top of page
Original.png

అన్నం

అన్నం, భోజనం, భోజనం విలువ, కుటుంబ బంధాలు, ఆప్యాయత, అన్నదానం, తెలుగు వ్యాసం, జీవిత పాఠాలు, మానవ సంబంధాలు, తెలుగు సాహిత్యం, Food, Family Values, Emotional Article

పెళ్లి విందు మరియు విషాద సమయంలో అన్నదానం ద్వారా మనుషులను కలిపే అన్నం విలువను ప్రతిబింబించే భావోద్వేగ తెలుగు దృశ్యం.
పెళ్లి విందు మరియు విషాద సమయంలో అన్నదానం ద్వారా మనుషులను కలిపే అన్నం విలువను ప్రతిబింబించే భావోద్వేగ తెలుగు దృశ్యం.

AnnamTelugu Inspirational Article | Kotha Viritha

అన్నం తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 23/07/2026


మనిషి జీవితంలో ప్రతి ముఖ్యమైన సందర్భానికి ఒక సామాన్యమైన అనుబంధం ఉంది... అదే అన్నం. సంతోషాన్ని పంచుకోవాలన్నా, బాధను పంచుకోవాలన్నా, విజయాన్ని జరుపుకోవాలన్నా, స్నేహాన్ని మరింత బలపరచాలన్నా మనం కలిసి భోజనం చేసే సంప్రదాయాన్ని ఎంచుకుంటాం. ఎందుకంటే భోజనం కేవలం ఆకలిని తీర్చదు... మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలను మరింత బలపరుస్తుంది. ఆహారం వెనుక దాగి ఉన్న ఈ గొప్ప జీవిత సత్యాన్ని ఎంతో హృద్యంగా వివరిస్తున్న వ్యాసమే "అన్నం".


ఒక విషయం ఎప్పుడైనా గమనించారా?

ఇంట్లో పెళ్లి జరిగినా, భోజనం.

ఇంట్లో విషాదం జరిగినా, భోజనం.


పుట్టినరోజు అయితే కేక్, చిన్న ట్రీట్.

ఆఫీసులో ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, టీమ్ లంచ్.

ప్రమోషన్ వస్తే, పార్టీ.

కొత్త ఉద్యోగం వస్తే, ఫ్రెండ్స్‌తో డిన్నర్.


జీతం పెరిగితే, ఫ్యామిలీతో హోటల్.

పరీక్షలో మంచి మార్కులు వస్తే, స్వీట్లు.

ఎన్నికల్లో గెలిస్తే, విందు.


ఎన్నో రోజుల తర్వాత స్నేహితులు కలిసినా, "పద... ముందు ఏదైనా తింటూ మాట్లాడుకుందాం" అంటారు.


ఎందుకంటే… భోజనం కేవలం కడుపు నింపదు... మనుషుల మధ్య ఉన్న ఖాళీలను కూడా నింపుతుంది.

ఆనందాన్ని పంచుకునే సందర్భంలోనూ, బాధను భరించే సందర్భంలోనూ, మనిషి సహజంగా ఎంచుకునేది భోజనాన్నే.


కార్పొరేట్ ప్రపంచంలో కూడా ఇదే సంప్రదాయం. ఒక ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయినా, కొత్త క్లయింట్ వచ్చినా, ఉన్న క్లయింట్ మెచ్చుకున్నా, అవార్డు గెలిచినా, టీమ్ టార్గెట్ చేరుకున్నా, 

"లెట్స్ గో ఫేర్ ఎ టీమ్ లంచ్"

అన్న మాటే ముందుగా వినిపిస్తుంది.


ఎందుకంటే, విజయానికి అసలు విలువ దానిని కలిసి జరుపుకున్నప్పుడు వస్తుంది.


అందుకే, ఎవరైనా మిమ్మల్ని భోజనానికి ఆహ్వానిస్తే, దాన్ని తేలికగా తీసుకోకండి.


"భోజనం పెట్టే బదులు ఏదైనా గిఫ్ట్ ఇచ్చుంటే బాగుండేది" అని అనుకోవద్దు. గిఫ్ట్‌కు ఒక ధర ఉంటుంది. కానీ ఒకరితో కూర్చొని భోజనం చేయడానికి, సమయం కావాలి, మనసు కావాలి, ఆప్యాయత కావాలి. ఒక గిఫ్ట్‌ను అల్మారాలో పెట్టేయొచ్చు. కానీ కలిసి చేసిన భోజనం జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది.


"సంతోషాన్ని పంచడానికి విందు, దుఃఖాన్ని పంచడానికి అన్నదానం"


భావాలు వేరు, కానీ భోజనం మాత్రం మనుషులను ఒక్కచోట చేర్చే బంధం.


ఎవరో మీకు అన్నం పెడితే, వారు ఖర్చు చేసిన డబ్బుకంటే, మీ కోసం కేటాయించిన సమయాన్ని గౌరవించండి.


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత
కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Don P Jagga
Don P Jagga
7 hours ago
Rated 5 out of 5 stars.

The line "Because... food doesn't just fill the stomach... it also fills the spaces between people" is the emotional core. It elevates the text from a simple list of events into a meaningful philosophy.... 👍

Like

Radha R
Radha R
a day ago
Rated 5 out of 5 stars.

👌

Like
bottom of page