పరమ వీర చక్ర
- Penumaka Vasantha

- 3 hours ago
- 2 min read
పరమ వీర చక్ర, తెలుగు దేశభక్తి కథ, భారత సైన్యం, ఆర్మీ కథ, వీర జవాన్, దేశం కోసం త్యాగం, సైనికుడి కథ, పరమ వీర చక్ర అవార్డు, తెలుగు కథలు, దేశభక్తి, అమర జవాన్, కుటుంబ భావోద్వేగం

Parama Veera Chakra - Telugu Inspirational Story | Penumaka Vasantha
పరమ వీర చక్ర - తెలుగు ప్రేరణాత్మక కథ | పెనుమాక వసంత
Published In manatelugukathalu.com On 10/07/2026
దేశం కోసం ప్రాణాలను అర్పించడం ఒక సైనికుడికి గర్వకారణం... కానీ ఆ త్యాగాన్ని భరించడం కుటుంబానికి జీవితాంతం మిగిలే బాధ. భారత సైన్యంలో చేరి రెండు యుద్ధాల్లో వీరోచితంగా పోరాడిన యువ సైనికుడు చక్రి, అతని తండ్రి వీరశేఖర్ దేశభక్తి, తల్లి సుశీల హృదయవేదనను హృద్యంగా ఆవిష్కరించిన దేశభక్తి కథ "పరమ వీర చక్ర" ప్రతి భారతీయుడి హృదయాన్ని కదిలిస్తుంది.
"చక్రి లే..! ఆర్మీలో చేరతానని అప్లై చేశావు కదా. వాళ్ళ నుండి చేరమని రిప్లై వచ్చింది” అన్నాడు తండ్రి వీర శేఖర్.
"అవునా..!" అంటూ లేచి తండ్రి ఇచ్చిన కవర్ చూసుకుని హ్యాపీగా గుండెలకు హత్తుకున్నాడు చక్రి.
"వాడిని చేర్పిస్తున్నారా? మళ్ళీ వీడి గురించి నాకు టెన్షన్ స్టార్ట్..!" అంటూ భర్తను కేకలేసింది సుశీల.
"నేను వెళ్ళి చక్కగా యుద్ధంలో పాల్గొని ఎంతో పేరు తెచ్చుకున్నా. నాలాగే నాకొడుకు దేశానికి సేవ చేయాలి" అన్నాడు కొడుకును గర్వంగా చూస్తూ.
"ఆ చేసారు యుద్ధం. ఆ యుద్ధం నుంచి మీరు వచ్చేదాకా నాకు కంటి మీద కునుకు లేదు.
ఎందుకండి మళ్ళీ వాడిని పంపించటం? మనకు ఒక్కడే అబ్బాయి..!" అంటూ చక్రిని చూస్తూ ఆందోళనగా అంది.
"ఏం కాదు. వాడికి పిరికిమందు నూరి పోయకు" అంటూ విసుక్కున్నాడు వీరశేఖర్.
@@@@@
చక్రి ఆర్మీలో చేరగానే... చైనాతో యుద్ధం వచ్చింది.
ఆ యుద్ధంలో ఎంతో వీరోచితంగా పోరాడాడు. భారత్ యుద్ధంలో గెలిచేసరికి చైనా వాళ్ళు చేసేది లేక సర్దుకున్నారు. ఇంటికి వచ్చిన కొడుకును చూసి గర్వపడ్డాడు వీర శేఖర్.
భార్య సుశీలతో అన్నాడు. వీర పుత్రుడిని కన్నావు.
చూడు టివిలో నా కొడుకు పేరు మారుమోగుతోంది
అంటూ గర్వంగా మీసం మెలితిప్పాడు.
"ఏమండీ..!మళ్ళీ వీడు ఆర్మీలో జాయిన్ అయ్యేలోగా
పెళ్లి ఖాయం చేసుకుందాం" అనటంతో తన ఫ్రెండ్ కూతురుతో ఎంగేజ్మెంట్ చేశాడు వీరశేఖర్. సెలవు అయిపోయి వెళ్ళి పోయాడు చక్రి. మళ్ళీ పెళ్ళికి వస్తాను అంటూ.
చక్రి వెళ్లగానే పాకిస్థాన్తో యుద్ధం మొదలైంది. సుశీల తిట్టుకుంటూ ఉంది. మళ్ళీ ఈ యుద్ధం ఏంటో. చక్రి రోజు నాన్నతో మాట్లాడుతున్నాడు. వీరశేఖర్ ఇదివరకు తను పాకిస్థాన్ వాళ్ళతో తను ఎట్లా పోరాడింది. వాళ్ళను ఎలా మట్టుబెట్టాలి అనే సలహాలు ఇస్తున్నాడు చక్రికి.
టివిలో న్యూస్ చూస్తుంటే... పాకిస్తాన్తో యుద్ధం చేస్తూ అసువులు బాసిన చక్రధర్ అనే పేరు వినటంతోనే.. కుర్చీలో కుప్పకూలిపోయాడు వీర శేఖర్.
సుశీల వెళ్ళి భర్తను ఎంత లేపినా లేవలేదు. డాక్టర్ ను పిలిస్తే... అప్పటికే ప్రాణాలు పోయాయి అని చెప్పాడు. ఒకేసారి భర్త, కొడుకు పోవటంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది సుశీల.
@@@@@@
కొన్నాళ్ల తర్వాత చక్రధర్ కు పరమ వీర చక్ర అవార్డు ప్రకటించారు. చైనా, పాకిస్తాన్ యుద్ధాల్లో వీరోచితంగా పోరాడినందుకు అవార్డు ఇస్తున్నట్లు టివిలో చూసి సంతోషపడాలో దుఃఖపడాలో తెలియక సుశీల కుమిలిపోయింది. చివరికి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డు తీసుకుంటూ... ఏడ్చింది.
రాష్ట్రపతి సుశీలను ఓదార్చారు.
టివిలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా భర్త, కొడుకు ఇద్దరూ దేశం కోసం పోరాడారు. అది ఒక పక్క గర్వంగా ఉన్నా మరోపక్క ఆవేదనగా ఉంది అంటూ కళ్ళు
తుడుచుకుంది.
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.






Comments