top of page
Original.png

ప్రవర్తన - శిక్షణ - పార్ట్ 2

#AyyalaSomayajulaSubrahmanyam, #ప్రవర్తనశిక్షణ, #PravarthanaSikshana, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #కొసమెరుపు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Pravarthana Sikshana - Part 2/2 - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 22/12/2025

ప్రవర్తన - శిక్షణ - పార్ట్ 2/2 - పెద్ద కథ

రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

జరిగిన కథ: పౌరోహిత్యం తో జీవనం గడుపుతుంటాడు నారాయణ. పెద్ద కొడుకు రమేష్ పెడదారి పట్టడంతో మందలిస్తాడు. కానీ తిరగబడతాడు రమేష్. పక్కింటిలో ఉన్న రిటైర్డ్ ఇంజనీర్, పెద్దమనిషి అయిన రాఘవగారు విషయాన్ని గమనిస్తారు. 


ఇక ప్రవర్తన - శిక్షణ పెద్ద కథ రెండవభాగం చదవండి.


“నెలరోజులు మామూలుగా గడిచాయి. మొదట్లో నన్ను ఏడిపించడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఏమనుకున్నాడో ఏమో వారం రోజుల నుంచి కొద్దిగా బుద్ధిగా ఉంటున్నాడు. బయట తిరుగుళ్ళు తగ్గాయి. అమ్మయ్య.. దోవకి వస్తున్నాడనుకుంటే నిన్న సాయంత్రం అంజి టీ సెంటర్ దగ్గర పోలీసులు వీడిని, వీడి ఫ్రెండ్స్ ను పట్టుకుని రాత్రంతా సెల్ లో ఉంచి పొద్దున్నే వదిలేశారుట. పొద్దున్నే ఇంటికి వచ్చాడు” నారాయణ గారు వాపోయారు. 


“అయ్యో అదేమిటి; పోలీసులు పట్టుకుని వెళ్ళడమేమిటీ?సెల్ లో రాత్రంతా ఎందుకు ఉంచినట్టు? రమేష్ మీకు ఏమైనా చెప్పాడా?” రాఘవగారు ఆత్రుతగా అడిగారు. 


వాడు ఏమీ చెప్పలేదు. ఎందుకు సెల్ లో పెట్టారు అంటే తనకు తెలీదంటున్నాడు. రామయ్య చౌదరీ అని మన పక్క వీదిలోనే ఉంటాడు. పెద్ద కాంట్రాక్టర్. నెల క్రితం నన్ను కలిసి మీ అబ్బాయి మా అమ్మాయి వెంటబడి వేధిస్తున్నాడు. పద్దతి మార్చుకోకపోతే తరువాత జరిగే దానికి తన బాధ్యత ఉండదు అని చెప్పాడు. ఆ సంగతి వీడికి చెబితే వీడు లెక్క చేయలేదు. ఇప్పుడు ఇలా అయింది. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. మీరు ఒకసారి వస్తారా” అడిగారు నారాయణ గారు. 


“తప్పకుండా వస్తాను. ఇప్పుడు కూడా మీరు రమేష్ తో మాట్లాడవద్దు. పట్టనట్లుగా నిర్లిప్తంగా వుండండి. బహుశా రామయ్యచౌదరి గారు పోలీసులకు రిపోర్ట్ చేసి వుంటారు. 

చెడు పనుల ఫలితం ఇలాగే ఉంటుంది. మీ బాధను బయటికి చూపించవద్దు. ఇనుము వేడెక్కింది. ఇప్పుడే సమ్మెట దెబ్బ పడాలి. అర్థమైందా. ” 


నారాయణ గారు తల వూపారు. 

“మీరు కంగారుపడకండి. నేను వస్తున్నాను. మీరు నాకు ఏమీ చెప్పలేదు. రమేష్ ను తీసుకెళ్ళి కొంచెం కౌన్సిలింగ్ ఇప్పిద్దాం. కథ మొత్తం నేను నడిపిస్తాను. మీరు పరాయివాడిగా ఉండండి.”


రాఘవ గారు నారాయణ గారి వెంట వారి ఇంటికి వెళ్ళారు. 

రమేష్ పడక్కగదిలో మూలుగుతున్నాడు. అతని తల్లి ఏడుస్తున్నది. రాఘవ గారిని చూసి ఏదో చెప్పబోయింది. రాఘవ గారు వద్దని సంజ్ఞ చేశారు. 

