top of page
Original.png

అపర పరాక్రమవంతుడు


గ్రామం చివర బండపై కూర్చున్న ముగ్గురు స్నేహితులు, వారిని చూసి అయోమయంగా నిలిచిన అపర పరాక్రమం

Apara Parakramavanthudu | Telugu Humorous Satirical Story | Nallabati Raghavendra Rao

అపర పరాక్రమవంతుడు | తెలుగు హాస్య-వ్యంగ్య కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు

Published in manatelugukathalu.com on 19/08/2026


స్నేహం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండటం. కానీ స్నేహితుల కష్టాలు మరీ ఎక్కువైతే, ఆ స్నేహమే ఒక విచిత్రమైన పరీక్షగా మారుతుందా? ‘అపర పరాక్రమవంతుడు’ కథ అలాంటి సరదా పరిస్థితినే హాస్యంతో, వ్యంగ్యంతో మన ముందుంచుతుంది.

కేదారశెట్టి, జంబుకేశ్వరం, పండరి — ముగ్గురు క్లాస్‌మేట్స్. చదువులు పూర్తయ్యాయి కానీ ఉద్యోగాలు, పెళ్లిళ్లు మాత్రం ఇంకా దూరంగానే ఉన్నాయి. ప్రతిరోజూ ఊరి చివర పెద్దోళ్లబండపై కూర్చొని తమ కష్టాలను ఒకరికొకరు చెప్పుకుంటూ కాలం గడుపుతుంటారు. వారి జీవితాల్లో సుఖాల కంటే కష్టాలే ఎక్కువ.

అలాంటి సమయంలో సంవత్సరాల తర్వాత వారి పాత ప్రాణస్నేహితుడు అపర పరాక్రమం ఊరికి వస్తాడు. అతను పలకరించినా, పలకరించకుండా వెళ్లినా — రెండుసార్లూ అతనికి ఎదురైన పరిణామం మాత్రం ఒకటే! ఈ విచిత్రమైన పరిస్థితుల మధ్య స్నేహం, మనస్తత్వం, అసూయ, కష్టాల్లో ఉన్న మనిషి ఆలోచనా విధానం ఎంత భిన్నంగా ఉంటుందో రచయిత హాస్యభరితంగా చూపించారు.



కేదారశెట్టి, జంబుకేశ్వరం, పండరి ఈ ముగ్గురూ క్లాస్‌మేట్స్. చదువులయ్యాయి. ఇంకా జాబులూ, పెళ్ళాలూ రాలేదు.


ఆ ఊరిచివర పెద్దోళ్లబండ మీద కూర్చొని ప్రతిరోజూ సాయంత్రం కష్టసుఖాలు ఒకరికొకరు ఏకరువు పెట్టుకుంటారు. ఇందులో కష్టాలు 99 పాళ్ళు ఉంటాయి.


సుఖాలు ఒక పాలు... అదైనా ఉంటే ఉండవచ్చు లేకపోతే ల్ల ల్ల ల్లా! అంటే ఉండవన్నమాట.


'ఊర్లో తింగర అంగరోళ్లు...' అన్న నిక్ నేమ్ మాత్రం వాళ్లకు ఫిక్స్ అయిపోయింది.

సరే... వాళ్ళు రోజూ కూర్చొనే ఆ ఊరిచివర పెద్దోళ్లబండ ఎంత మహాపాపం చేసుకుందో కానీ, వీళ్ళ కష్టాలు వింటూ అది కూడా అలా కాలం గడిపేస్తుంది ప్రతిరోజూ.


వీళ్లు ఏ రోజైనా రాకపోతే ఆ బండ ఎన్నో అష్టకష్టాలు పడిపోయినట్టు తెగ ఫీలైపోతుంది. దాని కష్టాలు దానివి పాపం. వీళ్లతో దానికి ఉన్న బాండింగ్ అలాంటిది.


సరే... వీళ్ళు ముగ్గురు వచ్చేటప్పుడు విడివిడిగా పెద్ద జేబు రుమాళ్ళు తెచ్చుకుంటారు. వెళ్లేటప్పుడు అవి పిండితే ఒక్కొక్క గ్లాసుడు కన్నీళ్లు కూడా వస్తాయి. అవి ఆ బండ మీదే పిండుతారు. దాంతో మహా ఆనందపడిపోతుంది. ఏదో అమృతాభిషేకం జరిగినట్టు తెగ ఫీలైపోతుంది ఆ బండ. దాని పిచ్చి ఆనందం దానిది.


సరి సరే... బండ కథ కూడా పక్కన పడేస్తే... ఒకప్పటికి వీళ్ళ ముగ్గురి క్లోజ్ ఫ్రెండ్ 'అపర పరాక్రమం' చాలా సంవత్సరాల తర్వాత అప్పుడే ఊర్లోకి వస్తున్నాడు బస్సు దిగి. గతంలో ఈ ఊర్లో వీళ్లతో కలసి చదువుకునేటప్పుడు అపర పరాక్రమం రాసుకుపూసుకు తిరిగే సంప్రదాయంలో స్నేహితుడన్నమాట. తన కర్మకాలి ఇప్పుడో రాచకార్యక్రమం చక్కబెట్టడానికి ఒకప్పటి తన ఊరు వచ్చాడన్నమాట.


తిన్నగా తన పని చక్కబెట్టుకొని వెళ్లక, ఆ బండ మీద కూర్చున్న ఆ ముగ్గురు ఫ్రెండ్స్‌ని చూసి మనసులో ఆనందం పట్టలేక వాళ్ళ దగ్గరికి వెళ్లి, "హలో ఫ్రెండ్స్... బాగున్నారా?" అంటూ నవ్వుతూ అడిగేసాడు.


