top of page
Original.png

బంగారు కుటుంబం

5 hours ago
8 min read

బంగారు కుటుంబం కథలో తమ్ముడి భవిష్యత్తు కోసం త్యాగం చేసిన అన్న, చదువుతో జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్న తమ్ముడు

Bangaru Kutumbam | Telugu Family Story | Nallabati Raghavendra Rao

బంగారు కుటుంబం | తెలుగు కుటుంబ కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు

Published in manatelugukathalu.com on 17/11/2026


తప్పుదారి పట్టిన తమ్ముడి జీవితాన్ని మార్చేందుకు ఒక అన్న చేసిన త్యాగం, ప్రేమ, నమ్మకం చివరకు అతనిలో కొత్త ఆశను ఎలా నింపాయో చెప్పే హృదయస్పర్శి కుటుంబ కథ ఇది.



కృపానిధి, అరుణాకర్ అన్నదమ్ములు. ఇద్దరికీ నాలుగేళ్ల వయసు తేడా. కృపానిధి తన తండ్రి బతికుండగానే ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తూ పెద్ద జీతం పొందే స్థాయికి ఎదిగాడు.


నాలుగేళ్ల క్రితం తండ్రి చనిపోయిన దగ్గర నుండి అన్నగారు ఎంత అదుపు ఆజ్ఞలలో పెట్టి చూస్తున్నప్పటికీ తమ్ముడు అరుణాకర్ ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేసి చెడు స్నేహాల బాట పట్టి జులాయిగా తిరగడం ప్రారంభించాడు. 


జీవితానికొక గమ్యం లేకుండా, పెద్దలంటే గౌరవం లేకుండా.. కుటుంబ పేరు అప్రతిష్టపాలు చేస్తూ బతుకుతున్న తమ్ముడిని చూసి అన్నగారు బెంగపెట్టుకున్నట్టు బతుకుతున్నాడు.


తమ తల్లి పెద్ద తెలివితేటలు అయినది కాదు. 


దాంతో తమ్ముడి భవిష్యత్తు విషయంలో చనిపోయే ముందు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం.. కృపానిధి ఊరి పెద్దలతో తమ్ముడికి చెప్పించి చూశాడు. 


తర్వాత బంధువులను రప్పించి వారి ద్వారా జీవితం అంటే ఏమిటో, చదువు మనిషికి ఎంత అవసరమో అవగాహన కలిగించేలా చాలా ప్రయత్నం చేశాడు ఈ నాలుగేళ్లలో. 


ఫలితం లేదు.


చివరికి అరుణాకర్ ఇంటిలో ఉన్న తన పుస్తకాలు, తన అన్నగారి పాత పుస్తకాలు అయిన కాడికి అమ్మేసి సిగరెట్లు, మందు కొనుక్కొని ఎంజాయ్ చేసే అతి నీచమైన స్థితికి దిగజారిపోయాడు.


ఒకరోజు పార్కులో చెడు స్నేహితులతో కూర్చుని సిగరెట్ తాగుతూ పేకాట ఆడుతూ మందు కొడుతున్న తమ్ముడిని మంచి మాటలతో సిటీలో ఉన్న తమ ఫ్యామిలీ డాక్టర్, మానసిక వైద్యుడు సత్యశివానందం గారి దగ్గరకు తీసుకువెళ్ళాడు కృపానిధి.


విషయం అంతా తెలిసిన సత్యశివానందం గారు.. "ముందు చదువు మీద వీడికి ఇంటరెస్ట్ కలిగించాలి. ఆ తర్వాత మిగిలిన మంచి లక్షణాలన్నీ గాడిలో పడతాయి" అంటూ కృపానిధికి చెప్పి వెంటనే కౌన్సిలింగ్ ద్వారా తన ప్రయత్నం మొదలుపెట్టాడు.


"ఇదిగో అరుణాకర్! ముందు నువ్వు చదువు మళ్ళీ కొనసాగించి బాగుపడాలి. మీ అన్నయ్యకు పెళ్లి చేసుకునే వయసు. కానీ నీ గురించే ఆగిపోయాడు. 