“ఏమంయిదయ్యా రమేష్? ఎందుకు మూలుగుతున్నావు? చెప్పు.” రాఘవ గారు సానుభూతిగా అడిగారు. 


రమేష్ అవమానంతో తల దించుకున్నాడు. ఏమీ మాట్లాడలేదు. 


“చూడు రమేష్. నీవు మూలుగుతూ వచ్చావని మీ నాన్నగారు చెప్పారు. ఎవరి గొడవ లో నైనా తల దూర్చావా? ఏది ఏమైనా అలా మా ఇంటికి వెళుతూ మాట్లాడుకుందాం. ఇక్కడ చెప్పడానికి భయం, సిగ్గు పడుతున్నట్టుగా ఉంది. ”

పోలీసులు తనని సెల్లో పెట్టారని తండ్రి చెప్పలేదని అప్పటికి అర్థమైంది రమేష్ కి. మొహం కొద్దిగా తేటపడింది. 


“అంకుల్; ఎవరో అమ్మాయిని కొంతమంది వెదవలు ఏడిపిస్తుంటే నేను అడ్డుకుని వారించాను. వాళ్ళు పగబట్టి నన్ను ఇరికించి కటకటాల వెనక తోయించారు. ”


“నీకెందుకయ్యా అనవసరపు గొడవలు. ఆ అమ్మాయి పోలీసు లకు కంప్లైంట్ ఇస్తే ఆ రౌడీల సంగతి వాళ్ళే చూసుకునేవారు. ఇప్పుడు చూడు ఆ అమ్మాయి బాగుంది. నిన్ను సెల్ లో వేయించిన వాళ్ళు బాగున్నారు. మధ్య నీవు నలిగి పోయావు. నీపేరు పోలీస్ రికార్డ్ లో ఉంది. నడువ్వు. మనం కూడా ఒక రిపోర్ట్ ఇద్దాం పద. ”


“వద్దు. వద్దు. అంకుల్. ఇంకా పగలుపెంచుకుని మళ్ళీ ఈ సారి కొట్టినా కొడతారు. నాకు బుద్ధి వచ్చింది. ఇక నేను బాధ్యత గా వుంటాను. నాన్నగారు నాతో మాట్లాడటం లేదు. కటకటాల నుంచి వచ్చినా కనీసం అయ్యో అనలేదు. అమ్మ ఒకటే ఏడుస్తోంది. తప్పంతా నాదే. ఇద్దరినీ బాధ పెట్టాను. నాన్నగారిని నాతో మాట్లాడమని చెప్పండి” రమేష్ ఏడుస్తూ అన్నాడు. 


“అలాగే చెబుతాను. ; రమేష్ తో మాట్లాడండి. ” కళ్ళతో వద్దు అన్నట్లు సైగ చేశారు రాఘవ. 


“తప్పకుండా మాట్లాడుతాను. కానీ ఇప్పుడు కాదు. వాడు ప్రయోజకుడు అయినాక మాట్లాడుతాను. ”


“మాట్లాడుతారు లేవయ్యా. నీ మీద నాన్నగారికి చాలా ప్రేమ వుంది. నీకోసమే నీతో మాట్లాడటం లేదు. ”. 


“ఏమైందండీ “ అంటూ సుభద్రమ్మ బయటకి వచ్చి అడిగింది. 


“తర్వాత చెబుతాను. నారాయణ గారూ.. రమేష్ ను తీసుకురండి. ”. 


ముగ్గురు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చారు. ” రమేష్, నీవు రెస్ట్ తీసుకో. ఇంకేమి ఆలోచించకు. ఒక్కొక్కసారి అంతే. మన తప్పు ఏమీ లేకపోయినా ఇలా అవుతుంది. నారాయణ గారూ; మీ పనులు మీరు చూసుకోండి “ అన్నారు రాఘవ. 


“అంకుల్; మీతో మాట్లాడాలి. మళ్ళీ వస్తారుగా. ” రమేష్ దీనంగా అడిగారు. 


“తప్పకుండా వస్తాను. నీవు విశ్రాంతి తీసుకో. ప్రశాంతంగా పడుకో. ” అంటూ రాఘవ తన ఇంటికి వెళ్ళారు. 


