top of page
Original.png

ఊరు పెట్టిన పేర్లు… ఊరికే రావు

తెలుగు వ్యాసాలు, వ్యంగ్య వ్యాసం, హాస్య రచన, సమాజం, మనుషుల స్వభావం, జీవన సత్యాలు, వ్యక్తిత్వ వికాసం, ఆలోచింపజేసే వ్యాసం, తెలుగు సాహిత్యం, మన తెలుగు కథలు

తెలుగు గ్రామంలో మర్రిచెట్టు కింద గుసగుసలు చెప్పుకుంటున్న గ్రామస్తులు, ఆశ్చర్యంగా వెనక్కి చూస్తున్న మధ్యవయస్కుడు, "ఊరు పెట్టిన పేర్లు… ఊరికే రావు!" అనే సందేశాన్ని ప్రతిబింబించే హాస్యభరితమైన వ్యంగ్య దృశ్యం.
తెలుగు గ్రామంలో మర్రిచెట్టు కింద గుసగుసలు చెప్పుకుంటున్న గ్రామస్తులు, ఆశ్చర్యంగా వెనక్కి చూస్తున్న మధ్యవయస్కుడు, "ఊరు పెట్టిన పేర్లు… ఊరికే రావు!" అనే సందేశాన్ని ప్రతిబింబించే హాస్యభరితమైన వ్యంగ్య దృశ్యం.

Uru Pettina Perlu Urike ravuTelugu Inspirational Article | Kotha Viritha

ఊరు పెట్టిన పేర్లు… ఊరికే రావు తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 30/06/2026


కొంతమందికి పుట్టినప్పుడు పెట్టిన పేర్లు ఒకటి… సమాజం తర్వాత పెట్టిన పేర్లు ఇంకొకటి.


కంగారు కనకరావు

హడావిడి హరికృష్ణ

సలహాల సత్యనారాయణ

అనుమానాల అప్పారావు

గాసిప్ గోవిందమ్మ

వాట్సాప్ విశ్వనాథం

పెట్టుడు గడ్డం తీసేసిన పీచుగడ్డం పిచేశ్వరరావు

ఆడంబరం ఆనంద్ కుమార్

ఇలా అసలు పేర్లు పక్కనపడి, కొసరు పేర్లే చిరస్థాయిగా నిలిచిపోతాయి.


ఆ పేర్లు కూడా యాదృచ్ఛికంగా రావు. వాళ్లు చేసే "అతి"కి సమాజం ఇచ్చే అవార్డులే అవి.తమ పని కంటే పక్కింటి పని మీదే ఎక్కువ ఆసక్తి. తమ జీవితంలో ఏమి జరుగుతుందో తెలీదు కానీ, ఊరిలో ఎవరి ఇంట్లో ఏమి జరిగిందో మాత్రం నిమిషానికో అప్డేట్ ఉంటుంది.

ఎవరు ఎక్కడికి వెళ్లారు,

ఎవరు ఎవరితో మాట్లాడారు,

ఎవరి కొడుకు ఏం చదువుతున్నాడు,

ఎవరి కోడలు ఎంత జీతం తీసుకుంటోంది.

ఇవన్నీ తెలుసుకోవడం వీళ్లకు హాబీ కాదు…హోదా అని ఫీల్ అవుతారు.


"మా పనేమీ లేదు… సమాజం కోసం తెలుసుకుంటున్నాం" అని చెప్పుకుంటూ, అడగకపోయినా సలహా ఇస్తారు. 


పిలవకపోయినా మధ్యలో దూరుతారు. తెలియకపోయినా తీర్పులు చెప్పేస్తారు.

వీళ్ల స్పెషాలిటీ ఏంటంటే, తమ ఇంట్లో మంటలు ఎగిసిపడుతున్నా, పక్కింట్లో పొగ ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికే ఎక్కువ ఆసక్తి.చేసేది కొంత… చూపించేది అంత అన్నట్టుగా, తమ జీవితంలో ఉన్న సమస్యలను పక్కనపెట్టి ఇతరుల జీవితాల మీదే పరిశోధనలు చేస్తుంటారు.


అందుకే అసలు పేర్లు మరిచిపోయి, ఊరు వాళ్లకు ప్రత్యేక బిరుదులు ఇస్తుంది.

మరి డాక్టరేట్ చదివి వచ్చే బిరుదులు కొన్నే ఉంటాయి, కానీ ఇతరుల జీవితాల్లో ముక్కు పెట్టి సంపాదించుకునే బిరుదులు మాత్రం జీవితకాలం ఉంటాయి.


అందుకే,ఊరు పెట్టిన పేర్లు… ఊరికే రావు.


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత
కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

3 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Yes it's 100% true👍Nicely explained.

Human psychology is to involve others matters ignoring his own

Like

Rated 5 out of 5 stars.

Nice

Like

Rated 5 out of 5 stars.

Super

Like
bottom of page