అనుకోని అతిథి
- Addanki Lakshmi

- 12 hours ago
- 4 min read
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.
Telugu moral story, Yamadharmaraju story Telugu, charity Telugu story, life lesson Telugu story

Anukoni Athidhi - Telugu Inspirational Story| Addanki Lakshmi
అనుకోని అతిథి - తెలుగు ప్రేరణాత్మక కథ | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 23/05/2026
డబ్బు…లాభాలు…ఆస్తులు…
జీవితమంతా వీటి కోసమే పరుగెత్తిన ఒక మనిషి…ఒక రాత్రి కలలో వచ్చిన “అనుకోని అతిథి” వల్ల పూర్తిగా మారిపోయాడు.
“అనుకోని అతిథి” కథ, మనిషి జీవితంలో సంపద కంటే దానం, మానవత్వం, మరియు మంచి పనుల విలువ ఎంత గొప్పదో అద్భుతంగా తెలియజేస్తుంది.
తెల్లవారుతోంది. కలల లోకంలో సంతోషంగా విహరిస్తున్నాను. ప్రతిరోజూ లాభనష్టాలు చూపే షేర్ మార్కెట్ బిజినెస్లో ఆశా కంపెనీకి ఎంతో లాభం వచ్చింది.
50 లక్షలు! సంతోషం పట్టలేకుండా ఉన్నాను. ఏం చేయాలని, మళ్లీ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి?
రియల్ ఎస్టేట్ అయితే బాగుంటుందా? దేని మీద ఎక్కువ లాభాలు వస్తాయి? ఈ డబ్బుని ఇంకా పది రెట్లు చేయాలి కదా!
ఇలా తపన పడుతున్నాను.
ఇంతలో...
బెల్ మోగింది. వెళ్లి తలుపు తీశాను. ఏదో దైవ స్వరూపం...
ఎదురుగా నవ్వుతున్నాడు.
"ఎవరు నువ్వు?" అని ఆశ్చర్యపోతూ అడిగాను.
నేరుగా వచ్చి సోఫాలో దర్జాగా కూర్చున్నాడు.
"నేను అతిథిని. యమధర్మరాజు అంటారు. నిన్ను తీసుకుపోడానికి వచ్చాను" అంటూ నవ్వుతున్నాడు.
ఇప్పుడు ఆయన్ని బాగా పరిశీలించాను.
అదేదో 'సతీసావిత్రి' సినిమాలో చూపించారే, ఇంత లావుగా ఉంటాడు, గద పట్టుకుని వస్తాడు, మీసాలు, పెద్ద పెద్ద నగలు మెడ నిండా వేసుకుంటాడు. అవును, నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది, యమధర్మరాజు ఇట్లాగే ఉంటాడు!
అంతే! నాకు ఒంట్లో కొంచెం వణుకు పుట్టింది.
"అదేంటి? నేను నిన్ను పిలవలేదుగా," అన్నాను కొంచెం భయపడుతూ.
"పిలవకుండా వచ్చే వాళ్ళే కదా అతిథులంటారు. అతిథులను ఎవరూ పిలవరు. వాళ్లంతట వాళ్లే వస్తారు వాళ్లకు ఇష్టమైనప్పుడు," అంటూ నవ్వుతున్నాడు యమధర్మరాజు.
"అయ్యో, స్వామీ! అప్పుడే ఎందుకు వచ్చారు? నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. ఇప్పుడు ఈ షేర్ మార్కెట్లో ఎంతో లాభాలు వచ్చాయి. ఈ లాభాలతో ఇంకా బిజినెస్ అభివృద్ధి చేయాలి. మా ఆవిడ ఎక్కువ చదువుకోలేదు, దానికి డబ్బు విషయాలు ఏమీ తెలియదు పాపం. నాకు ఈ మధ్య 50 ఏళ్లు నిండాయి. ఇంకా 50 ఏళ్లు బ్రతకాలి కదా!
మనిషికి వందేళ్లు జీవితం అంటారు కదా, జీవితాన్ని ఎంతో అనుభవించాలి! అప్పుడే తీసుకుపోతే ఎలా? అసలు జీవితమంతా ఇప్పుడే మొదలవుతుంది," అన్నాను భయపడుతూ.
"నీలాంటి వాళ్లు ఎన్నాళ్లు బతికితే ఏంటి ఉపయోగం?
ఇంత డబ్బు వచ్చింది కదా, ఏం చేసుకుంటావు ఈ డబ్బంతా?
