నలుగురి లో ఒకడు
- Veereswara Rao Moola

- 3 days ago
- 3 min read
నలుగురిలో ఒకడు, డిటెక్టివ్ కథ, క్రైమ్ స్టోరీ తెలుగు, బ్యాంక్ దోపిడీ కథ, Inspector Ranjith, Telugu detective story, crime investigation, suspense story Telugu, police investigation story, fingerprint mystery, Telugu short story, thriller story Telugu, detective fiction, mystery story, bank robbery case

Nalugurilo Okadu - Telugu Suspense Story | Veereswara Rao Moola
నలుగురి లో ఒకడు - తెలుగు సస్పెన్స్ కథ | వీరేశ్వర రావు మూల
Published In manatelugukathalu.com On 18/06/2026
నేర పరిశోధనలో చిన్న ఆధారం కూడా పెద్ద మలుపుకు కారణమవుతుంది. "నలుగురిలో ఒకడు" కథలో బ్యాంక్ దోపిడీ కేసును ఛేదించే క్రమంలో ఇన్స్పెక్టర్ రంజిత్ ఎదుర్కొన్న సవాళ్లు, అతని తెలివితేటలు, పరిశీలనా శక్తి ఉత్కంఠభరితంగా ఆవిష్కరించబడ్డాయి. చివరి వరకు ఉత్కంఠను కొనసాగించే ఈ డిటెక్టివ్ కథ పాఠకులను ఆకట్టుకుంటుంది.
ఆ రోజు ఇన్స్పెక్టర్ రంజిత్ స్టేషన్ లో మోబైల్ చూస్తుండగా KDFC బ్యాంక్ నుండి ఫోన్ వచ్చింది.
బ్యాంక్ మేనేజర్ లైను లో ఉన్నాడు.
"సార్ మా బ్యాంక్ లో ఉదయం పదిన్నర కి
దొంగతనం జరిగింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీలు చూపించి, 50 లక్షల క్యాష్ దోచుకుపోయారు. మీరు వెంటనే రావాలి."
ఆందోళన గా చెప్పాడు బ్యాంక్ మానేజర్.
"నేను క్లూస్ టీం తో వస్తున్నా. ఈ లోగా ఎవరూ
ఏ వస్తువు లు ముట్టుకోకండి." అన్నాడు రంజిత్ టోపి సర్ధకుంటూ.
*******
పదకొండు గంటలకి క్లూస్ టీం తో బ్యాంక్ లోకి అడుగు పెట్టాడు. క్లూస్ టీం ముఖ్య మైన ప్రదేశాలలో వేలి ముద్రలు సేకరించారు. బ్యాంక్ స్టాఫ్ ని అడిగి దొంగల వివరాలు రాబట్టాడు. వాళ్ళు చెప్పిన దాని బట్టి దొంగలందరూ ఇరవై ముప్పయి మధ్య లో ఉండవచ్చు అని అంచనా వేసాడు. బ్యాంక్ క్లర్క్, నగదు లావాదేవీలు చూసేవాడు ఒక ప్రత్యేక విషయం చెప్పాడు.
రంజిత్ ఆ విషయం విని ఆశ్చర్య పోయాడు.
తరువాత సిసి టీవి ఫుటేజ్ పరిశీలించి
దొంగలు ఏ దిక్కుగా వెళ్ళారో గ్రహించాడు.
*******
వారం రోజుల తరువాత ముగ్గరు దొంగలు దొరికారు. నాలుగో వాడు దొరకలేదు.
ముగ్గర్ని ప్రశ్నించినా ఏ క్లూ దొరకలేదు.
అన్ని వేలి మద్రలు పరిశీలించారు. కొన్ని బ్యాంక్ స్టాఫ్ వేలి ముద్ర ల తో సరిపోయాయి. ఒక వేలి ముద్ర మిస్టరీ గా మిగిలింది.
దొరకని నాలుగో వాడే బ్యాంక్ దోపిడి పధకాన్ని
అమలుచేసాడు. రంజిత్ కి ఏలా సాల్వ్ చెయ్యాలో అర్ధం కాలేదు.
********
ఆ రోజు సాయంత్రం రంజిత్ తన మిత్రుడు, డాక్టర్ చక్రధర్ ని కలిసాడు.
