top of page
Original.png

అబద్ధాల బరువు


అబద్ధాల బరువు కథలో అంధ శిల్పి శివయ్య సోమశేఖర్ చేతిని తాకి అతని అబద్ధాన్ని గుర్తిస్తున్న దృశ్యం

Abadhala Baruvu - Telugu Moral Story | Vasundhara Rani Munipalle

అబద్ధాల బరువు తెలుగు నైతిక కథ | వసుంధర రాణి మునిపల్లె 

Published in manatelugukathalu.com on 03/09/2026


మనిషి ఇతరులను మోసం చేయగలడు… కానీ తన అంతరాత్మను మాత్రం ఎప్పటికీ మోసం చేయలేడు.

అబద్ధం చిన్నదే అనిపించినా, అది మనసులో పేరుకుపోతూ చివరికి మోయలేని భారంగా మారుతుంది. బాస్‌ దగ్గర పేరు కోసం, ఎదుటివారిని వెనక్కి నెట్టి పైకి రావడం కోసం, స్వార్థం కోసం అబద్ధాలను ఆయుధాలుగా మార్చుకున్న సోమశేఖర్‌ కథే “అబద్ధాల బరువు”. అంధుడైన శిల్పి శివయ్య చెప్పిన కొన్ని మాటలు అతని జీవితాన్ని, అతని అంతరాత్మను ఎలా వెంటాడాయో తెలిపే ఈ కథ నిజాయితీ, ఆత్మపరిశీలన, నైతిక విలువల గురించి ఆలోచింపజేస్తుంది.


సోమశేఖర్ నగరంలో ఒక ప్రైవేట్ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. అతని జీవితంలో ప్రతిదీ ఒక లెక్క ప్రకారం తన స్వార్థం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మాటల్లో నేర్పు, అవసరానికి తగినట్లుగా పచ్చి అబద్ధాలు చెప్పడం అతని నైజం.


ఆఫీసులో బాస్ దగ్గర మార్కులు కొట్టేయాలన్నా, తోటి ఉద్యోగులను వెనక్కి నెట్టి పైకి రావాలన్నా, స్నేహితుల దగ్గర గొప్పలు చెప్పుకోవాలన్నా అతనికి అబద్ధాలే ఆయుధాలు. ఎవరికీ దొరకనంతవరకు అన్నీ సవ్యంగానే జరుగుతాయని సోమశేఖర్ నమ్ముతాడు. అబద్ధం చెప్తే తప్పేంటి? ఎవరికీ నష్టం జరగనంతవరకు అది అబద్ధం కాదు లౌక్యం అని తన్ను తాను సమర్థించుకుంటూ ఉంటాడు.


ఒకరోజు ఆఫీసు పనిమీద పాత బస్తీలో ఒక ఇరుకైన గల్లీలో ఉన్న ప్రసిద్ధ శిల్పశాలకు సోమశేఖర్ వెళ్ళాడు. అక్కడ శివయ్య అనే వృద్ధ శిల్పి ఉన్నాడు. శివయ్య పుట్టుకతోనే అంధుడు. అయితేనేం, అతని చేతి వేళ్ళతో రాతిని తాకితే ఆ రాతిలో ఏ దేవుడు దాగున్నాడో, ఆ రాయికున్న జీవం ఎలాంటిదో చెప్పగల అద్భుతమైన నైపుణ్యం ఆయనది. నగరంలో ఆయన శిల్పాలకు మంచి గిరాకీ ఉంది.


సోమశేఖర్ అక్కడ చిన్న ఆకర్షణీయమైన విగ్రహాన్ని కొనుగోలు చేశాడు. బేరం ఆడటానికి ఎప్పట్లాగే నాటకం మొదలుపెట్టాడు. విగ్రహాన్ని చూపిస్తూ, "అయ్యా, ఇందులో చిన్న పగులు ఉంది. పైకి కనిపించదు కానీ ఇది ఎక్కువ రోజులు నిలవదు. మార్కెట్లో దీని రేటు చాలా తక్కువ" అని నిస్సిగ్గుగా అబద్ధం చెప్పాడు.