నీ ప్రవర్తన చూసి వచ్చిన భార్య విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుంది అన్న భయం పట్టుకుంది అతనికి. 


ఓ పక్క నీ తల్లి నీ మీద బెంగతో ఆరోగ్యం మరింత పాడు చేసుకుంటుంది. చూస్తున్నావు కదా! సరే ఇవన్నీ నీ చెవికి వినపడవని నాకు తెలుసు కానీ నా మీద గౌరవంతో కాసేపు సిగరెట్ పక్కన పడేయ్, చిన్న కథ చెబుతాను" అంటూ మొదలుపెట్టాడు.


"ఒక ఊరిలో గ్రామస్తులు అడవికి వెళ్లి రెండు పెద్ద బండరాళ్లు తెచ్చారు. అవి రెండు దైవ శిల్పాలుగా చెక్కించాలని వాళ్ళ ఉద్దేశం.


శిల్పి ఒక బండను చెక్కుతుంటే కాసేపటికి ఆ బండ గట్టిగా.. 'అడవిలో నా మానాన నేను హాయిగా ఉండేదాన్ని. 


ఏంటి అలా చెక్కిపడేస్తున్నావు? బాధలు భరించలేకపోతున్నాను. ఆపు చేయి..' అని అరిచేసిందట. 


భయపడిన శిల్పి ఆ బండను పక్కన పడేసి రెండో బండరాయిని చెక్కడం ప్రారంభించాడట. 


అది తనకు జరుగుతున్న కష్టాన్ని దిగమింగుకుంటూ, అణగదొక్కుకుంటూ ఉందట. 


సాయంత్రానికి ఆ బండ అద్భుతమైన దైవశిల్పంగా మారిపోయిందట. మర్నాడు నుండి గర్భగుడిలో పూజలు అందుకోవడం మొదలుపెట్టింది. 


గుడి బయట పడేసిన పనికిరాని ఆ మొదటి బండ మీద భక్తులు పైకి ఎక్కి కాళ్లు కడుక్కుంటూ దాని మీదే కొబ్బరికాయలు కొట్టడం మొదలుపెట్టారట. ఈపాటికి నీకు కథంతా అర్థమైపోయిందనుకుంటాను" అంటూ ఆగారు డాక్టర్ గారు.


అరుణాకర్ సిగరెట్టు తాగుతూ పొగ రివ్వు రివ్వున గాలిలోకి ఊదుతూ చెవిలో ఉన్న రెండు దూది ఉండలు తీసి అక్కడే కింద పడేసి చరచరా బయటికి వెళ్లిపోయాడు.


"లాభం లేదురా కృపానిధి, వీడిది మానసిక సమస్య కాదు. నేను వైద్యం చేయలేను కానీ నువ్వే ఏదో ఒకటి ఆలోచించుకో" అంటూ పంపించేశాడు.


వాళ్లు వీళ్లు చెప్పిన మీదట భూతవైద్యుడి మంత్ర తంత్రాల పూజలు, ఆ తర్వాత దేవుని గుడిలో అభిషేకాలు అన్నీ పూర్తి చేశాడు. 


తమ్ముడికి చదువు పట్ల ఎందుకు ఆసక్తి తగ్గిపోయిందో తెలుసుకునేందుకు సిద్ధాంతులకు జాతక చక్రం చూపించాడు. వాళ్లు చెప్పిన పరిహారాలు పూర్తి చేశాడు. ఎన్ని చేసినా ఫలితం శూన్యం.


"భవిష్యత్తులో వీడు ఎలా బతుకుతాడు? ఏదో ఒకటి చేసి ఆదిలోనే తమ్ముడి జీవితం బాగుపరచాలి. 


ఇంకా ముదిరిపోతే నావల్ల కాదు" అంటూ తనలో తనే నిర్ణయించుకున్న కృపానిధి ఒకరోజు తమ్ముడిని తన గదిలో తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు.


