటో చెప్పేది కాదు... చూసి చూసి ఆనంద్ కి సహనం చచ్చిపోయింది.
చివరికి ఒకరోజు ఆనంద్ ఏ అన్నాడు...
"పోనీ ఒకసారి మీ ఇంటికి వెళ్ళొస్తావా... మీ వాళ్ళను మిస్ అవుతున్నావేమో..."
ఆ మాట విన్న రాణికి మనసులో ఎగిరి గంతేయాలని అనిపించింది... కానీ అలా చేస్తే తాను ఇదంతా ఇందుకోసమే చేసిందా అనే అనుమానం వస్తుందని మౌనం వహించి ఆలోచించి చెప్తాను అన్నది... ఆ ఆలోచన ఫలితమే జానకమ్మకి ఇవాళ వచ్చిన ఈ ఫోన్ కాల్.
"ఇప్పుడు ఏ పండగ కూడా లేదు కదే... ఇప్పుడు రావటం ఏంటి... అల్లుడుగారు కూడా వస్తున్నారు కదా..."
"ఏమీ లేదు అమ్మ అంతా బాగానే ఉంది... పండగ ఉంటేనే కూతురు ఇంటికి రావాలా? అయితే రాను లే..."
ఈ సంభాషణ అంతా రాణి వాళ్ళ నాన్న వెంకట్రావు పేపర్లో మొహం పెట్టి వింటూనే ఉన్నాడు... ఇంకా మాట పెంచొద్దు వస్తానంటే రమ్మను అని సైగ చేశాడు.
"సరేనమ్మా నీ ఇల్లు నీ ఇష్టం ఎప్పుడైనా రా...!!"
సంతోషంగా బట్టలు సర్దుకుంది రాణి... కానీ తన సంతోషాన్ని ఎక్కడా వ్యక్తపరచకుండా... నేను కేవలం నువ్వు చెప్పావు కాబట్టే వెళ్తున్నా అనేలాగా బయలుదేరారు ఇద్దరు.
ఆనంద్ కూడా వచ్చి ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్తా అన్నాడు... రాణి కాదనలేదు... హైదరాబాద్ నుంచి రాణి పుట్టింటికి ఎనిమిది గంటల ప్రయాణం... ఈ ఎనిమిది గంటలలో అయినా తన మనసులో ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుతుందేమో అని ఆశించాడు ఆనంద్... ఏదీ జరగలేదు.
ఇద్దరు బస్సు ఎక్కారు... బస్సు స్టార్ట్ అయింది... ఆనంద్ ఏదో చెప్పబోతుండగా రాణి కళ్ళు మూసుకుంది.
ఆనంద్ ఆలోచనలో పడ్డాడు... తాను ఎప్పుడు ఏమి తప్పుగా మాట్లాడాడో ఇప్పటికి అర్థం కాక పిచ్చెక్కిపోతుంది... ఒక మనిషి పక్కన ఉండి మాట్లాడకపోవటం ఎంత నరకమో అర్థమైంది.
తెల్లవారింది... వెంకట్రావు బస్టాండ్ నుంచి ఇద్దరినీ ఇంటికి తీసుకువచ్చాడు... ఆనంద్ సాయంత్రం దాకా ఉండి... మళ్ళీ రాత్రి బస్సుకి ఇంటికి వెళ్ళాడు.
జానకమ్మ అంతా చూస్తూనే ఉంది... మరుసటి రోజు వెంకట్రావు ఆఫీస్ కి వెళ్ళాక... జానకమ్మ హాల్ లో టీవీ చూస్తున్న రాణిని ఒకసారి కిచెన్ కి వచ్చి కూరగాయలు కట్ చేయమని చెప్పింది... పనిలో ఉన్న రాణిని మెల్లగా కదిలించింది...
"ఏంటే ఏంటి విషయం..."
"ఏముంటుంది ఏమీ లేదు..."
"అంతే పెళ్లై ఆరు నెలలు కాలేదు... పది రోజులు ఉంటా అని వచ్చావు... ఏదయినా గొడవలు పడ్డారా.."
"ఏ గొడవ లేదు... నువ్వు ఏదో ఊహించుకోకు..."
ఇంకా ఎక్కువ విషయాన్ని పొడిగించక అక్కడే కట్ చేసింది జానకమ్మ.
"నీ బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వవె ఉతకటానికి..."
"ఆ ఇస్తానాగు!!"
"ఇదేంటే కొత్త బట్టలు ఏమి కొనుక్కోలేదా..."
"ఆ మా అత్తగారు ఉన్నాక షాపింగ్ కూడానా..."
"ఏమీ వద్దంటుందా మీ అత్తయ్య..."
