top of page
Original.png

గణేష్ ఉత్సవాలు ఆడంబరాలకు వినోదాలకు వేదిక కాకూడదు

6 hours ago
4 min read

పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహం ముందు భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న తెలుగు కుటుంబాలు, యువత.

 

Ganesh Utshavalaku Aadambaralaku Vinodhalaku Vedika Kakudadu - Telugu Social Article | R C Kumar

గణేష్ ఉత్సవాలు ఆడంబరాలకు వినోదాలకు వేదిక కాకూడదు - తెలుగు సామాజిక వ్యాసం | ఆర్ సి కుమార్

Published In manatelugukathalu.com On 11/09/2026


భక్తి, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ గణేష్ ఉత్సవాలను ఎలా నిర్వహించాలి? యువత, ఉత్సవ కమిటీలు, మంటపాల నిర్వాహకులు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి? ఈ అంశాలను వివరిస్తూ ఆర్.సి. కుమార్ రాసిన “గణేష్ ఉత్సవాలు ఆడంబరాలకు వినోదాలకు వేదిక కాకూడదు” అనే సామాజిక చైతన్య వ్యాసం మనకు విలువైన సందేశాన్ని అందిస్తుంది.


గణేష్ ఉత్సవాలు అనేవి భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవలసిన పవిత్ర నవరాత్రి వేడుకలు. ఇది ఆధ్యాత్మిక సాధనకు, సామాజిక ఐక్యతకు ప్రతీక. విఘ్నేశ్వరుడు బుద్ధికి, జ్ఞానానికి అధిపతి. సమాజమంతా కలిసి ఆయన్ను పూజించడం ద్వారా సమాజానికి పట్టిన విఘ్నాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం.


క్లుప్తంగా చెప్పాలంటే, వ్యక్తిగత పూజను ఒక సామాజిక ఉద్యమంగా మార్చడమే వీధుల్లో నిర్వహించే గణేష్ ఉత్సవాల అసలైన అంతరార్థం. కానీ దురదృష్టవశాత్తు కొందరి అత్యుత్సాహం మరియు నిర్లక్ష్యం వల్ల ఇటీవలి కాలంలో ఈ పండుగ వేడుకల్లో కొన్ని విపరీత పోకడలు, అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. భక్తి కంటే ఆడంబరానికి, వినోదానికి, కాలక్షేపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పండుగ యొక్క పవిత్రత దెబ్బతింటోంది.


అంతేకాదు మితిమీరిన ఉత్సాహంతో చేస్తున్న కొన్ని అవాంఛనీయ కార్యక్రమాలు ప్రజా జీవనానికి ఇబ్బందిగా, ప్రమాదకరంగా మారుతున్నాయి. నిమజ్జన సమయంలోనే కాదు వినాయక విగ్రహాలను మంటపాలకు తెచ్చే సందర్భంలో కూడా రహదారులపై డీజేల మోతలు, నాట్య విన్యాసాలతో ఊరేగింపుగా బయలుదేరి హడావిడి చేయడం ఈ మధ్యకాలంలో మొదలైంది.


బ్రిటిష్ పాలనలో బాలగంగాధర్ తిలక్ గారు ప్రజలను ఒకచోటకు చేర్చి సమైక్య పరచడానికి గణేష్ ఉత్సవాలను ఒక వేదికగా మార్చారు. కారణాలు ఏవైనా, ఆధ్యాత్మిక భావనతో పాటు ఒక సామాజిక సామరస్యతకు ఆ సంప్రదాయం దారితీసింది. ప్రజల్లో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడానికి ఈ ఉత్సవాలు సహాయపడుతున్నాయి అనడంలో సందేహం లేదు.


అయితే గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆధ్యాత్మికత లోపించడం, భజనలు, కీర్తనల స్థానంలో ద్వంద్వార్థపు సినిమా పాటలు, అసభ్యకర నృత్యాలతో చిందేయడం వల్ల పండగల వైభవం, పవిత్రత కనుమరుగైపోతోంది. మంటపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీలు, యువత బాధ్యతాయుతంగా ఉత్సవ నిర్వహణకు పూనుకుంటే సామాజిక బంధాలు బలపడి ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది. వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భజనలు, నాటకాలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీత కచేరీలు మరియు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తే స్థానిక కళాకారులను ప్రోత్సహించడమే కాక, మన సంస్కృతిని భావితరాలకు అందించడానికి సహాయపడుతుంది.


వీధిలో నలుగురు కలిసి చందాలు వేసుకోవడం, పందిళ్లు వేయడం, ప్రసాదాలు పంచడం వంటి పనుల వల్ల ఇరుగుపొరుగువారి మధ్య కలయిక, ఆప్యాయత పెరిగి సామాజిక బంధాలు బలపడతాయి. అయితే డొనేషన్ల పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడితే అవే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది.


