మాయల వల

Maayala Vala - Telugu Social Awareness Story | Jeedigunta Srinivasa Rao
మాయల వల - తెలుగు సామాజిక అవగాహన కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 21/10/2026
“మాయల వల” శ్రీనివాసరావు జీడిగుంట రచించిన సమకాలీన సామాజిక అవగాహన తెలుగు కథ. సైబర్ మోసాలపై అవగాహన పెంచే ఈ కథ ప్రతి కుటుంబం చదవదగినది.
"అమ్మా! కాలేజీకి వెళ్తున్నాను" అని తల్లికి చెప్పింది హారిక.
"రోజూ వెళ్లేదే కదా, ఈరోజు ప్రత్యేకంగా చెప్తున్నావు; పరీక్షలు ఏమైనా ఉన్నాయా?" అంది తల్లి రమణి, కిచెన్‌లో కాఫీ కలుపుతూ.
"ఏం లేదులే అమ్మా, ఊరికే చెప్పాను" అంటూ సంచి భుజాన వేసుకుని వేగంగా బయటకు వెళ్ళిపోయింది హారిక. రమణి ఆ మాటను అంతగా పట్టించుకోలేదు.
రోజూ సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చి, కాసేపు అలసట తీర్చుకుని, టీ తాగి ట్యూషన్‌కి వెళ్లే కూతురు ఏడు గంటలైనా రాలేదు.
ఏమిటా అని ఆలోచిస్తూ భర్తకి ఫోన్ చేసింది రమణి. "ఏమండీ, మీరు ఆఫీస్ నుంచి బయలుదేరటానికి ఇంకా ఎంత టైమ్ పడుతుంది?" అని అడిగింది.
"ఎందుకు? ఏమైనా స్పెషల్ వంటలు చేస్తున్నావా? ఇంకో అరగంటలో బయలుదేరుతాను" అన్నాడు శేఖర్. "అయితే వచ్చేటప్పుడు అమ్మాయి ట్యూషన్ దగ్గరికి వెళ్లి దాన్ని తీసుకుని రండి. ఈరోజు సాయంత్రం ఇంటికి రాకుండా కాలేజీ నుంచి డైరెక్టుగా ట్యూషన్‌కి వెళ్ళింది అనుకుంటా" అంది రమణి.
తన పని ముగించుకుని కూతురు చదివే ట్యూషన్ సెంటర్ వైపు కారు తిప్పాడు శేఖర్. ఇంకా క్లాస్ జరుగుతోంది అనుకుంటా బయట స్కూటీలు, సైకిళ్లు కనిపించాయి శేఖరికి.
అరగంట ఆగినా హారిక బయటకు రాకపోవడంతో శేఖర్ లోపలికి వెళ్లాడు. లెక్కల మాస్టర్ శేఖర్‌ని చూసి, "సార్, మీ అమ్మాయి ఈరోజు ట్యూషన్‌కి రాలేదే!" అన్నాడు.
అది విని శేఖర్ గుండె ఆగినంత పనైంది. "అదేమిటి సార్? ఉదయం కాలేజీకి వెళ్లి సరాసరి ట్యూషన్‌కి వచ్చింది అనుకున్నాను. ఒకసారి మళ్లీ క్లాస్‌లో చూడండి" అన్నాడు నుదుటిపై పట్టిన చెమటలు తుడుచుకుంటూ. "సార్, ఇప్పుడు జరుగుతున్నది అకౌంట్స్ వాళ్లకు.
మీ అమ్మాయి బ్యాచ్ ఎప్పుడో అయిపోయింది. అసలు ఈరోజు హారిక రాలేదు, నాకు బాగా గుర్తుంది" అని ఖచ్చితంగా చెప్పాడు మాస్టర్.
చేసేది లేక బయటకు వచ్చి భార్యకి ఫోన్ చేసి, "అమ్మాయి వచ్చిందా?" అని అడిగాడు శేఖర్. "లేదు, మీరే తీసుకుని వస్తానన్నారుగా, వెళ్లలేదా?" అంది రమణి ఆందోళనగా.