జరిగినదంతా సుభద్రకు చెప్పారు. మధ్యాహ్నం భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుని రమేష్ ని కలవటానికి వెళ్ళారు రాఘవ. 


“ఏం, రమేష్; భోజనం చేశావా? ప్రశాంతంగా పడుకున్నావా?”


“భోజనం అయ్యింది అంకుల్. అంకుల్..” అంటూ కాస్త ఆగాడు.  


“చెప్పు, రమేష్: నీ మేలు కోరేవాడిని. ఏం సంకోచపడవద్దు”


“అంకుల్; నా జీవితం అడ్డదారి తొక్కింది. చదువు మధ్యలోనే ఆపేశాను. పౌరోహిత్యం మంచిగా చేసుకుంటున్న వాడినల్లా, చెడు స్నేహాల వలన పాడైపోయాను. అమ్మనాన్న 

లకు నామీద అసహ్యం వేసినట్టుంది. అందుకే నాతో మాట్లాడటం లేదు. ఇప్పుడు కూడా మీకు అబద్ధం చెప్పాను. నిజానికి కాంట్రాక్టర్ చౌదరి గారమ్మాయి వెంటపడితే, ఆయన పోలీసులకు రిపోర్ట్ చేసినట్లున్నారు. అందుకే పోలీసులు నన్ను సెల్ లో వేశారు. 


అందుకే పోలీస్ రిపోర్ట్ ఇవ్వవద్దన్నాను. అమ్మనాన్నాలతో చాలా అవహేళన గా మాట్లాడాను. రౌడిలతో తిరిగాను. నాన్నగారికి చుట్టుపక్కల ఎంతో మంచి పేరుంది. కనబడితే చాలు అందరూ చేతులెత్తి దండం పెడతారు. మన నడవడిని బట్టి మనతో ప్రవర్తించే వాళ్ళు కూడా ఉంటారు. నేను పౌరోహిత్యం చేస్తున్నప్పుడు కూడా నన్ను ఎంతో గౌరవంగా చూసేవారు. నాకు జరగవలసిన శాస్తి జరిగింది. ఇక ఎటువంటి పిచ్చిపనులు చేయను. ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నాను. కానీ నా భవిష్యత్ ఏమిటీ? 


చదువు లేదు కనుక ఉద్యోగం రాదు. ఏమి చేయాలీ? ఎలా బతకాలి. నాన్నగారి మీద ఆధారపడ లేను. నేను తినే తిండి నేనే సంపాదించుకోవాలి. నేను బాగుపడి అమ్మా నాన్న కళ్ళలో వెలుగు చూడాలి. కానీ నావల్ల నాన్నగారు ఎంత బాధ పడి విరక్తిభావం చెందారో నా ఉనికినే గమనించటం లేదు. నన్ను ఎంత బాగా గారాబంగా పెంచారో, ఇప్పుడు అంత వెగటు పోయానేమో. ఇకనైనా నాన్నగారు నన్ను క్షమించరు.. నేను బతకడం దండగ. ” ఏడుస్తూ అలా మాట్లాడేస్తున్నాడు రమేష్. 


రాఘవ కంగారు పడలేదు. మౌనంగా రమేష్ ని కాసేపు చూశారు. ఏడవటం వలన మనస్సులో ఉన్న కల్మషాలు పోయి రమేష్ శుద్ది అవుతాడు. 


“రమేశ్, నీవు నిజంగానే పశ్చాత్తాపపడితే హాయిగా బతకటానికి బోలెడు మార్గాలు వున్నాయి. చచ్పిపోయి అమ్మా, నాన్న లకు కడుపు కోత పెడతావా?నాన్న ఏమన్నారు? నీవు బాగుపడిన నాడు నీతో మాట్లాడతా అన్నారు. దానిని చాలెంజింగ్ గా తీసుకుని ఇక ఎలా బతకాలి. చదువు లేదు అన్నావు. ఒక పాటలో అన్నట్లు చదువుకున్న వాళ్ళు టీచర్లుగా పని చేస్తుంటే, చదువు లేని వాళ్ళు స్కూల్స్, కాలేజీలు పెట్టి కోట్లు కూడపెడుతున్నారు. నీకు కూడా మంచి మార్గం వుంటుంది. బెంగపడకు. నేను సహాయం చేస్తాను. ”ఓదార్చారు రాఘవ గారు. 


