top of page
Original.png

ప్రతి మోసం వెనుక…

ప్రతి మోసం వెనుక, తెలుగు వ్యంగ్య కథ, సోషల్ మీడియా వ్యంగ్యం, జీవిత సత్యాలు, కొత్త విరిత కథలు, తెలుగు షార్ట్ స్టోరీ, motivational Telugu Article, Telugu satire story, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'ప్రతి మోసం వెనుక' వ్యాసంలో  నిజాయితీ, మోసం మధ్య జీవిత నిర్ణయాన్ని సూచిస్తూ కూడలిలో నిలబడి ఆలోచిస్తున్న వ్యక్తిని ప్రతిబింబించే భావోద్వేగ దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'ప్రతి మోసం వెనుక' వ్యాసంలో  నిజాయితీ, మోసం మధ్య జీవిత నిర్ణయాన్ని సూచిస్తూ కూడలిలో నిలబడి ఆలోచిస్తున్న వ్యక్తిని ప్రతిబింబించే భావోద్వేగ దృశ్యం.

Prathi Mosam Venuka Telugu Inspirational Article | Kotha Viritha

ప్రతి మోసం వెనుక… తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 07/07/2026


మనిషి చేసే ప్రతి మోసానికి పరిస్థితులే కారణమా? లేక ఆ పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలే అసలు కారణమా? "ప్రతి మోసం వెనుక…" అనే ఈ ఆలోచనాత్మక వ్యాసం పరిస్థితులు, నమ్మకం, బాధ్యత, నిజాయితీ వంటి విలువలను లోతుగా విశ్లేషిస్తూ, జీవితంలో మన నిర్ణయాలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయని స్పష్టంగా తెలియజేస్తుంది.


"ఎవరూ  ఎవరినీ  మోసం చేయాలని అనుకోరు, పరిస్థితులు అలా అయిపోతాయి అంతే" అని చాలామంది అంటారు.


అది కొంతవరకు నిజమే కావచ్చు. కానీ అదే ఒక్క నిజం అయితే ఈ ప్రపంచంలో పగలు, ప్రతీకారాలు, విరిగిపోయిన బంధాలు, నమ్మకద్రోహం అనే పదాలకు అర్థమే ఉండేది కాదు.

పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి. కానీ మోసం చేయాలా, నిజాయితీగా నిలబడాలా అనేది పరిస్థితులు కాదు, అది మన నిర్ణయం.


ఒకరు మోసం చేసినప్పుడు వారికి అది "పరిస్థితి"గా అనిపించవచ్చు. కానీ మోసపోయిన వ్యక్తికి అది జీవితాంతం మిగిలిపోయే గాయం.

చేసినవాడు కారణాలు చెబుతాడు. భరించినవాడు జ్ఞాపకాలు మోస్తాడు.


ప్రతి తప్పుకు "పరిస్థితులు" అనే పేరు పెడితే, ప్రతి బాధకు "మర్చిపో" అని చెప్పాల్సి వస్తుంది.

నిజానికి మనిషి గొప్పతనం మంచి పరిస్థితుల్లో కాదు, కష్టమైన పరిస్థితుల్లో కూడా తన విలువలను వదలకుండా నిలబడినప్పుడే తెలుస్తుంది.


గుర్తుంచుకోండి... ప్రతి మోసం వెనుక పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించేది మనిషే. పరిస్థితులు మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ వాటి పేరుతో మనం తీసుకునే నిర్ణయాలకు మాత్రం పూర్తి బాధ్యత మనదే.


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత
కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

3 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Excellent write up

Like

Kishan Kotha
Kishan Kotha
5 days ago
Rated 5 out of 5 stars.

అవసరం కోసం ఎదుటివారిని మోసం చేసినా, మోసానికి గురి పడ్డవాడు జీవితాంతం బాధపడతాడు. నైస్లీ ఎక్స్ప్లెయిన్డ్

Like

Haritha kotha
Haritha kotha
5 days ago
Rated 5 out of 5 stars.

True

Like
bottom of page