హిందూ సంప్రదాయంలో ప్రకృతిని దైవంగా భావిస్తాం. మన పూజా ప్రక్రియ ద్వారా ప్రకృతికి హాని కలిగించకుండా ఉండటమే నిజమైన భక్తికి నిదర్శనం. పక్క వీధిలో లేదా పక్క మంటపం వారు పెడుతున్న విగ్రహం కంటే మరింత పెద్దగా, ఆకర్షణీయంగా ఉండాలని పోటాపోటీగా చిత్రవిచిత్రమైన రూపాలలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసుకునే ట్రెండ్ నానాటికి పెరిగిపోతోంది.


ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటిలో కరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇందులోని రసాయనాలు చెరువులు, నదులలో పేరుకుపోయి నీటి వనరులను కలుషితం చేయడంతో జరిగే అనర్థాలు మనమెరిగినవే. మట్టి వినాయక విగ్రహాలతో ఇటువంటి సమస్యలు ఉండవు. పర్యావరణహిత విగ్రహాలను ఆరాధించడం వలన మన సంస్కృతి, ప్రకృతి పట్ల యువతకు బాధ్యత పెరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు రసాయన రంగులతో చేసే విగ్రహాల కంటే మట్టి వినాయకుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడిప్పుడే ప్రజల్లో అవగాహన పెరుగుతుండడం స్వాగతించదగ్గ పరిణామం.


కానీ భారీ విగ్రహాల తయారీ విషయంలో మంటప నిర్వహకులకు ఇప్పటికీ ఈ మార్పు రాకపోవడం దురదృష్టకరం. మట్టి వినాయక విగ్రహాల లోపల మొక్కల విత్తనాలను ఉంచి, పండుగ అయిపోయాక ఇంట్లో కుండీలోనే నిమజ్జనం చేస్తే, ఆ మట్టి నుండి కొత్త మొక్కలు మొలుస్తాయి. ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేయడమే కాక మనకు ఎంతో తృప్తిని ఇస్తుంది.


బాధ్యతాయుతంగా జరిపే సామూహిక గణేష్ ఉత్సవాల వల్ల అనేక రకాల సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. యువతకు టీమ్ స్పిరిట్‌తో కలిసి పనిచేసే తత్వం అలవడుతుంది. సాంస్కృతిక కళాకారులకు తమ ప్రతిభను చాటుకోవడానికి ఇది ఒక చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది.


నిత్య జీవితంలో ఒత్తిడితో గడిపే ప్రజలకు ఈ తొమ్మిది రోజుల భజనలు, పూజలు మరియు పండుగ వాతావరణం వల్ల గొప్ప మానసిక ప్రశాంతత, ఉల్లాసం లభిస్తాయి. చట్టపరమైన ముందస్తు అనుమతులు తీసుకొని భద్రతా ప్రమాణాలను, శబ్ద తీవ్రత నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ సాధారణ ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మంటపాల నిర్వహకులు ఉత్సవాలు జరిపిస్తే వినాయక పూజకు అర్థం పరమార్థం ఉంటుంది.


ఓం విఘ్నేశ్వరాయ నమః 🙏


గమనిక / Disclaimer: ఈ వ్యాసం సమాజంలో చోటుచేసుకుంటున్న కొన్ని రోడ్డు ప్రమాద ఘటనలు, వాటి సందర్భంలో కనిపించే ప్రజల ప్రవర్తనపై రచయిత వ్యక్తిగత అభిప్రాయం మరియు సామాజిక విశ్లేషణ మాత్రమే. ఇందులో వ్యక్తమైన అభిప్రాయాలు ఏ వ్యక్తి, వర్గం, ప్రాంతం, రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వాన్ని కించపరచడం లేదా నిందించడం ఉద్దేశించినవి కావు. ప్రస్తావించిన ఘటనల వివరాలు అందుబాటులో ఉన్న వార్తలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన సమాచారం ఆధారంగా ఉండవచ్చు; వాటిలోని ప్రతి అంశాన్ని స్వతంత్రంగా ధృవీకరించినదిగా పరిగణించరాదు. చట్టపరమైన అంశాల ప్రస్తావన సాధారణ అవగాహన కోసం మాత్రమే; దీనిని న్యాయ సలహాగా భావించరాదు. వ్యాసం ప్రధాన ఉద్దేశం ప్రమాద సమయాల్లో మానవత్వం, పౌర బాధ్యత, బాధితులకు సహాయం చేయాల్సిన అవసరంపై సామాజిక అవగాహన కల్పించడం మాత్రమే.


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.




ఆర్ సి కుమార్  గారి కొన్ని ఇతర రచనలు:


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

R C Kumar
ఆర్.సి. కుమార్

రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

war impact economy, oil crisis Telugu, inflation Telugu, global economy war, Iran Israel war impact, petrol price increase, economic crisis Telugu, Yuddha Prabhavam Arthika Samkshobham, యుద్ధ ప్రభావం ఆర్థిక సంక్షోభం, R C Kumar, ఆర్ సి కుమార్


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page