“ఇంత ధైర్యం చెబుతున్నారు. మీతో మాట్లాడుతుంటే నేను బాగు పడతాననే నమ్మకం కలుగుతోంది. చెప్పండి. మీరే మార్గం సూచించండి. ”. 


“చదువుతో సంబంధం లేకుండా చేసే వృత్తి పనులు చాలా వున్నాయి. కరెంటు పనులు, ప్లంబింగ్ పనులు, ఐరన్ ఫ్యాబ్రికేషన్, ఏసీ ఫ్రిజ్ ల మరమ్మతులు, మోటార్ వైండింగ్, కార్ల రిపేర్, కంప్యూటర్ నాలెడ్జ్ వుంటే ఈసేవా సెంటర్ లాంటి కి విపరీతమైన డిమాండ్ గల వృత్తులు ఎన్నో వున్నాయి. వీటి డిమాండ్ పెరిగేదే కానీ, తగ్గేదే కాదు. కానీ ఇవి నేర్చుకోవాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. ఆ తరువాత ఫరఫెక్ట్ అయితే సొంతంగా ప్రారంభించవచ్చు.


ఏ వృత్తిలో అయినా సమస్యలు ఎదురవుతుంటాయి. మొదట్లో చాలా కష్టం గా వుంటాయి. ధైర్యంగా ముందుకు పోతే కొత్త కొత్త మెలకువలు తెలుస్తాయి. నైపుణ్యానికి అంతం లేదు. చేసిన కొద్దీ పెరుగుతుంది. ఇవన్నీ టేబుల్ వర్క్స్ కావు. వైట్ కాలర్ జాబ్స్ కావు, శారీరకంగా కష్ట పడాలి. పిండినకొద్దీ పాలు. అయితే నీవు ఇది వరకు నీ నాన్నగారిలా పౌరోహిత్యం చేస్తు వుండేవాడివి కదా; మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టు. ఎలాను అలవాటైన విద్య, విషయాలు కాబట్టి తొందరగా అల్లుకుపోగలవు. ”


“సరే అంకుల్. నేను ఈసేవా సెంటర్ స్టార్ట్ చేస్తాను. ఒక ప్రక్క పౌరోహిత్యం చేస్తూనే అది కూడా నడుపుతాను. నాకు కంప్యూటర్స్, దాని పరికరాలు, పరిజ్ఞానం కావాలి. ”


“సరే, రమేష్; నిన్ను నవభారత్ ఆన్ లైన్ సర్వీసెస్” లో చేర్పిస్తాను. నీకు ఎలాను కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కదా; జాగ్రత్త గా మసలుకోవాలి. నీవు మంచి పేరు తెచ్చుకోవాలి. నాకు మంచి పేరు తేవాలి. ” రాఘవ చెప్పారు. 

 —————————+—+++————————————

చూస్తుండగానే మూడు సంవత్సరాల గడిచిపోయాయి. నారాయణ గారినుండి ఎటువంటి ఫిర్యాదులు లేవు. ఎందుకంటే ఇప్పుడు రమేష్ మొత్తం ఆయన అదుపాజ్ఞలలో వుంటున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా వుంటూ, తను కంప్యూటర్ టెక్నికల్ కోర్స్లు నేర్చుకుంటూ వుంటున్నాడు. పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వయంగా చేయిస్తున్నాడు. 


“అంకుల్, నేను ఈసేవా సెంటర్ పెడుతున్నాను. నా జీవితం మలుపు తిరిగినదంటే అది మీ చలవే దానిని మీరే ప్రారంభించాలి “ అంటూ ఒక కరపత్రం ఇచ్చాడు. 


అందులో “నారాయణ ఆన్ లైన్ సర్వీసెస్” అని వుంది. 


చీఫ్ గెస్ట్. రాఘవ గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ చే ప్రారంభం అని వుంది. 

