ఊ అనేస్తే పోలా!

Vu Anestha Polaa - Telugu Inspirational Article | Kotha Viritha
ఊ అనేస్తే పోలా! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 12/09/2026
మనకి రకరకాల భావోద్వేగాలు ఉంటాయి ప్రేమ, కోపం, జాలి, బాధ, అసూయ, కన్నీళ్లు… ఇంకా బోలెడన్ని. అవి ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు వస్తాయో మనకే కొన్నిసార్లు అర్థం కాదు. అర్థం కాకపోయినా పర్లేదు… వచ్చిన ప్రతిదానికీ మనం జీవితాంతం అద్దెకు ఉంచాల్సిన అవసరం లేదు.
కోపం వచ్చింది కదా అని పక్కవాడిని తన్నేసి, గొడవపడి, చివరికి మనకే తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకు?భావోద్వేగం వచ్చిందంటే అది ఒక నోటిఫికేషన్ మాత్రమే… వెంటనే రిప్లై ఇవ్వాల్సిన మెసేజ్ కాదు!బాధ వచ్చింది కదా అని రోజంతా దానితో కూర్చోవాలా?
ప్రేమ వచ్చింది కదా అని అవతలివాళ్ల చుట్టూ జీవితాన్ని ప్యాక్ చేసి పంపాలా?
జాలి వేసిందని ప్రతి ఒక్కరి సమస్యను మన భుజాల మీద మోసుకోవాలా?
అసూయ వచ్చిందని మన ప్రశాంతతను వాళ్ల విజయానికి బహుమతిగా ఇవ్వాలా?
కన్నీళ్లు వస్తే రానివ్వండి… అవి కూడా మనసుకి అప్పుడప్పుడూ వచ్చే వర్షమే. ఏడ్చి కళ్ళు తుడిచూసుకోవటం అంత ఉత్తమం ఇంకోటి లేదు. అక్కడితో ఆ బాధ పూర్తిగా పోకపోయినా, కాసేపటికి దానినుండి బయట పడతాం. భావన రావడం మన చేతిలో ఉండకపోవచ్చు… కానీ దాని వెంట ఎంత దూరం నడవాలో మాత్రం మన చేతిలోనే ఉంటుంది.
కోపం వచ్చిందా? ఊ అనేయండి.
బాధ వచ్చిందా? ఊ అనేయండి.
ప్రేమ వచ్చిందా? అదీ ఊ అనేయండి.
కన్నీళ్లు వచ్చాయా? వాటినీ వచ్చి పోనివ్వండి.
ప్రతి భావోద్వేగానికి కుర్చీ వేసి, “ఇక్కడే ఉండండి” అని ఆహ్వానం ఇవ్వాల్సిన అవసరం లేదు.
వచ్చేవి వస్తాయి,
పోయేవి పోతాయి.
మన పని వాటిని ఆపడం కాదు… వాటితో కలిసి మనమే కొట్టుకుపోకుండా ఉండటం. అందుకే… భావం ఏదైనా, ముందు ఒకసారి “ఊ…” అనేసి వదిలేయండి. అంతే… జీవితం చాలా తేలిక అవుతుంది!
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







భావోద్వేగానికి సంబంధించిన మంచి నరేషన్. ఉద్వేగానికి వచ్చే కన్నీళ్లు మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. కన్నీళ్లు వస్తే రాని... చింతించాల్సిన పనిలేదు. ఒక పని అయిపోతుంది
Wow excellent write up 👌 👌 👌 👌