ఒక భారీ సినిమా - పార్ట్ 2

Oka Baari Cinema - Part 2 - Telugu Comedy Story | Bhaskara Rao B. R. K. V.
ఒక భారీ సినిమా - పార్ట్ 2 - తెలుగు హాస్య కథ | బి ఆర్ కె వి భాస్కర రావు
Published in manatelugukathalu.com on 10/11/2026
భారీ సినిమా షూటింగ్‌లో హీరోయిన్‌ను కాపాడే సన్నివేశంలో డూప్‌కు బదులుగా తానే నటించాలనుకున్న నూకరాజు అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటాడు. బి. ఆర్. కె. వి. భాస్కర రావు రచించిన 'ఒక భారీ సినిమా – పార్ట్ 2' సినిమా రంగంలోని ఆర్భాటాలను వ్యంగ్యంగా చూపించే నవ్వులు పూయించే తెలుగు హాస్య కథ.
మూడు నెలల తర్వాత కోలుకున్న నూకరాజు, తల్లి వద్దని లబోదిబోమన్నా తండ్రి పట్టు మీద, డైరెక్టరు హీరోయిన్‌కు తనకు మధ్య రొమాన్స్ సీన్లు చాలా ఉన్నాయని ఆశ పెట్టడంతో పట్టు వదలని విక్రమార్కునిలా తిరిగి షూటింగులో పాల్గొనడానికి ఒప్పుకున్నాడు.
"ఇది ప్రీ-ఇంటర్వెల్ సీన్. ఇంచుమించు క్లైమాక్స్ లానే ఉంటుంది. హీరోయిన్‌ను విలన్లు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తే బాబూ! మీరెళ్ళి కాపాడాలి. ఈసారి వెరైటీగా గాల్లో ఈ సీన్‌ను ప్లాన్ చేశాం" అని డైరెక్టరు సుబ్బరాజు, నూకరాజును కూర్చోబెట్టి చెప్పేసరికి అప్పటివరకు ధైర్యంగా ఉన్న నూకరాజు, 'గాల్లో' అనేసరికి తన ప్రాణాలు ఎక్కడ గాల్లో కలిసిపోతాయో అన్న భయంతో వెంటనే వద్దన్నాడు.
"బాబు నూకా! నువ్వేమీ భయపడొద్దు. మన సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అందుకే హీరోయిన్‌గా చైనా అమ్మాయిని పెట్టాం. ఆవిడకు ఇటువంటి ఫీట్స్ వెన్నతో పెట్టిన విద్య. నువ్వు కేవలం ఫీలింగ్స్ ఇస్తే చాలు. నీ డూప్ అన్నీ చేసేస్తాడు. రెండు హెలికాప్టర్ల మధ్య హీరోయిన్ నాలుగు తాళ్లతో వేళ్లాడుతూ ఉంటుంది.
వాటికి ఆపోజిట్‌గా మరో రెండు హెలికాప్టర్ల మధ్య నువ్వు, అంటే నీ డూప్ నాలుగు తాళ్లతో వేళ్లాడుతూ వచ్చి హీరోయిన్‌ని కాపాడాలి" అని డైరెక్టరు చెప్పేసరికి ఒప్పుకున్నాడు నూకరాజు.
దండకారణ్యం మీద షూటింగ్ ప్రారంభమయ్యింది. నాలుగు హెలికాప్టర్లను అద్దెకు తెచ్చి మరీ షూటింగ్ ప్రారంభించాడు సుబ్బరాజు. డైరెక్టరు చెప్పినట్టే క్రింద కూర్చుని షూటింగ్ గమనిస్తున్నాడు నూకరాజు బైనాక్యులర్స్‌తో.
పైన హీరోయిన్, నూకరాజు డూప్ బాగా దగ్గరకు వచ్చి గట్టిగా కౌగిలించుకుంటారు. వాళ్లలా మరీ దగ్గరగా ఉండటం చూసిన నూకరాజుకు చిర్రెత్తుకొచ్చింది. 'నేను డబ్బులిస్తే వాళ్లిద్దరూ అలా రొమాన్స్ చేసుకుంటారా? మరి నా గతేమి కాను?' అనుకుని వెంటనే హెలికాప్టర్ లోంచి షూట్ చేస్తున్న డైరెక్టరుకు ఫోన్ చేసి షూటింగ్ ఆపేయమన్నాడు.
"ఎందుకు బాబూ?! సీన్ బాగానే వస్తోందిగా?" అని అడిగాడు కాస్తంతా చిరాగ్గానే.
"ఏం రావడం నా తలకాయ! సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టు పెట్టుబడి నేను పెడితే వాడెవడో వచ్చి హీరోయిన్‌ని నలిపేస్తాడా?? నేను ఒప్పుకోను. ఆ ఫీట్ నేనే చేస్తాను. ఇమ్మీడియట్‌గా వాణ్ణి క్రిందకు దింపేయండి. నేను పైకి వెళ్తాను" అని నూకరాజు కోపంతో అరిచేసరికి,
"బాబు మీకెందుకు ఆ రిస్క్, ఆలోచించుకోండి. సాంగ్స్, బెడ్‌రూమ్ సీన్స్ మీతోనే చాలా లెంగ్తీగా తీస్తాను" అన్నాడు డైరెక్టరు సముదాయిస్తూ.
"నో!!! నాట్ ఎట్ ఆల్.."
"ఓకే బాబూ! మీరే చెయ్యండి" అనేసి డూప్ ప్లేసులో నూకరాజును ఉంచాడు డైరెక్టరు.
క్రింద చూడటానికి బాగానే ఉన్నా అంతెత్తులోకి వెళ్లేటప్పటికి కళ్లు తిరగడం ఆరంభించాయి నూకరాజుకు. గుండెల్లో సన్నపాటి దుడుకు మొదలయ్యింది.
భయంతో కేకలు వేయనారంభించాడు. అసలే ఎత్తు, ఆపై హెలికాప్టర్స్ హోరులో అతని అరుపులు ఎవ్వరికీ వినిపించలేదు. షూటింగ్ కొనసాగుతోంది. ఏడుపు లంకించుకున్నాడు.
తన బాధను ఎవరూ పట్టించుకోకపోవడంతో
గట్టిగా గుంజుకోవడం మొదలెట్టాడు. ఈలోపు డైరెక్టరు నూకరాజు గోడును అర్థం చేసుకుని 'కట్' చెప్పి అతన్ని క్రిందకు దింపేయమన్నాడు.
అప్పటికే హెలికాప్టర్లు దట్టమైన అడవి పైన ఉన్నాయి. నూకరాజు బాగా శరీరాన్ని కుదుపేసుకోవడం వల్ల తాళ్లకు ఉన్న హుక్స్ తెగిపోవడంతో ఒక్కసారిగా అడవిలోకి "అమ్మా!!!" అంటూ పడిపోయాడు.
సుబ్బారాజుతో సహా యూనిట్ అంతా కంగారుపడిపోయి ఆ హెలికాప్టర్లతోనే గాలించేసరికి నాలుగు గంటలకల్లా ఓ చెట్టుకొమ్మను పట్టుకుని గబ్బిలంలా వేళ్లాడుతూ బెదురుచూపులు చూస్తూ కనిపించేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
================================
ఒక భారీ సినిమా - పార్ట్ 3 త్వరలో మీ ముందుకు వస్తుంది.
================================
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
***
బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు
ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.
భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.
రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.
పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు
నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు
ఊరు పాలి










Comments