“మా ఓనర్ నా పనిని మెచ్చుకుని ఈ ఇక్విప్మెంట్ మరియు కంప్యూటర్ ఇచ్చారు. మిగిలిన పెట్టుబడి అంతా నా సంపాదన”


“చాలా సంతోషం. అయినా ఓపెనింగ్ నాన్నగారితో చేయిస్తే బాగుంటుంది కదా:”


 “మీ చేత చేయించమని నాన్నగారు చెప్పారు. మా ఓనర్ గారు ఫస్ట్ బిల్ ఆయన టైప్ చేస్తారు. ముహూర్తం నాన్నగారే పెట్టారు. మీరింకేమి మాట్లాడవద్దు. మీరు అందరూ 

 రావాలి. ” అని చెప్పి వెళ్ళాడు. 


“అబ్బో మీరు రిబ్బన్ కటింగ్ చేస్తారన్నమాట. కొద్దిగా ఉబ్బినట్లున్నారే” ఎగతాళిగా సుభద్ర అంది. 


“ఔను. వాడి జీవితం మంచిమలుపు తిరిగందంటే దానికి కారణం నేనే. నారాయణ గారిని రమేష్ తో మాట్లాడవద్దని చెప్పాను. ఆయన నా సలహా పాటించారు. అప్పటిదాకా తనేం చేసినా చెల్లుతుందని అనుకునే వాడు. తండ్రి తనను ఇలా పట్టించుకోవడం మానతాడని ఏమాత్రం ఊహించలేదు. అప్పడే ఆత్మావలోకనం వాడిలో ప్రారంభమైంది. అసలు రహస్యం నీకు మాత్రమే చెబుతున్నాను. విను. అప్పుడు వీడిని పోలిసులు అరెస్టు చేసి సెల్ లో పెట్టింది ఆ చౌదరి గారి కంప్లైంట్ కాదు. నేనే చేయించాను. కీలెరిగి వాత పెట్టమన్నారు. ఆ ఇనస్పెక్టర్ నాకు బాగా తెలుసు. అతనికి వీళ్ళ చెడు తిరుగుళ్ళ గురించి చెబితే, సెల్ లో వేసి 

వేరే సెల్ వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంటే వీళ్ళకి వణుకు వచ్చింది. నేను చెప్పానని అతను ఆ పని పూర్తిచేశాడు. ఇదీ దాని ఫలితం. 


వీడు వస్తుతః మంచివాడే. కానీ చెడు స్నేహాలు, తల్లిదండ్రుల అతిగారాబం వీడిని చెడగొట్టాయి. తనతండ్రి మాట్లాడక పోవడం, పోలీసు స్టేషన్ నుంచి వచ్చిన తరువాత ఒక్క ఫ్రెండ్ రాకపోవడంతో వీడిలో మార్పు తెచ్చి 

అసలు మనిషి బయటకు వచ్చాడు. మీ ఆయన తెలివితేటలు అర్థమైనాయా “ గర్వంగా అడిగారు రాఘవ. 


“అందుకేగా మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నది” నవ్వుతూ అన్నది సుభద్ర. 


 కార్తీక పున్నమి నాడు రాఘవ గారు మహన్యాస రుద్రాభిషేకం మరియు సత్యనారాయణ స్వామి వ్రతం రమేష్ తోనే చేయించుకున్నారు. రమేష్ నమక చమకములు, శ్రీసూక్త, పురుష సూక్త దశమశాంతులతో సాంగోపాంగంగా చేయించాడు. ప్రొద్దున్న ఎనిమిది గంటలకు మొదలైన అభిషేక కార్యక్రమం మధ్యాహ్నం రెండింటికి ముగిసింది. మళ్ళా సాయంత్రం ఏడు గంటలకు మొదలైన సత్యనారాయణస్వామి వ్రతం తొమ్మిది గంటలకు ముగిసింది. ఆరోజు రమేష్ చేయించిన పూజా విధానాలు చూసి నారాయణ దంపతులు ఎంతో పొంగిపోయారు. తమ కొడుకు ఇంతలా అభివృద్ధి పథంలో వెళుతున్నందులకు. 


కొసమెరుపు; తండ్రి సత్యాగ్రహం అనే ఆయుధం ద్వారా అనగా కొడుకు తో మాట్లాడకుండా మౌనపోరాటం ద్వారా కొడుకు లో మార్పు తెప్పించాడు. 

——————————————-శుభంభూయాత్————————+++++——————


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.


అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.


ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,


ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి


మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి,మన తెలుగు కథలు.కామ్‌.


బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక


ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.


కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.


ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు


త‌పస్విమనోహరము.


ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌


చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.


సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.


ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.


కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page