top of page
Original.png

వాడేనయం

వాడేనయం, తెలుగు హాస్య కథ, ఫన్నీ తెలుగు స్టోరీ, భార్య భర్తల హాస్యం, కుటుంబ హాస్య కథ, కార్పొరేట్ హాస్పిటల్ కథ, తెలుగు కామెడీ కథ, వినోద కథ, తెలుగు కథలు, కుటుంబ వినోదం

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'వాడేనయం' కథలో ఐసీయూలో చికిత్స పొందుతున్న సుబ్బారావు, చుట్టూ డాక్టర్లు, సహోద్యోగులు ఉండగా, నేపథ్యంలో భార్య చేతిలో గరిటెతో భర్తను తరుముతున్న హాస్యభరిత దృశ్యం కనిపిస్తున్న చిత్రం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'వాడేనయం' కథలో ఐసీయూలో చికిత్స పొందుతున్న సుబ్బారావు, చుట్టూ డాక్టర్లు, సహోద్యోగులు ఉండగా, నేపథ్యంలో భార్య చేతిలో గరిటెతో భర్తను తరుముతున్న హాస్యభరిత దృశ్యం కనిపిస్తున్న చిత్రం.

Vade Nayam - Telugu Family Comedy Story | Mohana Krishna Tata

వాడేనయంతెలుగు కుటుంబ హాస్య కథ | తాత మోహనకృష్ణ

Published In manatelugukathalu.com On 10/07/2026


ఒక్క మాట... ఒక చిన్న అబద్ధం... ఒక అమాయక భిక్షగాడు... చివరికి ఐసీయూ వరకు వెళ్లిన భర్త! భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలను హాస్యభరితంగా చిత్రిస్తూ, చివర్లో ఊహించని ట్విస్ట్‌తో నవ్వులు పూయించే వినోదాత్మక తెలుగు కథ "వాడేనయం". కుటుంబ జీవితం, దాంపత్య హాస్యం, కార్పొరేట్ నేపథ్యం కలిసి పాఠకులను కడుపుబ్బా నవ్వించే కథ.


అదొక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్. అక్కడ ఎలాంటి జబ్బునైనా నయం చేస్తారని పెద్ద బోర్డు. అక్కడ రిసెప్షన్ లో పనిలేక ఖాళీగా ఉన్న ఒక అమ్మాయి మరో అమ్మాయితో...


"మన హాస్పిటల్ లో జాయిన్ అవ్వడానికి ఒకేసారి గుంపులుగా చాలా మంది ఇటే వస్తున్నారు. ఈసారైనా మనకి జీతాలు ఫుల్ గా వస్తాయేమో!"


"హాస్పిటల్ లో జాయిన్ అవ్వడానికో, లేక మనల్ని కొట్టడానికో కాదు! 401 రూమ్ లో ఉన్న సుబ్బారావు పేషెంట్ ని చూడడానికి వచ్చిన ఆఫీస్ స్టాఫ్ వీళ్ళంతా. ఆయన మేనేజర్ కదా మరి... చూడడానికి రాకపోతే ఎక్కడ ఇంక్రిమెంట్ లేక ప్రమోషన్ రాదనో కాబోలు పరుగున వచ్చేసారు!"


"ఇంతకీ ఏమైందో అతనికి పాపం..!"


"ఐసీయూలో ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు..సీరియస్ అంటా..!"


"హార్ట్ ఎటాక్ అయి ఉంటుంది..ఎన్ని ఆఫీస్ టెన్షన్స్ ఉన్నాయో పాపం!"


"స్పృహ వస్తే గానీ డాక్టర్స్ ఏమీ చెప్పలేరుట. బయట ప్రెస్ వారు, మీడియా వారు కూడా ఈయన స్పృహలోకి రావడం కోసమే ఎదురుచూస్తున్నారు. పేరున్న మనిషి కదా!"


"మీడియా వారికి కవర్ చెయ్యడానికి బయట ఎక్కడా న్యూస్ లేదు. ఏం చేస్తారు? ఇక్కడేమైనా బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుందేమోనని వెయిటింగ్. దాన్నే తిప్పి తిప్పి రోజంతా వెయ్యొచ్చుగా, అందుకే!"


మూడు రోజుల తర్వాత సుబ్బారావుకు మెలకువ వచ్చింది. 'వద్దు.. వద్దు.. నన్నేమీ చెయ్యొద్దు' అని కలవరిస్తున్నాడు. చుట్టూ చేరిన జనం.. "సుబ్బారావుగారు! మీ మీద నక్సల్ దాడి ఏమైనా జరిగిందా?" అడిగాడు ఒకడు.


"ప్రొఫెషనల్ కిల్లర్స్ దాడి చేసారా? ఎలా జరిగింది?" అంటూ చుట్టూ ఉన్నవారు ప్రశ్నల వర్షం కురిపించారు.

"జరిగిన విషయం మీకు తెలియాలంటే, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి... అందరూ పైన తిరుగుతున్న ఫ్యాన్ కేసి చూడండి. ఫ్లాష్ బ్యాక్ లోకి పోదాము..." అంటూ పైకి చూసాడు సుబ్బారావు.


ఒకరోజు నేను కాలిమీద కాలు వేసుకొని, పేపర్ చదువుతున్నాను. వంటింటిలోంచి ఏదో సడన్ గా గుర్తు వచ్చినట్టుగా కోపంగా బయటకు వచ్చింది నా పెళ్ళాం. నేను ఏదో పోపు మాడిందో లేక కూర మాడిందో అనుకుని మళ్ళీ పేపర్ లో మునిగిపోయాను. మా ఆవిడ చేసే వంటకి ఎప్పుడూ కూర మాడడమో, పోపు మాడడమో కామన్.


"ఏమండీ..!"


"చెప్పండీ..!"


"రోజూ వచ్చే ఆ ముష్టివాడిని మన వీధిలోకి రాకుండా చూడండి..నాకు చాలా కోపం తెప్పిస్తున్నాడు" 


"ఏమైంది? వాడేం చేశాడు పాపం? వాడికేమైనా కొత్త వైరస్ వచ్చిందా?"


"అదేమీ కాదండీ..! నిన్న ప్రేమగా అమ్మా అని అడుక్కుంటే... అన్నం, కూర వేసాను. అదే మొన్న మీరు లొట్టలేసుకుని తిన్నారే..! నేను చేసిన అమృతమే అన్నారుగా..అదే!"


"అయితే ఏమైంది?"


"ఈ రోజు మళ్ళీ వచ్చి, ఎప్పుడూ ఆ దిక్కుమాలిన సీరియల్స్ కాదు, వంట ఛానల్స్ చూసి వంట చెయ్యమని సలహా ఇచ్చాడు."


"గ్రేట్! వాడేనయం. నేను అనలేని మాట వాడు అనేసాడు.. సంతోషం!" అంటూ పకపక నవ్వాడు.


"అయితే మీరు నా వంట విషయంలో రోజూ అబద్దం ఆడుతున్నారనమాట! మీకు ఎంత ధైర్యం!" అని కోపంతో చేతికి ఏది దొరికితే దానితో పని పట్టింది


"అంతే! కళ్ళు తెరిచేసరికి ఇక్కడ ఐసీయూలో ఉన్నాను. మేనేజర్ అయినా, పెళ్ళానికి మొగుడే కదా!" అని చెప్పి కోమాలోకి జారుకున్నాడు సుబ్బారావు.


సమాప్తం. 

***********

 తాత మోహనకృష్ణ గారి కొన్ని ఇతర రచనలు:


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

తాత మోహనకృష్ణ
తాత మోహనకృష్ణ

రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page