top of page
Original.png

వందనం గిరి నందినీ ప్రియ నందనా!

45 minutes ago
2 min read

గణపతి ఆలయంలో పద్మ పీఠంపై కూర్చున్న శ్రీ వినాయకుని కరుణామయ రూపం, చుట్టూ పుష్పాలు మరియు దీపాలతో భక్తి వాతావరణం.

Vandanam Giri Nandini Priya Nandhana! - Telugu Devotional Article | Sudhavishwam Akondi

వందనం గిరి నందినీ ప్రియ నందనా! తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | సుధావిశ్వం ఆకొండి

Published in manatelugukathalu.com on 17/09/2026


వందనం గిరి నందినీ ప్రియ నందనా! — గణపతి భక్తి గీతం భావ వివరణ

చిన్ననాటి రేడియో జ్ఞాపకాలను మధురంగా గుర్తుచేసే ఈ గణపతి భక్తి గీతం మనసుకు ఎంతో శాంతిని అందిస్తుంది.పార్వతీదేవి ప్రియ పుత్రుడైన శ్రీ గణేశుని కరుణ, మృదుత్వం, దైవత్వాన్ని ఈ గీతం చక్కగా కీర్తిస్తుంది.విఘ్నేశ్వరుని పాదపద్మాలకు శరణాగతి చేస్తూ ఐశ్వర్యం, సౌభాగ్యం, శుభాలను కోరుకునే భక్తి భావం ఇందులో కనిపిస్తుంది.సుధావిశ్వం అందించిన ఈ భావ వివరణ ద్వారా గీతంలోని ప్రతి పదానికి ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని తెలుసుకుందాం.


ఈ గీతం చిన్నప్పుడు రేడియోలో చాలాసార్లు విన్నాను. నాకెంతో ఇష్టమైన గీతం. ఈ గీతం రచించిన వారు ఎవరో తెలియదు. బుజ్జి గణపతికి శరణాగతి చేస్తూ వేడుకోవడం చాలా నచ్చింది.

మొట్టమొదట అమ్మతోనే మొదలు పెట్టారు ఈ కవి. అమ్మ జగన్మాతకు ఎంతో ఇష్టమైన పుత్రుడు కదా గణేశుడు!


గీతం...

వందనం వందనం

గిరినందినీ ప్రియనందనా!

// 2 //

వందనం వందనం మునిబృంద హృదయ స్యందన

వందనం వందనం

గిరి నందినీ ప్రియనందనా!

వందనం కరివదన కరుణ

సదయ నీ పదకమలముల కడ వందనం

వందనం వందనం

గిరి నందినీ ప్రియనందనా!

వందనం వందనం ముని బృంద హృదయ స్యందన


1. అయ్య కడ ఐశ్వర్యమడిగి

అమ్మ కడ సౌభాగ్యమడిగి

// 2 //

నెయ్యమున నీ చరణ దాసులకీయవా దేవాదిదేవా

వందనం వందనం

గిరి నందినీ ప్రియనందనా!

వందనం వందనం

ముని బృంద హృదయ స్యందన


2. వెన్న వలె, వెన్నెల వలె, పొన్నల వలె మెత్తనిది నీ మది

// 2 //

ధాత విని శుభదాతవని

మా బ్రతుకునేలే నేత నీకిదే వందనం

// 2 //

వందనం వందనం

గిరినందినీ ప్రియనందనా!

వందనం వందనం

ముని బృంద హృదయ స్యందన

వందనం కరివదన కరుణ

సదయ నీ పదకమలముల కడ వందనం

వందనం వందనం

గిరినందినీ ప్రియనందనా!

వందనం వందనం

ముని బృంద హృదయ స్యందన

వందనం వందనం

గిరినందినీ ప్రియనందనా

గిరినందినీ ప్రియనందనా


భావం:


హిమవంతుడు అనే పర్వతరాజుకు కూతురైన పార్వతీదేవికి అత్యంత ప్రియమైన పుత్రుడవు అయిన నీకు వందనమయ్యా!

🙏🙏🙏🙏🙏

ఋషులు, మునులు, యోగుల యొక్క హృదయాలలో కొలువై ఉన్న పార్వతీ ముద్దుల తనయా, నీకు వందనమయ్యా!

🙏🙏🙏🙏🙏

కరి వదనం గల నీవు హద్దులేని కారుణ్యం కలిగినవాడివి. అటువంటి నీ యొక్క పాదపద్మాలకు వందనమయ్యా!

🙏🙏🙏🙏🙏

ఓ గణాధిపా! దేవాదిదేవా! విఘ్నరాజా! వినాయకా!

నీ పాదపద్మాలను ధ్యానించే, పూజించే నీ చరణ దాసులము మేము. ఎంతో కరుణ కలిగినవాడవు అయిన నీవు, సర్వమంగళ అయిన అమ్మను సౌభాగ్యం ఇవ్వమని అడిగి తీసుకుని, అలాగే ఎల్లప్పుడూ శుభాలను కలిగించే తండ్రిని ఐశ్వర్యం అడిగి తీసుకుని, నీ చరణ దాసులము అయిన మాకు ఇచ్చి ఆదుకోవా దేవదేవా!

నీకు వందనమయ్యా!

🙏🙏🙏🙏🙏

ఓ కరి వదనా! విఘ్నేశ్వరా! గణనాథా! మూషిక వాహనా!

నీ మనసు చాలా సున్నితమైనది. త్వరగా కరిగిపోయి ఆర్తులను రక్షించేవాడివి. నీ మనసు వెన్నలా, పండువెన్నెలలా, పొన్నచెట్టు పూలలా ఎంతో మృదువుగా ఉంటుంది. అందుకే నీ శరణు కోరినవారిని వెన్నంటి రక్షిస్తావు తండ్రీ!

అటువంటి నీవు మాకు ధాతవు, శుభాలను ప్రసాదించేవాడివి. మా యొక్క జీవితాలను సక్రమంగా నడిపించి, నిన్ను చేరుకునేందుకు దారి చూపే అధినేతవు అయిన నీకు వందనమయ్యా!

🙏🙏🙏🙏🙏

ఓ పార్వతీ ప్రియ సుతా! మునుల హృదయాలలో నివసించే కరి వదనా! నీ యొక్క పాదపద్మాలకు వందనమయ్యా!


శరణు శరణు గణాధిపా!

🙏🙏🙏🙏🙏

— సుధావిశ్వం



***

సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):










సుధావిశ్వం

-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page