"తమ్ముడూ నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు. నాలుగేళ్ల నుండి చదువు మానేశావ్. నీ మనసులో పెళ్లి చేసేసుకోవాలి అనుకుంటున్నావా? ముందు నీకే అమ్మాయిని చూస్తాను. లేదూ ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటున్నావా? తప్పకుండా పెద్ద వ్యాపారం నీ చేత పెట్టిస్తాను. 


ఇంకా ఏదైనా నీ మనసులో ఉంటే నాకు చెప్పరా. నీ మంచి గురించి ప్రయత్నించి నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను రా. ప్లీజ్ చెప్పరా.." అంటూ ప్రేమపూర్వకంగా రెండు చేతులు పట్టుకుని అడిగాడు.


అరుణాకర్ విసురుగా పైకి లేచి అన్నగారి కళ్ళల్లోకి కొరకొర చూస్తూ.. మరింత విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.


పరిస్థితి అర్థం కాలేదు కృపానిధికి. తమ్ముడి బాగు విషయంలో తనకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు ఇంకెవరూ లేరు.


'ఎలాగైనా తమ్ముడి జీవితం గాడిలో పెట్టాలి. తన అంతటి వాడిని చేయాలి. తప్పుదారి పడిన వాడు పైకి లేచే ఆలోచన చేయలేడు. 


అరకొర చదువుతో నిర్వీర్యుడిగా బతకడం.. తన ఎదురుగా తన తమ్ముడు దౌర్భాగ్య జీవితం అనుభవించడం.. అలా అలా మట్టిలో కలిసిపోవడం. 


తను బాగుండి తన చేతులతోనే తమ్ముడిని మట్టి చేయాలా? హే భగవాన్..' చాలాసేపు మౌనంగా ఆలోచించి ఖచ్చితమైన ఒక నిర్ణయానికి వచ్చాడు కృపానిధి. తల విదిలించి పైకి లేచాడు.


రెండు రోజులు గడిచాయి. కృపానిధి ఆరోజు ఉదయం.. తల్లితో తమకు కావలసిన బట్టలు తీసుకుని ఆటో మీద బయలుదేరాడు.. ఊరవతల చిన్న ఇంటిలో కాపురం ఉండడానికి. 


అప్పటికే బయటకు వెళ్ళిపోయిన అరుణాకర్ మధ్యాహ్నానికి మత్తుగా ఇంటికి వచ్చి టేబుల్ మీద ఉన్న లెటర్ తీసి చదవడం ప్రారంభించాడు...


"తమ్ముడూ.. నీకు నాన్న ఇచ్చిన ఇల్లు కాకుండా నాకు నాన్న ఇచ్చిన ఆ రెండో ఇల్లు కూడా నీ పేరున నా గిఫ్ట్ డీడ్‌గా మార్పించాను. 


అంతే కాదురా నాన్న అనంతరం మనకు చెరొక 30 లక్షలు క్యాష్ వచ్చింది కదా! నా పేరున ఉన్న నా 30 లక్షలు నీ బ్యాంక్ అకౌంట్‌లోకి నువ్వు వాడుకునేలా ట్రాన్స్‌ఫర్ చేయించాను. 


ఇంకో విషయం చెప్పనా.. ఈ నాలుగేళ్లలో నా జీతంగా నేను సంపాదించిన మిగిలిన మొత్తం కూడా నీ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించాను. చదువు పక్కనపెట్టి తప్పుగా ప్రవర్తిస్తున్న నీకు ఇంత ప్రాపర్టీ అప్పజెప్తే పాడు చేస్తావన్న భయం నాకు లేదురా. 


పోయినా పర్వాలేదు. నేను నిన్ను నమ్ముతున్నానని నువ్వు నన్ను నమ్మితే చాలు. ఇదంతా ఎందుకంటే.. 'నీ పట్ల నేను నిజాయితీగా ఉండి.. నీకు న్యాయం చేస్తున్నాను' అని నాన్న కలలో కనిపిస్తే చెప్పడానికి రా. 