దాంతో... ఒక్క నిమిషం కూడా ఆగకుండా వాళ్ళ ముగ్గురు గబాలున పైకి లేచి తమ కాళ్లతో, చేతులతో అపర పరాక్రమాన్ని కింద పడగొట్టి కుమ్మేసి చితకకొట్టేశారు.

"అదేంటిరా! ప్రాణస్నేహితులం కదా అని... 'బాగున్నారా' అని అడిగాను. అదే నేను చేసిన తప్పా? ఎందుకు కొడుతున్నారు?" అంటూ ఏడుస్తూ ప్రశ్నించాడు అపర పరాక్రమం... అలా నేలమీదే పడివుండి.


"జీవితం నరకప్రాయమై అష్టకష్టాలలో ఉండి ఏం చేయాలో తెలియక చచ్చిపోదామని మేము ప్రయత్నిస్తుంటే... 'బాగున్నారా?', 'స్వీట్లు తింటున్నారా?', 'షేక్ హాండ్స్ ఇచ్చుకుంటున్నారా?' అని నవ్వుతూ ఎలా అడగ్గలుగుతున్నావురా? నీకు నోరెలా వచ్చింది? అందుకే చిర్రెత్తి నిన్ను చితక్కొట్టేసాం. నువ్వు ఎక్కడో హాయిగా జాబ్ చేసుకుంటుంటే, ఇక్కడ మేమందరం జీడిపప్పు పరమాన్నం తింటున్నాము అనుకుంటున్నావా?" అంటూ వాళ్ళ ముగ్గురు కోపంగా అరుచుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు.


అపర పరాక్రమం... తన పరాక్రమం అంతా ఏమైపోయిందో తెలుసుకోలేని అదోరకమైన డోలాయమాన పరిస్థితిలో పడిపోయి చాలాసేపు అలాగే నేలమీద పడి కొట్టుకున్నాడు. అసలు తను పుట్టిన ఊరు ఇప్పుడెందుకొచ్చాడో మరచిపోయి, మళ్ళీ దిగినచోటే బస్సు ఎక్కేసి ఇంటికెళ్ళిపోయాడు.


అలా జరిగి సంవత్సరం గడిచిపోయింది. అపర పరాక్రమం అలాగే బస్సు దిగి మళ్ళీ తను పుట్టిన ఊర్లోకి వస్తున్నాడు ఓ శుభముహూర్తాన. మళ్లీ అదే బండ మీద కూర్చున్న ఒకప్పటి తన ముగ్గురు ప్రాణ స్నేహితులను చూసి, గతం గుర్తుకొచ్చి భయపడి బుర్ర పైకి ఎత్తకుండా నడుచుకుంటూ గబగబా వెళ్లిపోతున్నాడు వాళ్లను దాటి.


ఒక్క నిమిషం కూడా ఆగకుండా వాళ్ళ ముగ్గురు గబాలున పైకి లేచి తమ కాళ్లతో, చేతులతో అపర పరాక్రమాన్ని కింద పడగొట్టి కుమ్మేసి చితకకొట్టేశారు... ఈసారి కూడా!

"గతంలో ప్రాణస్నేహితులం. గోళీలు ఆడుకున్నాం, కుప్పిగంతులేశాం, కొట్టుకున్నాం, గుడ్డ ముక్కలేకుండా చెరువులో ఈతకొట్టాం... అవన్నీ మరచిపోయావేంటిరా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఒరేయ్... అపారమైన పరాక్రమం... నిన్నేరా... పలకవేం?


మేమందరం చాలా కష్టాల్లో ఉన్నాం. విషం కొనుక్కోడానికి కూడా డబ్బులు లేవు. సంవత్సరం తర్వాత బస్సు దిగి ఊర్లోకి మహారాజులా నడుచుకుంటూ వస్తున్నావు. కనీసం 'బాగున్నారా' అని మాటవరసకు అడక్కుండా తలవంచుకొని వెళ్ళిపోతున్నావేంట్రా? నువ్వు అసలు మనిషివేనా? నీది హృదయమా, రాతిబండా? అందుకనే మాకు మండి కొట్టాం" అంటూ వాళ్ళ ముగ్గురు మళ్ళీ పిడిగుద్దులు గుద్ది కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయారు.


నేల మీద పడి మాట పడిపోయి గుండె ఆగిపోయినట్టయిపోయాడు అపర పరాక్రమం... ఈసారి కూడా!


ఐతే... ఈసారి అపర పరాక్రమం భయపడలేదు, ఏడవలేదు. ధైర్యంగా ఆలోచించాడు. ఒక్కటే ఆలోచించాడు. "మళ్ళీ ఎప్పుడైనా వచ్చి ఈ ప్లేస్ మీదుగా వెళ్తున్నపుడు... తను అష్టకష్టాలలో లేకపోయినా ఉన్నట్లుగా వాళ్ళ దగ్గర లబోదిబోమని ఏడ్చి గోల చేసి గగ్గోలు పెడితే చాలు వాళ్ళు ఆనందిస్తారు" అని నిర్ణయించుకొని, తన కార్యక్రమం ఇప్పుడు ఆ ఊరిలో పూర్తి చేసుకుని తిరిగి తన ఊరు వెళ్ళడానికి మహా ధైర్యంగా నిశ్చయించుకొని మహా పరాక్రమంతో పైకి లేచాడు అపర పరాక్రమం!


సమాప్తం


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి కొన్ని ఇతర రచనలు:




నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


నల్లబాటి రాఘవేంద్ర రావు



నల్లబాటి రాఘవేంద్ర రావు


నల్లబాటి రాఘవేంద్ర రావు

రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page