సోమశేఖర్ అలా మాట్లాడుతుండగానే శివయ్య చిన్నగా నవ్వాడు. నెమ్మదిగా తన పని ఆపి సోమశేఖర్ వైపు చేయి చాపి, "బాబు, విగ్రహం ఇలా ఇవ్వు" అంటూ సోమశేఖర్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. కళ్ళతో చూడలేని శివయ్య తన సున్నితమైన చేతి వేళ్ళతో సోమశేఖర్ వేళ్ళను, అరచేతిని తాకాడు. ఆ క్షణంలో సోమశేఖర్ గొంతులోని వణుకును, గుండె చప్పుడులోని మార్పును ఆ అంధుడు ఇట్టే పసిగట్టాడు.


శాంతంగా కానీ ఎంతో గంభీరంగా శివయ్య, "బాబు, ఈ రాయిలో ఎలాంటి పగుళ్ళూ లేవు. నీ మాటల్లోనే, నీ మనసులోనే అసత్యపు పగుళ్ళు ఉన్నాయి. మాటలతో ఇతరులను మోసం చేయగలను అనుకుంటున్నావు కానీ మనిషి అంతరాత్మ నుంచి వచ్చే సత్యాన్ని ఏదీ దాచలేదు. నా చేతి వేళ్ళలో రాతిని మాత్రమే కాదు, మనుషుల మనసులోని కల్మషాన్ని, వారి అబద్ధపు స్పర్శను కూడా తాకి చెప్పగలను" అన్నాడు.


శివయ్య చెప్పిన ఆ మాటలు విన్న సోమశేఖర్ కాసేపు నిశ్చేష్టుడయ్యాడు. గుండెల్లో ఏదో తెలియని భయం, సిగ్గు కమ్ముకున్నాయి. నిజమే, ఇతరులను మోసం చేయవచ్చని గర్వంతో తాను తన అంతరాత్మను ఎంతగా చంపుకుంటున్నాడో ఆ క్షణంలో అతనికి అర్థమైంది.


అక్కడికక్కడే తన తప్పును ఒప్పుకోవాలనిపించింది కానీ అంతలోనే అతనిలోని పాత సోమశేఖర్ బయటకు వచ్చాడు. భయం స్థానంలో మళ్ళీ అహంకారం ఆవహించింది. "ఇది కేవలం ఒక ముసలివాడు ఏదో మాట వరుసకన్నాడు. దీనికి అంత సీన్ లేదు" అని తన మనసును బలవంతంగా సర్దిచెప్పుకున్నాడు.


శివయ్య వైపు ఒక నకిలీ నవ్వు నవ్వి, విగ్రహానికి డబ్బులిచ్చేసి అక్కడినుంచి గబగబా బయటకు వచ్చేసాడు. కొన్ని రోజులు గడిచాయి. సోమశేఖర్ తన పాత అలవాట్లను మానుకోలేకపోతున్నాడు.


ఆఫీసులో ప్రమోషన్ కోసం మరో పెద్ద అబద్ధం ఆడాడు. తోటి ఉద్యోగిని ఇరుకున పెట్టి పైకి వచ్చాడు. ఆఫీసులో అందరూ అతన్ని అభినందించారు. బయటి ప్రపంచానికి అతను కోరుకున్న విజేతగా నిలిచాడు.


కానీ ఆ రాత్రి... సోమశేఖర్ తన గదిలో అద్దం ముందు నిలబడ్డాడు. ఆ అద్దంలో కనిపిస్తున్నది తన నిజమైన ముఖంలా అతనికి అనిపించలేదు. ఆ అంధ శిల్పి చేతివేళ్ళు తన గుండెను తాకినట్టు, చెప్పిన మాటలు ఆ చీకట్లో చెవుల్లో రింగుమంటున్నాయి.

ప్రమోషన్ వచ్చినా, డబ్బులు చేతిలో పడ్డా... ఆ రాత్రి అతను కంటి మీద కునుకు తీయలేకపోయాడు.


తన అంతరాత్మ అనే కోర్టులో మాత్రం అతను ఎప్పుడూ దోషిగానే మిగిలిపోయాడు. ఆ నిశ్శబ్దపు రాత్రి, ఆ అబద్ధాల మోయలేనంత బరువు అతని గుండెల్ని పిండేస్తోంది. గెలిచి కూడా పూర్తిగా ఓడిపోయిన ఒంటరి ప్రయాణికుడిగా సోమశేఖర్ అలాగే ఉండిపోయాడు.


***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):





వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page