"అసలు హారిక ట్యూషన్‌కి రాలేదంట! ఎక్కడికి వెళ్లిందో ఏమో... నేను ఇంటికి వస్తున్నాను" అని చెప్పి కారు ఎక్కాడు. ఇంటికి రాగానే కారులోంచి తన ఆఫీస్ బ్యాగ్ తీసుకుని దిగుతున్న బాస్‌తో "సార్, బ్యాగ్ నేను తెస్తాను ఇటు ఇవ్వండి" అన్న డ్రైవర్‌తో, "వద్దులే, నేనే తీసుకెళ్తాను, నువ్వు వెళ్లు" అంటూ లోపలికి నడిచాడు శేఖర్.
భర్తని చూసి "అమ్మాయి వచ్చిందా?" అని మళ్లీ అడిగింది రమణి.
"రావటానికి అది ట్యూషన్‌కి వెళ్తేగా! ఏదైనా సినిమాకి వెళ్లిందేమో... పది గంటల వరకు చూద్దాం" అని ఆఫీస్ డ్రెస్‌తోనే సోఫాలో కూర్చుండిపోయాడు. కానీ, కూతురు ఇంటికి రాకపోవడానికి ఎన్నో అనుమానాలు శేఖర్ మెదడును తొలిచేస్తున్నాయి.
తెల్లారింది. రాత్రి పూట ఒక్క నిమిషం కూడా కన్ను మూయకపోవడంతో శేఖర్, రమణీల కళ్లు ఎర్రగా అయిపోయాయి.
"ఇక ఆలస్యం చేయకుండా పోలీస్ రిపోర్ట్ ఇద్దాం" అన్నాడు శేఖర్. "అల్లరి అవుతామేమోనండి, ముందు దాని స్నేహితులని అడిగి చూద్దాం" అంది రమణి కన్నీళ్లతో. వెంటనే కాలేజీకి వెళ్లి అందరినీ అడిగారు.
హారికకి ఎవ్వరూ బాయ్‌ఫ్రెండ్స్ లేరు అని చెప్పడంతో బయలుదేరి ఇంటికి వచ్చి కూతురు గదిలో వెతికారు. అక్కడ ఎటువంటి క్లూ దొరకలేదు. కానీ రమణి బీరువా తెరచి చూడగా, అందులో దాచిన విలువైన చంద్రహారం కనిపించలేదు.
బీరువా అంతా గాలించి తమ కూతురే ఆ నగను తీసుకుని వెళ్ళిపోయిందని అర్థం చేసుకున్నారు.
"బంగారం తీసుకుని వెళ్లిపోయిందా? అసలు ఎవరితో వెళ్లింది?" అని తెలియక, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రిపోర్ట్ ఇచ్చి, "దయచేసి ఈ విషయం న్యూస్ ఏజెన్సీ వాళ్లకు చెప్పకండి, మా పరువు పోతుంది" అని వేడుకుని ఇంటికి చేరుకున్నారు.
పోలీసులు హారిక చివరి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. మరుసటి రోజు ఉదయం ఇన్స్‌పెక్టర్ నుంచి శేఖర్‌కు ఫోన్ వచ్చింది. "శేఖర్ గారు, మీ అమ్మాయి హైదరాబాద్ నగర శివార్లలోని ఒక మహిళా సంక్షేమ కేంద్రంలో భయంతో దాక్కుని ఉంది.
మీ నగ కూడా దొరికింది, మీరు వెంటనే రండి" అని చెప్పాడు.
పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు శేఖర్, రమణి.
ఎదురుగా భయంతో వణుకుతూ కూర్చుని ఉన్న కూతురిని చూసి రమణి గుండె తల్లడిల్లిపోయింది.