"బాబూ, మేము ఏం నేరం చెయ్యలేదు. ఇలా వచ్చారు." అని నవ్వుతూ పలకరించాడు.
"పొద్దస్తమానం నేరాలు, దొంగలేనా కూసింత స్నేహబంధం ఉండాలి.
"అన్నాడు రంజిత్.
ఇద్దరూ నవ్వేసారు.
మాటలు అయ్యాక గ్రీన్ టీ తాగుతూ, "
ఈ మధ్య
చిత్రమెన కేస్ వచ్చింది. నా దగ్గరికి. ఒక కుర్రాడు. వచ్చాడు. అతని చేతికి ఆరు వేళ్ళు ఉన్నాయి" అన్నాడు చక్రధర్.
"ఆరు వేళ్ళా" ఆశ్చర్య పోయాడు.
రంజిత్ కి బ్యాంక్ క్లర్క్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
"సార్, నా వైపు పిస్టల్ గురి పెట్టిన వ్యక్తి కి ఆరు వేళ్లు ఉన్నాయి. ఆరో వేలు దగ్గర గ్లవ్ చిరిగి అతని ఆరో వేలు కనిపించింది"
మళ్ళీ వర్తమానం లోకి వచ్చాడు రంజిత్.
*******
"అతనికి ఆరో వేలు ఆపరేషన్ చేసాను.
చాలా డబ్బు ముట్ట చెప్తానన్నాడు. మొత్తం క్యాష్ రూపం లో ఇచ్చాడు. " చెప్పాడు చక్రధర్.
"ఆ క్యాష్ ఉందా నీ దగ్గర" అడిగాడు రంజిత్ ఉద్వేగంగా.
"ఆరోజే బ్యాంక్ కి పంపాను. ఒక చిన్న కట్ట ఉండవచ్చు."
చక్రధర్ తన క్యాషియర్ ని పిలిచి ఆ కట్టని తెప్పించాడు.
'నీ పోలీస్ బుద్ది పోలేదు' అని నవ్వుతూ ఇచ్ఛాడు చక్రధర్.
రంజిత్ ఆ కట్టను పరశీలించాడు.
ఆ కరెన్సీ నోట్ల మీద నెంబర్లు, బ్యాంక్ దగ్గర పోయిన కరెన్సీ లో ఉన్న నెంబర్ లు సరిపోయాయి.
అంటే దొంగ ఇక్కడికి వచ్చాడన్న మాట.
"నాకో ఆరో వేలు చూపిస్తావా?"
"ఏం నీకు ఐదు వేళ్లు సరిపోవా?"
"సీరియస్ ఆ ఆరో వేలు ఉందా?"
"లాబ్ లో ఉండచ్చు. తెప్పిస్తాను."
ఆరో వేలు వచ్చాక, "ఆపరేషన్ చేసిన వ్యక్తి సిసి టీవి ఫుటేజ్ చూడచ్చా?"
"అలాగే" అన్నాడు చక్రధర్
*******
సిసి టీవి ఫుటేజ్ లో రిసెప్షన్ దగ్గర
ఆ వ్యక్తి ని చూసాడు. . అందులో ఆరో వేలు కనిపిస్తోంది. స్టేషన్ కి
వెళ్ళాక చక్రధర్ ఇచ్చిన ఆరో వేలు వేలి ముద్రని, బ్యాంక్ క్యాష్ కౌంటర్ దగ్గర వేలి ముద్ర ని పోల్చి చూసాడు. అవి సరిపోయాయి.
*******
రంజిత్ కి హొటల్ అప్సర మేనేజర్ నుండి
ఫోన్ వచ్చింది.
"సార్ మా దగ్గరికి ఓ కుర్రాడు వచ్చాడు. ఫోన్ పే/గూగుల్ పే చెయ్యడట. అంతా క్యాష్ ఇస్తాడట."
"సరే అతన్ని మాటల్లో పెట్టండి. నేను వస్తున్నా" చెప్పాడు రంజిత్.
అప్సర మేనేజర్ అతన్ని రూమ్ పది నిమిషాల లో ఖాళి అవుతుందన్నాడు.
*******'
హొటల్ అప్సర లో క్యాష్ ఇస్తుండగా, ఆ వ్యక్తిని అరెస్ట్ చేసాడు రంజిత్.
అతను ఆరో వేలు ఉన్న వ్యక్తి!
*******
"మా బామ్మ ఆరో వేలు ఉంటే అదృష్టం అంది"
"అదే నిన్ను పట్టించింది." అని నేరస్తుణ్ణి సెల్ లోకి పంపి తాళం వేసాడు రంజిత్.
***
వీరేశ్వర రావు మూల గారి కొన్ని ఇతర రచనలు:
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.
#TeluguComedyStory, #తెలుగుహాస్యకథ







Comments