పిల్లలు మంచి చదువులో ఉన్నారు. మంచి జీతాలు తెచ్చుకుంటారు, వాళ్లకి నీ డబ్బుతో పని లేదు కదా!
ఎంతో సంపాదించావు. ఎవరికైనా ఒక్క రోజు భోజనం పెట్టావా? నీ అంత పిసినారి ఎవరూ లేరు ఈ భూమి మీద. బంధుమిత్రులను దరిచేరనివ్వవు. తల్లిదండ్రుల్ని ఆశ్రమంలో పెట్టావు. ఒక దైవ కార్యానికి గానీ, అనాధ బాలలకు గానీ ఎవరికీ ఒక్క నయాపైసా దానం చెయ్యవు. ఫ్లాట్ల మీద ప్లాట్లు కొంటావు.
ఇప్పటికే నీకు అన్ని అనారోగ్యాలు... బీపీ, షుగర్. కడుపునిండా తినడానికి నోచుకోలేదు.
బంధుమిత్రులు ఎవరికైనా ఒక్క పూట మీ ఇంట్లో భోజనం పెట్టావా?
ఎందుకొచ్చిన నీ బ్రతుకు? నలుగురికి సహాయం చేయలేని. ఒక అనాధను ఆదుకున్నావా? చదువు చెప్పించావా?
జీవితమంతా డబ్బు డబ్బు అని ఆర్జించావు. ఒక్క దాన గుణం లేదు.
అడుక్కుతినే వాళ్లను కూడా 'పో పోమ్మని' కసురుకుంటావు. నువ్వు, నీ డబ్బు వల్ల ఎవరికి ఉపయోగం లేదు. పద పద!
నీవు బ్రతికి ఉండడం సమాజానికి ఏమాత్రమూ ఉపకారము లేదు..."
అంటూ యమధర్మరాజు పాశం వేసి గట్టిగా లాగుతున్నాడు.
"వద్దు మహాప్రభూ! తీసుకెళ్లకు. నాకు ఇంకా బతకాలని ఉంది.
బుద్ధి వచ్చింది. నా డబ్బుతో సమాజానికి ఉపయోగపడే పనులను చేస్తాను," అంటూ వేడుకుంటున్నాను.
"లేదు, నువ్వేమీ మారవు. పద పద. చాలా పిసినారివి!"
కంఠానికి పాశము ఇంకా గట్టిగా బిగుసుకుని ప్రాణం పోతుంది. ఊపిరి ఆడటం లేదు...
అమ్మో అమ్మో! ప్రాణం పోతుంది!
"అయ్యో స్వామీ! రక్షించు! నాకు చావాలని లేదు, ఇంకా బతకాలని ఉంది. నాకు బుద్ధి వచ్చింది స్వామి, నా కళ్ళు తెరిపించావు. స్వామి, ఊపిరాడటం లేదు, ఈ పాశము నుంచి విడిపించు," అంటూ గట్టిగా అరుస్తున్నాను.
ఇంతలో మెలకువ వచ్చింది...
'అమ్మయ్య! ఇదంతా కలన్న మాట!' గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను.
"అమ్మో! ప్రాణం పోతుంటే ఎంత భయమేస్తుంది! యమధర్మరాజు రూపం చూస్తేనే భయం పుడుతుంది. నిజమే! నా జీవితానికి విలువ ఏది? ఇంతవరకు ఒక్క మంచి పని కూడా చేయలేదు."
మెల్లిగా లేచి ఆఫీసుకు తయారయ్యాను,
టిఫిన్ తింటూ భార్య సుశీలని పిలిచాను.
"మొన్న ఎవరో అనాధాశ్రమం వాళ్ళు డొనేషన్కి వచ్చారు కదా, వాళ్లకి ఫోన్ చేయి.
వాళ్ళు వస్తే లక్ష రూపాయలు చెక్కు రాశాను, ఇచ్చేసేయ్.
బ్లైండ్ స్కూల్ వాళ్ళు అన్నావు కదా. వాళ్లకి 50 వేలు చెక్ పెట్టాను, ఇచ్చేయ్...
నేను ఆఫీస్కి వెళ్లి వస్తా..." అంటూ నవ్వుతూ బయలుదేరాను. మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంది. మంచి పనులు చేస్తే మనిషికి ఇంత ఆనందమా!
ఎదురుగా ఉన్న నా భార్య సుశీలకి నోట మాట రావటం లేదు. ఆశ్చర్యపోతోంది.
"ఏవండీ! మీరేనా ఇలా మాట్లాడుతున్నారు?" సుశీలకి మతి పోయింది.
"అవును, నేనే.
నేను మళ్ళీ పుట్టాను," అంటూ ఆఫీస్కి వెళ్ళడానికి బయల్దేరాను...
నవ్వుకుంటూ...
ఆశ్చర్యం లో నుంచి తేరుకోవడానికి పాపం సుశీలకు చాలా టైం పడుతుంది, నవ్వుకున్నాను.
***
అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,










Comments