ఆఖరి మజిలీ
Updated: Aug 1
ఆఖరి మజిలీ, తాత మోహనకృష్ణ, కుటుంబ కథ, భావోద్వేగ కథ, విదేశీ ఉద్యోగం, దుబాయ్ ఉద్యోగం, తెలుగు కథ, సామాజిక కథ

Akhari Majili - Telugu Emotional Family Story | Mohana Krishna Tata
ఆఖరి మజిలీ - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | తాత మోహనకృష్ణ
Published In manatelugukathalu.com On 28/07/2026
డబ్బు కోసం కుటుంబానికి దూరంగా వెళ్లడం... "కొన్ని సంవత్సరాలు కష్టపడితే జీవితమంతా సుఖంగా ఉంటుంది" అనే ఆశ... కానీ విధి ఒక్కసారిగా మారితే? "ఆఖరి మజిలీ" కథలో విదేశీ ఉద్యోగం, కుటుంబ బంధం, యుద్ధం, పశ్చాత్తాపం, ఒంటరితనం కలిసిన ఒక హృదయ విదారక జీవితాన్ని తాత మోహనకృష్ణ ఎంతో భావోద్వేగంగా చిత్రించారు. డబ్బు కంటే మనుషులు గొప్పవారనే శాశ్వత సత్యాన్ని గుర్తుచేసే కథ ఇది.
"ఇక్కడ సంతకం పెట్టండి మేడం"
"అలాగే!"
"ఎక్కడికమ్మా ఇప్పుడు మనం వెళ్తున్నాము?" అడిగింది కూతురు కీర్తి.
"ఈ రోజు మీ అమ్మాయిని ఎందుకో తొందరగా తీసుకుపోతున్నారు హాస్టల్ నుంచి? ఏదైనా ట్రిప్ ప్లాన్ చేశారా మేడం?" అడిగింది హాస్టల్ వార్డెన్, సంతకం పెట్టిన రిజిస్టర్ లోపల పెడుతూ.
"అవును మిస్... మా అమ్మ అప్పుడప్పుడు ఇలానే సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ టైం ఇలాగే నన్ను జూపార్క్ కు తీసుకుని వెళ్ళింది. అక్కడ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు కూడా అమ్మ ఎక్కడికో పెద్ద ట్రిప్ ప్లాన్ చేసి ఉంటుంది... రేపు సండే కూడా కదా మరి."
"అవును కీర్తి.. ఈసారి చాలా పెద్ద సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాను."
"అవునా మేడం?" అంది వార్డెన్.
"అవును మేడం.." అంది కాంచన.
కాంచనకు రాజాతో కొన్ని సంవత్సరాల కిందట పెళ్లైంది. పెళ్ళికి ముందు...
*****
"రాజా! మనం తొందరగా పెళ్ళి చేసుకుందాం.. ఇంకా ఎన్నాళ్ళు ఇలా పార్కుల చుట్టూ తిరుగుతాం చెప్పు?"
"నేను మంచి జాబ్ లో సెటిల్ అయిన తర్వాత పెళ్ళి సంగతి చూద్దాం" అన్నాడు రాజా.
"ఇంక ఆగలేను బాబు.. మనకి ఎంతలో ఉంటే అంతలోనే బతుకుదాం" అంది కాంచన.
"అయితే నాదొక షరతు! పెళ్ళైన తర్వాత చుట్టూ ఉన్న వారిని చూసో, లేక ఆశ పుట్టో, డబ్బు కోసం మనం దూరం కాకూడదు. నాకు మాట ఇవ్వు."
"అలాగే రాజా.."
ఆ షరతుతో ఇద్దరికీ పెళ్ళి జరిగింది.
ఒకరోజు...
"మన పక్కింటి కాంతం వాళ్ళాయన దుబాయ్ వెళ్లి, అక్కడ బాగా సంపాదిస్తున్నాడు. కాంతం ఎంత ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నారు... ఏం చీరలు కడుతుందో! ఏం నగలు పెడుతుందో! మీరూ అలాంటి జాబ్ ఏమైనా చూసుకోండి..
ఈ క్లర్క్ జాబ్ లో ఏమిటి మనకి ఒదిగేది? తినడానికే సరిపోతుంది అంతే! ధరలు బాగా పెరుగుతున్నాయి... మన అమ్మాయి కూడా పెద్దదవుతోంది... ఆలోచించండి!"
