top of page
Original.png

పేరు తెచ్చినా... పెంట చేసినా…

పిల్లల పెంపకం, పేరెంటింగ్, తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల క్రమశిక్షణ, కుటుంబ విలువలు, తెలుగు వ్యాసం, కొత్త విరిత, Parenting Telugu, Child Development, Family Values, Responsible Parenting

పిల్లల పెంపకంలో ప్రేమతో పాటు క్రమశిక్షణ అవసరమని తెలిపే తెలుగు వ్యాసం
పిల్లల పెంపకంలో ప్రేమతో పాటు క్రమశిక్షణ అవసరమని తెలిపే తెలుగు వ్యాసం

Peru Thechhina Penta Chesina Telugu Inspirational Article | Kotha Viritha

పేరు తెచ్చినా... పెంట చేసినా… తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 17/07/2026


పిల్లలకు ప్రేమ అవసరం... కానీ ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా అంతే అవసరం. ప్రతి కోరికను తీర్చడం, ప్రతి తప్పును సమర్థించడం, ప్రతి వైఫల్యానికి ఇతరులను నిందించడం పిల్లల భవిష్యత్తుకు మేలు చేయదు. "పేరు తెచ్చినా... పెంట చేసినా…" అనే ఈ వ్యాసం, తల్లిదండ్రుల పాత్ర ఎంత కీలకమో హృదయాన్ని తాకే రీతిలో వివరిస్తుంది.


పిల్లలను పెంచడం అంటే ప్రేమ మాత్రమే కాదు, పరిమితులు కూడా. కానీ ఈ రోజుల్లో పరిమితులు పెడితే "పిల్ల బాధపడుతుంది" అంటారు. తప్పు చేస్తే మందలిస్తే "ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది" అంటారు. 


అలా ప్రతి తప్పును "చిన్నపిల్లే కదా" అని కప్పిపుచ్చేస్తారు. 


పాఠశాల తప్పు, సమాజం తప్పు, స్నేహితుల తప్పు, 

కానీ తమ పెంపకంలో తప్పు మాత్రం కనిపించదు. 


"మా బాబు అలాంటివాడు కాదు" అనే వాక్యం చాలామందికి మంత్రం. 


సాక్ష్యాలు చూపించినా నమ్మరు, సాకులు మాత్రం వెతుకుతారు. ప్రేమ పేరుతో బాధ్యతను దూరం చేస్తారు. 


స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణను మరిచిపోతారు. 


చివరికి పిల్లలు ప్రపంచాన్ని కాదు, ప్రపంచమే వారిని భరించాల్సి వస్తుంది. 


పిల్లల ప్రతి కోరిక తీర్చడం గొప్ప తల్లిదండ్రితనం కాదు. 

ప్రతి కోరికకు "కాదు" అని కూడా ఒకోసారి చెప్పాలి. చిన్నప్పుడు సాగిన కోరికల పరంపర పెద్దయ్యాక లేకపోతే అటు తల్లితండ్రులను ఇటు జీవితాన్ని నిందించడం మొదలవుతుంది. 


పిల్లలు చేసిన తప్పుకు సమాజాన్ని నిందించే ముందు, ఆ తప్పుకు చప్పట్లు కొట్టిన రోజులు గుర్తు చేసుకోవాలి. పిల్లల విజయానికి తల్లిదండ్రులు గర్వంగా నిలుస్తారు. 

అయితే వారి వైఫల్యానికి కూడా అదే అద్దంలో తమ ప్రతిబింబం చూడాలి. 


ఎందుకంటే పేరు తెచ్చినా... పెంట చేసినా... విత్తనం వేసింది పెంపకమే. 


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత
కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Radha R
Radha R
2 days ago
Rated 5 out of 5 stars.

Hi supare viritha

Like

Rated 5 out of 5 stars.

Excellent 👌 👌 👌

Like
bottom of page