top of page
Original.png

పో...!


“రా” అనే ఆహ్వానం, “పో” అనే తిరస్కరణ మధ్య బంధాల సున్నితత్వాన్ని చూపించే భావోద్వేగ దృశ్యం

Po Telugu Inspirational Article | Kotha Viritha

పో...! తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 09/08/2026


మనిషి జీవితంలో కొన్ని మాటలకు అర్థం కంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. “రా” అనే మాట మనసుకు దగ్గర చేస్తే, “పో” అనే మాట అదే మనసును దూరం చేయగలదు. ఒక బంధాన్ని నిర్మించడానికి సమయం, నమ్మకం, అనురాగం అవసరం. కానీ దాన్ని దెబ్బతీయడానికి కొన్నిసార్లు ఒక్క మాట చాలు.

రచయిత్రి కొత్త విరిత రాసిన “పో...!” రచన, మాటల విలువను, బంధాల సున్నితత్వాన్ని, మనం మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరాన్ని సున్నితంగా గుర్తుచేస్తుంది.


"రా" అనటానికి పట్టిన టైమ్... "పో" అనటానికి పట్టదు.


"రా" అనేది కేవలం ఒక పిలుపు కాదు,అది నమ్మకానికి ఇచ్చే ఆహ్వానం.మనసులో చోటు ఇవ్వడానికి చేసిన ప్రయత్నం.ఒక బంధానికి వేసిన తొలి అడుగు.

కానీ "పో"...అది ఒక్క మాటే అయినా,కొన్నిసార్లు జీవితాంతం మిగిలిపోయే గాయం.


అది రిలేషన్‌షిప్‌లో అయినా,

ఆఫీస్‌లో అయినా,

స్నేహంలో అయినా,

లేదా ఏ వేదికలో అయినా ఇదే నిజం.


ఆఫీస్‌లో కొత్త వ్యక్తి చేరితే,

వివరాలు సేకరిస్తారు, డేటాబేస్‌లో నమోదు చేస్తారు,ఐడీ కార్డు ఇస్తారు,సిస్టమ్ యాక్సెస్‌లు కల్పిస్తారు.ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి రోజులు, కొన్నిసార్లు వారాలు కూడా పడుతుంది.


కానీ వెళ్లే రోజు...?

అదే యాక్సెస్‌లు, అదే ఐడీ, అదే గుర్తింపు,

ఒక్క గంటలో ముగిసిపోతాయి.


మనుషుల జీవితాల్లో కూడా అంతే.బంధాన్ని నిర్మించడానికి సమయం పడుతుంది.తెంచేయడానికి ఒక్క మాట చాలు.


అందుకే "పో" అనేముందు ఒక్కసారి ఆలోచించాలి,

ఎందుకంటే "రా" అని మళ్లీ పిలిచే అవకాశం ప్రతిసారీ దొరకదు.


"పో" అనేది చిన్న మాట కావచ్చు... కానీ దాని ప్రభావం చాలా పెద్దది.


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత
కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

6 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rupesh
Rupesh
a day ago
Rated 5 out of 5 stars.

Super

Like

HARISH
HARISH
2 days ago
Rated 3 out of 5 stars.

ప్రాబ్లెమ్ ఏంటంటే మేడం.. పో అని ఎవరు అనరు.. ఇగ్నోర్ చేస్తారు.. ఫోన్ ఎత్తరు.. Msg చూసి రిప్లై ఇవ్వరు..

Infact నిజంగా పో అంటే చాలా మంచిది.. రీసన్ చెప్తే ఇంకా బెటర్.. ఓకే లైఫ్ లాంగ్ క్వశ్చన్ మార్క్ ఉండే కంటే.. నేనేమి తప్పు చేసాను అనేది అనేది చెప్తే బెటర్

Like

Rated 5 out of 5 stars.

Wow! Well written

Edited
Like

Rated 5 out of 5 stars.

Excellent write up

Like

Alshad Sk
Alshad Sk
2 days ago
Rated 5 out of 5 stars.

Nice

Like
bottom of page