"హారికా! ఏమైందే నీకు? ఎవరైనా నిన్ను బెదిరించారా? అసలు బంగారం పట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని శేఖర్ ఆవేదనతో అడిగాడు. అప్పుడు సైబర్ క్రైమ్ ఇన్స్‌పెక్టర్ జోక్యం చేసుకుని, "సార్, మీ అమ్మాయి ప్రేమలో పడి పారిపోలేదు. 'డిజిటల్ అరెస్ట్' అనే పెద్ద సైబర్ కుట్రలో చిక్కుకుంది" అని చెప్పారు.
హారిక కన్నీళ్లతో అసలు జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. "నాన్న... పది రోజుల క్రితం నాకు ఒక అపరిచిత నంబర్ నుంచి ఫోన్ వచ్చింది.
వాళ్లు ఢిల్లీ పోలీస్, సిబిఐ ఆఫీసర్లమని చెప్పారు. నా ఆధార్ కార్డ్ ఉపయోగించి కెమికల్స్, అక్రమ డ్రగ్స్ కొరియర్ చేశారని, నా పేరు మీద మనీ లాండరింగ్ కేస్ నమోదైందని బెదిరించారు. నేను భయపడి 'నేను ఏ తప్పూ చేయలేదు' అని చెప్పాను.
కానీ వాళ్లు నన్ను రోజూ వీడియో కాల్స్ చేస్తూ 'డిజిటల్ అరెస్ట్' చేశామన్నారు. ఈ విషయం ఇంట్లో చెబితే మీ నాన్న ఉద్యోగం పోతుందని, మిమ్మల్ని జైల్లో పెడతామని భయపెట్టారు.
సమస్య నుంచి బయటపడాలంటే కేస్ క్లియరెన్స్ డిపాజిట్ కింద రూ. 5 లక్షలు కట్టాలని, లేకపోతే సాయంత్రానికల్లా అరెస్ట్ వారెంట్ వస్తుందని నిన్న ఉదయం తీవ్రంగా హెచ్చరించారు.
భయంతో నా మతి స్థిమితం తప్పింది. మీతో చెబితే ఎక్కడ మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తారోనని... ఇంట్లోని చంద్రహారాన్ని తీసుకుని బయటకు వచ్చేశాను.
దాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు వాళ్లకు ట్రాన్స్‌ఫర్ చేద్దామనుకున్నాను. కానీ గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్లేసరికి వాళ్ళు 'ఈ నగ ఎక్కడిది?' అని నన్ను నిలదీసి పోలీసులకి రిపోర్ట్ చేశారు.
నిజం తెలిసాక, ఇది సైబర్ మోసం అని చెప్పి నన్ను ఈ షెల్టర్ హోమ్‌కి తీసుకొచ్చిన పోలీసులు మీకు సమాచారం పంపించారు. నాతో ఆ మోసగాళ్ళకి ఫోన్ చేయించి డబ్బులు రెడీగా ఉన్నాయని చెప్పించి, వాళ్ళ అడ్రస్ ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు" అంది.
ఆ నిజం విన్న శేఖర్, రమణీలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తమ కూతురు ఎంతటి మానసిక నరకాన్ని అనుభవించిందో తలచుకుని శేఖర్ కంటనీరు పెట్టుకున్నాడు.
"పిచ్చిదానా! ఎంత పెద్ద కష్టం వచ్చినా కన్నతల్లిదండ్రులకు చెప్పాలి కానీ, ఇలాంటి అపరిచితుల బెదిరింపులకి భయపడకూడదు. నీకేమైనా అయి ఉంటే మేము బతికేవాళ్లమా?" అంటూ హారికను గుండెలకు హత్తుకుంది రమణి.
పిల్లలకు మంచైనా, చెడు అయినా తల్లిదండ్రుల దగ్గర దాచకుండా చెప్పగలిగే చనువు ఉండాలి. అలా తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచితే ఇప్పుడు చూస్తున్న ఆత్మహత్యలు ఉండవు కదా.
శుభం
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


















Comments