నాకు సంపాదన ఉంది కనుక అమ్మ బాధ్యత నేను తీసుకుంటాను. నీకు జీవితం పట్ల నమ్మకం కలగడానికి నేను ఇంకేం చేయగలను? మళ్లీ నువ్వు చదువు మొదలుపెట్టి నా అంత వాడు కావాలి. 


ఇదంతా నీకు చెప్పి అదిగో... అని ఆశ చూపించటం, ఏవో రూల్స్ విధించడం నా 'రక్తం' విషయంలో కరెక్ట్ కాదని మొత్తం ట్రాన్స్‌ఫర్లు చేయించాను.


అలాగని నిన్ను నేను విడిచి దూరంగా ఉండలేనురా. నువ్వు పిలిస్తే పలికి వచ్చి నీ మంచి చెడ్డలు చూసే అంత దగ్గరలోనే ఉంటాను రా తమ్ముడూ.


నీ దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా ఖర్చయిపోయి చదువు లేనిదే ఈ లోకంలో శిఖర మార్గం వైపు పయనించలేమని నీకు నువ్వుగా తెలుసుకుని జీవితం పునఃప్రారంభం చేయాలి.. అలాగని నువ్వు నిర్ణయించుకునే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది రా.. అప్పుడు నీకు నేను కన్న తండ్రిగా చేయూతనిస్తాను. నా ధర్మం నిర్వహిస్తాను."


అన్నగారు రాసిన లెటర్ పూర్తిగా చదివాడు అరుణాకర్.


తల గిర్రున తిరిగింది. తను భూమి మీద నిలబడి ఉన్నాడో భూమి పొరల్లోకి కూరుకుపోతున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు. తనలో ఒక్క నిమిషంలో ఏమిటో ఈ మార్పు తనకే అర్థం కాలేదు. 


తన మనసు చేసే గారడీ నుంచి బయటపడ్డాడు అరుణాకర్. అప్పుడే అతనికి అరుణోదయమైంది.


"అన్నయ్యా.. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న మూర్ఖుడిని. నాకు చదువు పట్ల శ్రద్ధ కలగడానికి నువ్వు తీసుకున్న ఈ నిర్ణయాలు నన్ను కదిలించాయి.. ఇలా చదువు మధ్యలోనే ఆపేసిన ప్రతి వాళ్ళ జీవితాలలో నీలాంటి అన్నయ్యలు కానీ మరెవరైనా కానీ ఉంటే ఈ సమాజం బృందావనం అయిపోతుంది. సరే.. నా నిర్ణయం కూడా విను అన్నయ్యా. 


ఈ మొత్తం ప్రాపర్టీలో ఒక్క పైసా ముట్టుకోకుండా ఎక్కడైనా కష్టపడి పనిచేసి మళ్లీ చదువు మొదలుపెట్టి ఎంసెట్లో ర్యాంకు తెప్పించుకొని అప్పుడు నీకు కనిపిస్తాను అన్నయ్యా.. ఒక్కమాట.. అంతవరకు అమ్మ జాగ్రత్త."


తన అన్నగారు రాసిన లెటర్ పక్కనే తను రాసిన లెటర్ కూడా పెట్టి బయటకు వచ్చాడు అరుణాకర్.. ఇప్పుడు అతను గ్రహణం నుండి బయటపడి తేజస్సుతో ఉదయిస్తున్న సూర్యుడిలా ఉన్నాడు.


ఎంత గొప్పవాడైనా ప్రతి మనిషిలోనూ మార్పు వచ్చే సమయం, సందర్భం అంటూ ఒకటి ఉంటుంది.


అలా మార్పు వచ్చి తప్పుగా నడుస్తున్న ప్రతి వాళ్లు 'మనిషి'గా మారగలిగితే ఈ సమాజంలో ప్రతి కుటుంబం 'బంగారు కుటుంబం' కాక ఇంకేమవుతుంది? తథాస్తు.


సమాప్తం









📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి కొన్ని ఇతర రచనలు:




నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


నల్లబాటి రాఘవేంద్ర రావు

నల్లబాటి రాఘవేంద్ర రావు








నల్లబాటి రాఘవేంద్ర రావు

రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page