"నీకు దూరంగా ఉండి నేను ఎంత సంపాదించినా, మనకి ఏమిటి ఆనందం చెప్పు? ఏదైనా ఇద్దరం ఒకేచోట ఉంటే అందం, ఆనందం... మీ నాన్న కూడా పోతూ పోతూ అదే కదా అన్నది."
"మా నాన్న పెద్ద ఆస్తి ఇచ్చి ఉంటే, నేను మీతో ఏకీభవించేదాన్ని.. ఏం ఇవ్వలేదుగా. హాస్పిటల్ లో ఆయన ఖర్చులు మొత్తం కూడా మనవే ఆయే."
"ఆ విషయం నిజమే అనుకో.."
"కాలం మారిందండి! మీరు ఇలా దుబాయ్ వెళ్లి ఒక ఐదు సంవత్సరాలు సంపాదిస్తే, ఇక మన లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఐదు సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి."
"నువ్వు మాట తప్పుతున్నావు కాంచన. ఒకసారి విదేశాలకు పోతే, మళ్ళీ అంత తొందరగా రాలేము.. అక్కడ ఇరుక్కుపోయినా కష్టమే! నా మాట విను.. ఉన్నదానిలో మనం హ్యాపీగా ఉందాం."
"పర్వాలేదు లెండి! నేను వెయిట్ చేస్తాను."
"ఓకే! నీకోసం వెళ్తాను.. నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండడం కోసం" అన్నాడు రాజా.
కొన్ని రోజుల తర్వాత...
"నాకు దుబాయ్ లో ఉద్యోగం వచ్చింది.. వచ్చేవారమే బయల్దేరతాను. నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం చూసుకో... బాగుంటుంది" అన్నాడు రాజా.
"అలాగేనండి.. నా మాట విన్నందుకు థాంక్స్!"
"మీరు ఉండరు, నేను నా బిజీ లో ఉంటాను కదా! పాపను హాస్టల్ లో వేసేయండి.. అక్కడే అది బాగా చదువుకుంటుంది."
రాజా దుబాయ్ వెళ్ళాడు. ఇక్కడ కాంచన జాబ్ లో జాయిన్ అయింది. కీర్తి హాస్టల్ లో చదువుకుంటోంది. కాలం గిర్రున తిరిగింది....
"ఏమండీ! మీరు దుబాయ్ వెళ్లి చాలా సంవత్సరాలు అవుతోంది.. ఇక వచ్చేయండి... నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను" అంది కాంచన.
"కొన్నాళ్ళు ఓపిక పట్టు. ఇంకా కాంట్రాక్టు అవలేదు.. అవగానే వచ్చేస్తాను" అన్నాడు రాజా.
అప్పుడప్పుడు ఇలానే ఫోన్ చేసి... దుబాయ్ నుంచి వచ్చేయమని అడుగుతూనే ఉంది కాంచన. కాంట్రాక్టు ముగిసాక వచ్చేస్తానని రాజా చెబుతూనే ఉన్నాడు.
కొన్ని రోజుల తర్వాత దుబాయ్ పై వేరే దేశం కాల్పులు మొదలు పెట్టింది.. ఆ యుద్ధం ఎప్పటికీ ఆగట్లేదు. ఇండియా వచ్చేద్దామనుకున్న వారంతా రాలేక అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు. రాజాది కూడా అదే పరిస్థితి. ఆ యుద్ధంలో ఎందరో చనిపోయారు. రాజా కూడా చనిపోయిన వార్త కాంచనకు చేరింది.
తాను చేసిన తప్పుకి కాంచన చాలా కుమిలిపోయింది. రాజాని దుబాయ్ కి పంపించకపోయినా బాగుండేదని ఎంతో బాధ పడింది. రాజా మాట, తన తండ్రి మాట విననందుకు ఇంకా కుమిలిపోయింది కాంచన. రాజా లేని జీవితం వ్యర్థం అని తన మనసు పదే పదే ధ్వనించింది.
*****
ముందుగా నిర్ణయించుకున్నట్టుగా... కార్ లో డ్రైవ్ చేసుకుంటూ కూతురితో సహా రైల్వేస్టేషన్ కు చేరుకుంది కాంచన. ఒంటరితనం భరించలేక, కూతురిని ఒంటరిని చేయలేక, అక్కడ కూతురితో సహా రైల్ పట్టాలపై ట్రైన్ కు ఎదురువెళ్ళి ఆత్మహత్య చేసుకుంది.
సమాప్తం.
***********
తాత మోహనకృష్ణ గారి కొన్ని ఇతర రచనలు:
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ












Comments