"వద్దనలేదు... జస్ట్ చూస్తుంది అంతే..."
"మొన్నామధ్య ఆనంద్ కజిన్ మ్యారేజ్ అన్నారు ఎలా జరిగింది..."
"బాగానే అయి ఉంటుంది..."
"అదేం నువ్వు వెళ్ళలేదా..."
"అందరం కలిసి వెళ్ళాలట... నాకు ఇబ్బందిగా అనిపించింది వెళ్ళలేదు..."
"మరి అందరు ఉంటున్నప్పుడు... కలిసి వెళ్ళకపోతే ఎలాగే..."
"కలిసి వెళ్ళొచ్చు... కానీ 24 అవర్స్ నన్ను ఒకరు జడ్జ్ చేస్తున్నారు... నా పైన రెండు సీసీ కెమెరాలు ఉన్నాయ్ అంటే... ఆ వాతావరణంలో నేను ఉండలేకపోతున్నా అమ్మా..."
"మరి ఏమి చేద్దాం అంటావ్... వేరుకాపురం అనుకుంటున్నావా?"
"అది ఆ మహానుభావుడు ఈ జన్మలో చేయలేడులే..."
"అంటే డిస్కస్ చేశావా..."
"డిస్కస్ చేసి మనం బయటపడటం ఏంటి తప్పు... అక్కడ ఏమి జరగదు అని అర్థమైంది..."
"మరి..."
"ఇంకా ఏమీ లేదు..."
"అంటే విడిపోతావా..."
"ఆ..."
"మరీ ఆరు నెలలకే విడాకులా..."
"నేను విడాకులు అనలేదు... విడిగా ఉంటా అంటున్నా... ఆనంద్ మంచి వాడు... కానీ మనకు బ్రతికే స్వతంత్రం లేని చోట... మన మంచితనానికి ఏమి ఉపయోగం... అందుకే..."
"ఏంటి ఏమి మాట్లాడవు అమ్మా..."
"మీ నాన్నను రానీవు చూద్దాంగాని" అని ముగించింది జానకమ్మ.
సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంకట్రావుకి ఇల్లు అంతా ప్రశాంతంగా అనిపించింది...
జానకమ్మతో మాట్లాడాక విషయం అర్థమైంది...
ఒకసారి ఆనంద్ ని ఇంటికి రమ్మని పిలిచారు... కానీ రాణి పుట్టింటికి వెళ్ళటానికి గల కారణం ఆనంద్ వాళ్ళ అమ్మే అని ఆనంద్ కి చెప్పటం సరి కాదు అనిపించింది వెంకట్రావుకి.
ఆదివారం ఉదయమే వచ్చాడు ఆనంద్... కాఫీలు టిఫిన్లు అయ్యాక వెంకట్రావు అల్లుడిని కదిలించాడు.
"బాబు ఆనంద్ మీరు ఆఫీస్ కి దగ్గర్లో ఇల్లు తీసుకుంటే బాగుంటుంది కదా..."
"పర్లేదు మావయ్య నాకు వెళ్లి రావటం ఇబ్బంది అనిపించటం లేదు..."
వెంకట్రావుకి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు.
"అంటే... రాణి మీరు అంత దూరం వెళ్లి రావటం వల్ల అలిసిపోతున్నారు అని బాధపడుతోంది..."
"లేదండి ఇప్పుడు ఇల్లు మారాలంటే రెంట్లు, ఖర్చులు అవి తట్టుకునే శక్తి లేదు... కొంత కాలం ఆగి చూద్దాం..."
ఎంత నచ్చచెప్పినా... విషయం బోధపడటం లేదు ఆనంద్ కి... ఆ సాయంత్రం ఊరువెళ్ళిపోయాడు.
ఆ తరువాత చాలా రోజులు రాణి అత్తగారింటికి రాలేదు... ఏ గొడవ లేదు. రోజు ఆనంద్ తో ఫోన్ లో మాత్రం మాట్లాడుతోంది... ఎప్పుడు వస్తావ్ అంటే త్వరలో అంటోంది...
అలా చూస్తూ చూస్తూ... ఒక పదేళ్లు గడిచాక ఆనంద్ కి ఇంకో సిటీలో జాబ్ వచ్చాక రాణిని తనతో పాటు వస్తావా అని అడిగాడు...
రాణి జీవితం నడిసముద్రంలో ఈత నుంచి ఒడ్డున పడినట్టు అయింది.
-- బంధాలు అంటే అంతే... ఇలాగే ఉంటాయి... మనసులో మాట చెప్తే చెడు అవుతాము, చెప్పకపోతే బ్రతకలేము --
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:
హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: హరీష్ బాబు పొందుగుల
ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు. వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష .










Comments